‘‘ఈ సముద్రపు మహేంద్రుడిని చూస్తే శత్రువులకు హడలే’’
x

‘‘ఈ సముద్రపు మహేంద్రుడిని చూస్తే శత్రువులకు హడలే’’

భారత నౌకా దళంలోకి చేరిన తొలి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్


భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. శత్రు రాడార్ల కళ్లుగప్పి, దాడులు, ఎదురుదాడులు చేయగల మహేంద్రుడిని సముద్రతలంపై సగర్వంగా నిలబెట్టింది.

శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ, అధునాతన సెన్సార్ సూట్‌తో కూడిన స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ పేరు 'మహేంద్రగిరి'. దీనిని భారత నౌకాదళానికి అప్పగించినట్లు అధికారులు శుక్రవారం (మే 1) తెలిపారు.

గురువారం (ఏప్రిల్ 30) ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDSL)లో నీలగిరి-తరగతికి చెందిన ఆరవ నౌకను (ప్రాజెక్ట్ 17A కింద నిర్మాణం) అప్పగించారు. యుద్ధనౌకల రూపకల్పన, నిర్మాణంలో స్వావలంబన సాధించడంలో ఈ అప్పగింత ఒక "ముఖ్యమైన మైలురాయి" అని అధికారులు తెలిపారు.

బహుముఖ పోరాటం గలది..

“ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్‌లు సముద్ర రంగంలో ప్రస్తుత, అభివృద్ధి చెందుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి రూపొందించబడిన బహుళ సామర్థ్యం దీని సొంతం.
ఈ అత్యాధునిక ఫ్రిగేట్ నౌకాదళ రూపకల్పన, స్టెల్త్, ఫైర్‌పవర్, ఆటోమేషన్, మనుగడ సామర్థ్యంలో ఒక గొప్ప పురోగతిని ప్రతిబింబిస్తుంది. యుద్ధనౌకల నిర్మాణంలో ఆత్మనిర్భరతకు ఒక ప్రశంసనీయమైన చిహ్నంగా నిలుస్తుంది” అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

'మహేంద్రగిరి' గురించి క్లుప్తంగా..

శివాలిక్-తరగతి (ప్రాజెక్ట్ 17) ఫ్రిగేట్‌లతో పోలిస్తే ఈ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ స్టెల్త్, మనుగడ సామర్థ్యం, పోరాట సామర్థ్యంలో ఒక తరం ముందుంది.
ఉపరితల, వాయు, జలాంతర్గాముల ఎదురయ్యే దాడులన ఎదుర్కొని శత్రువులను తుత్తునియలు యుద్ధ వ్యవస్థలతో సహా మూడు యుద్ధ కోణాలను కవర్ చేసే సమగ్ర ఆయుధ వ్యవస్థతో ఇది నిర్మాణం. ఇందులో సూపర్‌సోనిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. డీజిల్ ఇంజిన్, గ్యాస్ టర్బైన్‌ను కలిపి, డీజిల్ లేదా గ్యాస్ ఆధారిత ప్రొపల్షన్ ప్లాంట్‌తో పనిచేస్తుంది
అధిక స్థాయి ఆటోమేషన్‌ను సాధ్యంచేస్తూ, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరిచే అత్యాధునిక IPMSను కలిగి ఉంది. మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో 200కు పైగా MSMEల భాగస్వామ్యంతో, సుమారు 75 శాతం స్వదేశీ సామగ్రితో నిర్మాణం.
మహేంద్రగిరి (యార్డ్ 12654), MDSLలో నిర్మించిన ఈ తరగతికి చెందిన నాల్గవ నౌక. సంస్థలో MDSL డైరెక్టర్లు, సీనియర్ భారత నావికాదళ అధికారుల సమక్షంలో, MDSL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ జగ్మోహన్ (రిటైర్డ్), తూర్పు నావికా దళం చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (టెక్నికల్) రియర్ అడ్మిరల్ గౌతమ్ మార్వాహా, VSM అంగీకార పత్రంపై సంతకం చేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఒక ప్రకటనలో తెలిపింది.
మహేంద్రగిరి అత్యాధునిక యుద్ధ సామర్థ్యాలతో కూడిన ఒక అత్యాధునిక యుద్ధనౌక అని, ఇది దేశ స్వదేశీ రక్షణ తయారీ బలానికి బలమైన చిహ్నంగా నిలుస్తుందని జగ్మోహన్ అన్నారు. ఆవిష్కరణ, స్థితిస్థాపకత, స్వావలంబన వారసత్వాన్ని నిలబెడుతూ, ఈ నౌక దేశానికి విశిష్టంగా సేవలు అందిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
వార్‌షిప్ డిజైన్ బ్యూరో (WDB)చే రూపొందించబడి, వార్‌షిప్ ఓవర్‌సీయింగ్ టీమ్ (ముంబై) పర్యవేక్షణలో ఉన్న P17A ఫ్రిగేట్లు, స్వదేశీ నౌకా రూపకల్పన, స్టెల్త్, మనుగడ, పోరాట సామర్థ్యంలో ఒక "తరాల ముందడుగు"ను ప్రతిబింబిస్తాయి. సమీకృత నిర్మాణం అనే తత్వంతో, ఈ నౌకను ఊహించిన కాలపరిమితిలోనే నిర్మించి, అప్పగించామని అధికారులు తెలిపారు.
P17 (శివాలిక్-తరగతి) నౌకలతో పోలిస్తే, P17A నౌకలలో అధునాతన ఆయుధాలు, సెన్సార్ల సముదాయాన్ని అమర్చినట్లు వారు చెప్పారు. "ఈ నౌకలు కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ (CODOG) ప్రొపల్షన్ ప్లాంట్‌లతో నిర్మించారు.
వీటిలో ప్రతి షాఫ్ట్‌పై కంట్రోలబుల్ పిచ్ ప్రొపెల్లర్ (CPP)ను నడిపే ఒక డీజిల్ ఇంజన్, ఒక గ్యాస్ టర్బైన్ ఉంటాయి. అలాగే, అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IPMS) కూడా ఇందులో ఉంది. దీనిలోని శక్తివంతమైన ఆయుధాలు, సెన్సార్ల సముదాయంలో ఉపరితల, వాయు, జలాంతర్గామి చేసే దాడులను ఎదుర్కొనే యుద్ధ వ్యవస్థలు ఉన్నాయి" అని ఆ ప్రకటన పేర్కొంది.
నౌకాదళానికి అప్పగించిన ఆరవ P17A నౌక మహేంద్రగిరి. డిసెంబర్ 20, 2024న MDSL ద్వారా మొదటి P17A ఫ్రిగేట్ (నీలగిరి)ని అప్పగించిన 17 నెలల లోపే నౌకాదళానికి అప్పగించబడిన ఆరవ P17A నౌక మహేంద్రగిరి.
మహేంద్రగిరిని అప్పగించడం దేశం డిజైన్, నౌకానిర్మాణం, ఇంజనీరింగ్ పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది. అలాగే, నౌక డిజైన్, నౌకానిర్మాణం రెండింటిలోనూ "ఆత్మనిర్భరత"పై నౌకాదళం అలుపెరుగని దృష్టిని ఇది ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు.
75 శాతం స్వదేశీ సామగ్రితో కూడిన ఈ ప్రాజెక్టులో MDSL వద్ద 200కు పైగా MSMEలు పాలుపంచుకున్నాయని, దీని ద్వారా సుమారు 4,000 మందికి ప్రత్యక్షంగా, 10,000 మందికి పైగా పరోక్షంగా ఉపాధి లభించిందని ఆ సంస్థ తెలిపింది.
సూపర్‌సోనిక్ క్షిపణులతో సహా అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగిన నీలగిరి తరగతికి చెందిన నాల్గవ నౌక, స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ తారాగిరిని ఏప్రిల్ 3న భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.
ఈ తరగతికి చెందిన ఐదవ నౌక, కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (GRSE)లో నిర్మించిన ఈ ఫ్రిగేట్‌లలో రెండవదైన ద్రోణగిరిని మార్చి 30న కోల్‌కతాలోని GRSEలో నౌకాదళానికి అప్పగించారు. ఇది యుద్ధనౌకల రూపకల్పన నిర్మాణంలో స్వావలంబన సాధించడంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది.


Read More
Next Story