ప్రయాణికుల బ్యాగులే టార్గెట్..  రూ. లక్షలు కొల్లగొట్టారు..
x

ప్రయాణికుల బ్యాగులే టార్గెట్.. రూ. లక్షలు కొల్లగొట్టారు..

ఆరుగురి మఠా నుంచి రూ. 80 లక్షల నగదు, నగలు స్వాధీనం చేసుకున్న కడప పోలీసులు


అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను అరెస్టు చేసిన కడప జిల్లా పోలీసులు, భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. బస్సుల్లో ప్రయాణం చేసే వారి బ్యాగులు చోరీ చేశారు. ఆస్పత్రుల్లో రోగుల సంబంధీకుల వస్తువులే లక్ష్యంగా చేసుకున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి కడప, నెల్లూరు జిల్లాల్లో దోపిడీలకు పాల్పడిన ఆరుగురు ముఠా సభ్యుల నుంచి 14 కేసుల్లో రూ. 80.01 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

కడప జిల్లా పులివెందులలో జరిగిన చోరీలపై అందిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సిబ్బంది దోపిడీ ముఠాను పట్టుకున్నారని జిల్లా ఎస్పీషెల్కే నచికేత్ విశ్వనాథ్ చెప్పారు.
"నిందితుల నుంచి రూ. 41.34 లక్షల నగదు, 215 గ్రాముల బంగారు 554 గ్రాముల వెండి ఆభరణాలు, సిఫ్ట్ కారు, బైక్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు" కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మీడియాకు శనివారం తెలిపారు.

పులివెందుల పట్టణంలో ఈ ఏడాది వరుసగా ఇళ్లు, ఆస్పత్రుల్లో జరిగిన చోరీలపై (1) Cr.No.37/2026 U/s 303 BNS (2) 431/2025 U/s 331(3), 305 BNS, (3) 59/2026 U/s 303(2) BNS కేసులు నమోదు చేశామని సీఐ కే. శ్రీరాం సారధ్యంలో సిబ్బందిని రంగంలోకి దించాయని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వివరించారు.
" ప్రయాణికుల నుంచి బ్యాగ్ లిఫ్టింగ్, ఇళ్లలో దొంగతనాలు, ఆస్పత్రిలో నిద్రిస్తున్న రోగులు, వారి బంధువుల పర్సులు దొంగతనాలు చేయడానికి ఓ ముఠా ఏర్పడిందని గుర్తించా" అని ఎస్పీ వివరించారు. పులివెందుల డీఎస్పీ బీ. మురళి, పులివెందుల సీఐ కే. శ్రీరామ్ ఎస్సైలు ఎం.మధుసూదనరెడ్డి, ఎల్. తిమోతి సారధ్యంలో క్రైంపార్టీ పోలీసులు దర్యాప్తు సాగించి, ఆరుగురు నిందితుల ముఠాలో పులివెందుల పట్టణ కోతి సమాధి వద్ద బ్యాగ్ లిఫ్టింగ్ దొంగలను, కడప రింగ్ రోడ్డు వద్ద ఇళ్లలో దోపీలకు పాల్పడిన వారిని, ఆస్పత్రుల్లో చోరీలు చేసిన వారిని ఉలిమెళ్ల రింగ్ రోడ్డు వద్ద అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు.

14 కేసుల్లో సొమ్ము రికవరీ..


కడప, నెల్లూరు జిల్లాల్లో దోపిడీకి పాల్పడిన ఆరుగురు దోపిడీ ముఠాలోని 14 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వారి నుంచి రూ. 37.35 లక్షల విలువైన 215.5 బంగారు ఆభరణాలు రూ.1.32 లక్షల విలువైన వెండి ఆభరణాలు, నగదు రూ. 41,34,500 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ చెప్పారు. 14 చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న ఆరుగురు పులివెందుల, సింహాద్రిపురం, వెంపల్లి, కడప, బద్వేల్, నెల్లూరు జిల్లాలో చోరీలకు పాల్పడ్డారు.

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు బీసీ కాలనీకి చెందిన 42 ఏళ్ల మహిళ, సాకే శ్రీను (58), కడప జిల్లా ఒంటిమిట్ట మాధవరానికి చెందిన 28 ఏళ్ల మహిళ, తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై మండలం సింగారం పేటకు చెందిన చిన్న వెంకటేశు (25)ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు మహిళల కోసం గాలిస్తున్నామని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వివరించారు. తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడిన పులివెందులలోని బొల్లవీరప్పవీధికి చెందిన పల్లపు దివాకర్ (31), ఆస్పత్రుల్లో చోరీలు చేసిన వేంపల్లెకు చెందిన కంబం వెంకటరెడ్డి (26)ని రిమాండ్ కు పంపారు.
Read More
Next Story