బాబూ తిరుపతిలో  భూ ఆక్రమణల వెనుక ఆ మంత్రి లీలలు చూడు
x
తిరుపతిలో బాధితులతో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ నేత డాక్టర్ కే. నారాయణ

బాబూ తిరుపతిలో భూ ఆక్రమణల వెనుక ఆ మంత్రి లీలలు చూడు

సిపిఐ జాతీయ నాయకులు కే నారాయణ ఘాటు ఆరోపణ


తిరుపతి నగరం అవిలాల చుట్టుపక్కల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. స్థానిక టిడిపి నాయకులు ప్రవేశంతో ఎమ్మెల్యే ప్రవేశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లు సిపిఐ జాతీయ నాయకుడు కే నారాయణ ఆరోపించారు.

బాలాజీ కాలనీలోని సీనియర్ సిటిజన్స్ అయిన నల్లపరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వనజ ల ఇంటికెళ్లి వాళ్లను సీపీఐ నారాయణ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కే నారాయణ మాట్లాడుతూ..
"తిరుపతి అత్యంత పవిత్రమైంది. ఇలాంటి చోట్ల దౌర్జన్యాలు, రౌడీయిజం మంచిది కాదు
ని ఇలా జరిగితే టిడిపి పైనాయకత్వానికి తీరని మచ్చగా ఉంటుంది" అని నాారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు హితవు పలికారు.

"అవిలాల సర్వే నంబర్ 476/ 1 లో మూడు ఎకరాల 17 సెంట్లు భూమిని వనజ కష్టార్జితంతో ఆమె భర్త దొరకనాథరెడ్డి ఉద్యోగరీత్యా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో కొనుగోలు చేశారని, ఈ భూమిని ఈరోజు విజయవాడలోనే కైకలూరు కు చెందిన దోనేపూడి శివ నాగ ప్రసాద్ పేరుతో రిజిస్టర్ కావడం. దీని వెనక రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ కు బినామీగా ఉన్నారు
" అనే విషయం స్ఫష్టంగా కనిపిస్తోందని సీపీఐ నారాయణ అన్నారు
"రెవెన్యూ మంత్రి సహకారం లేకుండా ఇవన్నీ జరగవు . అందుకే టిడిపికి నేరుగా చెప్తున్నా మీ మంత్రులే నేరుగా ల్యాండ్ కబ్జాలకు దౌర్జన్యాలకు రౌడీయిజాన్కు పాల్పడడం ఏమిటి" అని ఆయన ప్రశ్నించారు. డాక్యుమెంట్ మొత్తం పరిశీలన చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా అనామకులే పోలీస్ స్టేషన్లలో పాస్ ఫోటోలు పెట్టి ఎలా దొంగల లిస్టు ప్రకటిస్తారో దీన్ని చూస్తే అలా ఉందని ఉద్యోగం చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ పోలీస్ రెండు ఈ విధంగా చేస్తుంటే చట్టం ఊరుకోదని ఆయన హెచ్చరించారు
భవిష్యత్తులో ఈ చెడ్డ పేరు అంతా రాష్ట్ర టిడిపి నాయకులకే వర్తిస్తుందని హెచ్చరించిన నారాయణ పరిస్థితి చక్కదిద్దాలని ఆయన హితవు పలికారు.
Read More
Next Story