కుక్క ఆచూకీ కోసం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు
కడప జిల్లా రాజంపేటలో వింత ఘటనపై వీడియో స్టోరీ
కడప జిల్లా రాజంపేట మున్సిపల్ అధికారులకు కొత్తకష్టాలు ఎదురయ్యాయి. శస్త్రచికిత్స ( ABC Animal Birth Control ) చేయడానికి పట్టుకుపోయారు. నెల తరువాత కూడా ఆ కుక్క ఆచూకీ లేకపోవడంతో దాని యజమాని జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశారు. ఆ వీధికుక్క కోసం రాజంపేట మున్సిపల్ అధికారులు గాలించడానికి హైరానా పడుతున్నారు.
"తన పెంపుడు కుక్క ఆచూకీ చూపించే వరకు ఎంతవరకైనా పోరాటం సాగిస్తా" అని రాజంపేట పట్టణం ఈడిగపాళెంకు చెందిన మలిశెట్టి సుబ్బనరసింహులు అంటున్నారు.
"మున్సిపల్ అధికారులు మా పెంపుడు కుక్కను పట్టుకుపోయారు. దాని ఆచూకీ తెలియడం లేదు. గాలించి, మళ్లీ తమకు ఆ కుక్కను అప్పగించండి" అని కడప జిల్లా రాజంపేట పట్టణానికి చెందిన మలిశెట్టి సుబ్బనరసింహులు కడప జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశారు.
"తన పెంపుడు కుక్క ఆచూకీని తెలియజేసి, దాన్ని తనకు అప్పగించేలా సంబంధిత అధికారులను ఆదేశించండి" అని కడప కలెక్టర్‌ను కోరినట్లు సుబ్బనరసింహులు తెలిపారు.
రాజంపేట పట్టణం ఈడిగపాళెంకు చెందిన మలిశెట్టి సుబ్బనరసింహులు ఓ కుక్కను పెంచుకుంటున్నారు. రాజంపేట మున్సిపల్ సిబ్బంది ఆ కుక్కకు ఆపరేషన్ చేయడానికి గత నెల మూడో తేదీ పట్టుకునిపోయి, ఇంతవరకు తనకు అప్పగించలేదని ఆయన జిల్లా కలెక్టర్ కు సమర్పించిన వినతిపత్రంలో ఆరోపించారు.

