జైశంకర్‌పై కాంగ్రెస్ విమర్శలు..
x

జైశంకర్‌పై కాంగ్రెస్ విమర్శలు..

భారత విదేశాంగ విధానం బలహీనంగా మారుతోందన్న ప్రతిపక్షాలు..


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధ పరిస్థితిపై పార్లమెంటులో విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆయన వ్యా్ఖ్యల్లో స్పష్టతలేదని, కీలక అంశాలను పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్ ఆరోపించింది. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్ విదేశాంగ విభాగం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ విభాగానికి మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ కుర్షిద్ నేతృత్వం వహిస్తున్నారు.

కాంగ్రెస్ ఆందోళన..

జైశంకర్ చేసిన ప్రకటనలో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల భారత్ ఎదుర్కొనే భౌగోళిక-రాజకీయ, ఆర్థిక ప్రభావాలపై స్పష్టమైన వివరణ లేదని కాంగ్రెస్ పేర్కొంది. అలాగే ఒక సార్వభౌమ దేశ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్యను కూడా జయశంకర్ ఖండించలేదని కాంగ్రెస్ విమర్శించింది. ఈ అంశాలపై భారత ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించాల్సిందని పార్టీ డిమాండ్ చేసింది.

ఇంధన భద్రతపై స్పష్టత లేదని విమర్శ..

భారతదేశం తన ఇంధన అవసరాలను ఎలా తీర్చుకుంటుంది? భవిష్యత్తులో ఇంధన భద్రతను ఎలా బలోపేతం చేస్తుంది? అనే విషయాల్లో జైశంకర్ ప్రకటనలో ఎలాంటి పరిష్కారాలు సూచించలేదని కాంగ్రెస్ తెలిపింది. ప్రపంచ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రభుత్వం సమగ్ర వ్యూహం ప్రకటించాల్సిన అవసరం ఉందని పార్టీ అభిప్రాయపడింది.

యుద్ధ పరిస్థితి..

ఫిబ్రవరి 28న అమెరికా - ఇజ్రాయెల్ ఇరాన్‌పై యుద్ధానికి దిగింది. దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనా మరణించారు. ఇప్పటివరకు ఇరాన్‌లో సుమారు 1,230 మంది, లెబనాన్‌లో 397 మంది, ఇజ్రాయెల్‌లో 11 మంది మరణించినట్లు సమాచారం.

Read More
Next Story