నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ లో ఏడుకొండలు మరణంపై వివరిస్తున్న వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి

Lockup Death | ఔను.. వారిద్దరూ చూశారంట.. వైసీపీ మాజీ మంత్రి కాకాణి

ఏడుకొండలు లాకప్ డెత్ పై సహ నిందితులు ఏమన్నారంటే...


నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన "లాక్ అప్ డెత్‌" ప్రకంపనలు సృష్టిస్తోంది. దళిత సామాజికవర్గానికి చెందిన బొల్లి ఏడుకొండలు (50) ఓ బంగారు గొలుసు చోరీలో నిందితుడు. ఇతనిది ముమ్మాటికి కస్టోడియల్ డెత్ అని వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసులే కొట్టి చంపారంటూ, మృతుడి కుటుంబీకులు కూడా ఆరోపిస్తున్నారు.


"అతను పోలీసు కష్టడీలో మరణించలేదు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు" అని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తేల్చి చెప్పారు. అయితే,
"ఏడుకొండలును కారులో స్టేషన్ కు తీసుకుని వచ్చారు. అందులో నుంచి దిగలేకపోయాడు. మేము చూసిందే చెబుతున్నాం" అని సహ నిందితులు ప్రసాద్, రియాజ్ మీడియా వద్ద వెల్లడించారు. దీంతో ఏడుకొండలు మరణించడం వెనుక పోలీసుల పాత్ర ఏమిటి? ఈ సంఘటనలో ఎవరి ప్రమేయం ఉంది? అనే అంశాలపై వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి సమక్షంలో గొలుసు చోరీ కేసులో నిందితులుగా ఉన్న ప్రసాద్, రియాజ్ కీలకంగా మారారు.

ఘటన ఇదీ..

ఒక దొంగతనం కేసులో అనుమానితుడిగా ఉన్న మనుబోలు మండలం చెరుకుముడి గ్రామానికి చెందిన ఏడుకొండలను ఏడుకొండలు (50)అనుమానాస్పద స్థితిలో మంగళవారం రాత్రి ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందాడు. అంతకు నాలుగు రోజుల కిందటే పోలీసులు ఏడుకొండలును విచారణకు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. గత ఐదు రోజులుగా ఏడుకొండలను పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి, పోలీసులు విచారణ పేరుతో తీవ్రంగా కొట్టడం వల్లే ఆయన మరణించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
"ఏడుకొండలు పోలీసుల అదుపులో ఉన్నారనే సమాచారం కూడా మాకు ఇవ్వలేదు. రాత్రి సమయంలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారని సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న తర్వాత ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని చూపించడానికి నిరాకరించారు" అని మృతుడు ఏడుకొండలు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
"పోలీసులే కొట్టి ఏడుకొండలును కొట్టి చంపి, ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు" అని అంటున్నారు.
లాకప్ లోనే నిందితుడు మరణించాడు. దీనిపై సమగ్ర విచారణ జరపాలి. బాధితులకు న్యాయం చేయడానికి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి" అని వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మానవహక్కుల సంఘంతో పాటు ఎస్సీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. బంగారు గొలుసు చోరీ, రికవరీ తరువాత జరిగిన పరిణామాలపై ఇందులో ఏమి జరిగింది?
నిందితులుగా ఉన్న మరో ఇద్దరు ఏమి చెప్పారనేది ఈ వీడియోలో చూడండి

Read More
Next Story