
కడప జిల్లా మైదుకూరు వద్ద బస్సును ఢీకొట్టిన జీపు
ప్రమాదం తీవ్రమే.. ప్రాణగండం తప్పింది...
కడప జిల్లా మైదుకూరు వద్ద ఘటనలో హైదరాబాద్ వ్యక్తులకు గాయాలు
ఆగి ఉన్న బస్సును జీపు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గరు గాయపడ్డారు. ఈ ప్రమాదం కడప, కర్నూలు జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు గాయపడ్డారు. కడప జిల్లా మైదుకూరు వద్ద ఈ సంఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు మైదుకూరు ఎస్ఐ ఎస్. వెంటకరమణ చెప్పారు. గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలివి.
హైదరాబాద్ కు చెందిన ఐదుగురు తిరుపతి నుంచి కారులో తిరిగి ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో (జీపు) వాహనం మైదుకూరు వద్ద ప్రయాణిస్తోంది. మైదుకూరు మండలం శ్రీనగరం వద్ద జాతీయ రహదారిపై ప్రయాణికులు దిగడానికి ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉంది. తిరుపతి నుంచి బయలుదేరిన వారి వాహనం ఆగి ఉన్న బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే మైదుకూరు ఎస్ఐ వెంకటరమణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆస్పత్రికి తరలింపు
రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును జీపు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గరు స్వల్పంగా గాయపడ్డారు. వారిని మొదట మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించింన పోలీసులు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వెంకటరమణ చెప్పారు. ఈ ప్రమాదంలో మేకల సుజన (హైదరాబాద్), సతీష్ (13), యశ్వంత్ (23, హైదరాబాద్) విజయనగరానికి చెందిన రూప (20), భీమవరం ప్రాంతానికి చెందిన ఏలియా (19) ప్రయాణిస్తున్నారు. వారిలో ముగ్గురికి స్వల్పంగా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story

