
కడప: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి
రెండు కార్డు ఢీకొన్న ఘటన. తిరుపతి నగరం జీవకోనలో విషాదం. ముగ్గురికి తీవ్ర గాయాలు
కడప నగర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. వారంతా తిరుపతి నగరానికి చెందిన వారని సమాచారం అందింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గరు గాయపడ్డారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కడప మీడియా వర్గాల కథనం. ఈ ప్రమాదంలో ఒకరు మాత్రమే ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
కడప నగర శివారు రింగ్ రోడ్డు వద్ద పాలెంపల్లె క్రాస్ వద్ద శుక్రవారం వేకువజామున ఈ సంఘట జరిగినట్లు సమాచారం . తిరుపతి నుంచి ముగ్గురు యువకులు కారులో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. పాలెంపల్లె సమీపంలోని రింగ్ రోడ్డు సమీపంలో ప్రయాణిస్తుండగా, ఎదురుగా దూసుకుని వచ్చిన మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తిరుపతి నుంచి కారులో వస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. వారంతా తిరుపతి నగరం జీవకోన ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు జీవకోనకు చెందిన హర్షవర్ధన్ (27) కిషోర్ (28), సుధీర్ కుమార్ రెడ్డి (24)గా గుర్తించారు. మరో కారులో బెలూన్స్ తెరుచుకోవడంతో స్వల్పగాయాలో ముగ్గరు ప్రాణాలతో బయలపడ్డారని తెలుస్తున్నది. సమాచారం అందిన వెంటనే కడప నగర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువకుల మృతదేహాలను కడప రిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Next Story

