కర్ణాటక ముఖ్యమంత్రి డికే. శివకుమార్ కు రేణిగుంట విమానాశ్రంయలో స్వాగతం పలుకుతున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్  వి. వెంకటేశ్వర్, చిత్రంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి
x
కర్ణాటక ముఖ్యమంత్రి డికే. శివకుమార్ కు రేణిగుంట విమానాశ్రంయలో స్వాగతం పలుకుతున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్, చిత్రంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి

శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చిన కర్ణాటక సీఎం

రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికిన అధికారులు. సీడబ్ల్యూసీ సభ్యుడు


శ్రీవారి దర్శనార్థం కర్ణాటక ముఖ్యమంత్రి డికే. శివకుమార్ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఏడాది జూన్ మూడో తేదీ ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మొదటిసారి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు.


బెంగళూరు నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి డికే శివకుమార్ కు సీడబ్ల్యూసీ ఆహ్వాన సభ్యుడు, తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ స్వాగతం పలికారు. విమానాశ్రయం ఆవరణలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ పుష్పగుచ్చం అందించి, ప్రభుత్వ ప్రతినిధిగా ఆహ్వానించారు. ఆయన తోపాటు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జలు సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ సి. దివాకరరెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ ఘనంగా స్వాగతించారు.


రేణిగుంట విమానాశ్రయం లాంజ్ లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముక్కంటీశ్వరుడి చిత్రపటం అందించారు. శ్రీకాళహస్తి ఆలయ అర్చకులు కర్ణాటక సీఎం డికే. శివకుమార్ కు స్వామివారి చిత్రపటంతో పాటు వేదాశీర్వచనాలు అందించారు.


ఆ తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి డికే. శివకుమార్ రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేసే ఆయన శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తిరుమలకు చేరుకున్న కర్ణాటక సీఎం శివకుమార్ కు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరితో పాటు అధికారులు ఘనంగా స్వాగతించారు.
Read More
Next Story