
‘‘లక్షలాది మంది నమ్మకాన్ని తప్పని చెప్పడం కష్టం’’
శబరిమల ఆలయం వివాదంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
మతపరమైన విషయాలలో దాఖలయ్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలలో లక్షలాది మంది ప్రజల నమ్మకం తప్పు అని ప్రకటించడం న్యాయస్థానానికి అత్యంత కష్టమైన పనులలో ఒకటి అని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. ఇదే సమయంలో మతపరమైన ఆచారాలను వ్యాఖ్యానించడానికి ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ఒక సాధనంగా మారడానికి అనుమతించలేమని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వాదించింది.
కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి పిటిషన్లు, అలాగే వివిధ మతాలు పాటించే స్వేచ్ఛపై తొమ్మిది మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ట్రావెన్ కోర్ బోర్డు తరఫున ప్రముఖ న్యాయవాదీ అభిషేక్ మను సింఘ్విని కేసును వాదిస్తున్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అనేవి మతపరమైన విషయాలలో ఆచారాన్ని ఉల్లంఘిస్తున్నారనే కోణంలో చూడరాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముందు వాదనలు వినిపించారు.
న్యాయపరమైన పరిమితులు..
ఒక మతానికి సంబంధం లేని వ్యక్తి, ఆ మతంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయవచ్చా? అంటూ సుప్రీంకోర్టు ప్రధాన ప్రశ్నను లేవనెత్తింది. అయితే మతపరమైన విషయాలలో ఆర్టికల్ 32 కింద పిల్ ను స్వీకరించడం సుప్రీంకోర్టు విధులలో ప్రధానమైనదని సింఘ్వి సమాధానం ఇచ్చారు.
ఈ సమయంలో జస్టిస్ సూర్యకాంత్ కలుగజేసుకుంటూ.. లక్షలాది మంది నమ్మకాన్ని తప్పని ఎలా చెప్పగలమని వ్యాఖ్యానించారు. ఈ చర్చలలో జస్టిస్ బీవీ నాగరత్న మాట్లాడుతూ.. పిటిషన్ బయటి వ్యక్తి అయినప్పుడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను స్వీకరించకూడదని అన్నారు. సంస్కరణ పేరుతో మతాన్ని నిర్వీర్యం చేయకూడదని చెప్పారు. జస్టిస్ సుందరేషన్ మాట్లాడుతూ.. లక్షలాదిమంది ప్రజలు అనుసరించే మతంలో వారి వాదనలు వినకుండా తప్పని చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డారు.
జస్టిస్ అహ్మనుద్దీన్, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే, జప్టిస్ మహదేవన్, జస్టిస్ జయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ మతపరమైన విషయాల్లో పిల్ దాఖలు చేయడం వల్ల ఆర్టికల్ 25, 26 ప్రకారం ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు. ఇది సాధారణ పరిమితి కంటే పదిరెట్లు ఎక్కువగా ఉండాలన్నారు.
అయితే ట్రావెన్ కోర్ సంస్థానం వాదనలు వినిపిస్తూ శబరిమలలో అయ్యప్ప నిత్య బ్రహ్మచారీగా ఉంటారని, ఆయన ఆలయంలోకి పది నుంచి 50 సంవత్సరాల మహిళల ప్రవేశం నిషిద్ధమని కోర్టుకు తెలిపింది. దేశంలో శబరిమల మాత్రమే అయ్యప్పకు ఉన్న ఏకైక పవిత్ర ఆలయమని, ఇక్కడ దేవుడిని నైష్టిక బ్రహ్మాచారిగా పూజిస్తారని సింఘ్వీ తెలిపారు.
శబరిమల అయ్యప్ప దేవుడి ఏకైక ఆలయం అని, అక్కడ దేవతను నైష్టిక బ్రహ్మచారిగా పూజిస్తారని సింఘ్వీ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. అయ్యప్ప స్వామికి భారతదేశంలో సుమారు 1,000 దేవాలయాలు ఉన్నాయని నాకు చెప్పారు. ఎవరో 1,499 అంటున్నారు, మరికొందరు 1,000 అంటున్నారు. మనం జోక్యం చేసుకోకూడదు . అయ్యప్ప స్వామి ఏకైక ఆలయం నైష్టిక బ్రహ్మచారిగా ఒక రూపంలో ఉంది- నైష్టిక అనే పదానికి శాశ్వతమైన బ్రహ్మచారి అని అర్థం.
"ఇప్పుడు, ఈ దేవత కీర్తి ఆరాధనకు పునాది నైష్టిక బ్రహ్మచారి రూపంలో ఉంది. ప్రజలు ఆయనను గౌరవించడానికి ఏకైక కారణం ఏమిటంటే, అతను గృహస్థ ఆశ్రమం అన్ని రూపాలను విడిచి పెట్టాడు. చాలా ఉన్నత స్థాయి ప్రాయశ్చిత్తాన్ని అవలంబించాడు. ఇందులో బ్రహ్మచర్యం స్వీయ తిరస్కరణ ఉన్నాయి, "అని సింఘ్వీ నాల్గవ రోజు విచారణలో ధర్మాసనానికి చెప్పారు.
ఆలయంలోకి మహిళలను పూర్తిగా నిషేధించడం లేదని, కేవలం పది నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నవారినే నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఇది లింగ వివక్ష కిందకి రాదని పేర్కొన్నారు. సాధారణంగా ప్రజలు 40 లేదా 41 రోజులు దీక్ష స్వీకరించి ఇక్కడకు రావాల్సి ఉందని చెప్పారు.
ఈ కేసుపై ఈ రోజు నుంచి విచారణ ప్రారంభం అవుతుంది. మతంలోని వర్గాలు, వేర్వేరు తెగలు వివిధ ప్రాతిపదికన దేవాలయాలు, మఠాల ప్రవేశాన్ని పరిమితం చేస్తే హిందూమతం చీలిపోతుందని ఏప్రిల్ 9 న అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
2018 సెప్టెంబర్ ల ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4:1 తీర్పుతో పది నుంచి యాభై ఏళ్ల మహిళలను ఆలయంలోకి ప్రవేశించడాన్ని అనుమతించింది. ఇది చట్టవిరుద్దమని ప్రకటించింది. అయితే 2019 లో సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనిని 3:2 మెజారిటితో ప్రార్థన స్థలాలలో మహిళల వివక్షకు సంబంధించి విస్తృత ధర్మాసనానికి నివేదించింది.
Next Story

