సాయం చేస్తే.. వేదనే రిటర్న్ గిఫ్ట్.. మానవత్వాన్ని సమాధి చేస్తారా...?!

ఇదీ క్యాష్ డ్రాప్ స్కాం, డైవర్షన్ థెప్ట్. ఏమారితే జేబుకు చిల్లే.


మానవత్వం, మంచితనానికి దారి తప్పిన కొందరు యువకులు పాతర వేస్తున్నారు. రోడ్డు పక్కనో లేదంటే, దుకాణాల సమీపంలో జనం గుమిగూడిన చోట నేలపై రూ. 50, లేదా వంద నోటు కింద పడేస్తారు. ఇది క్యాష్ డ్రాప్ స్కాం (Cash Drop Scam). ఆ నోటు తీసుకునేందుకు ప్రయత్నించామా? ఇక అంతే సంగతులు. సెల్ ఫోన్ అయినా మాయం అవుతుంది. లేదంటే ప్యాంటు వెనుక జేబు నుంచి పర్సు అయినా గల్లంతు అవుతుంది.

సాయం కోసం...

స్మార్ట్ గా చోరీలకు పాల్పడుతున్న కొందరు యువకులు
డైవర్షన్ థెప్ట్
( Diversion Theft) కూడా చేస్తున్నారు. సాయం కోసం అర్థించినట్లు నటిస్తారు. ఏమరపాటుకు ఉంటే, సెల్ ఫోన్లు లేదంటే నగదు కొల్లగొడుతున్నారు. తిరుపతిలోనే కాదు. నెల్లూరు, అనంతపురం, విజయవాడ నగరాల్లో కూడా ఈ తరహా కొత్త మోసాలకు పాల్పడుతున్న కొందరు యువకులు సాయం చేసిన వ్యక్తులను వేదనకు గురి చేస్తున్నారు .
అమాయకులను, కాస్త మానవత్వం ఉందని భావించిన వ్యక్తులను దుండగులు టార్గెట్ చేస్తుంటారు. వారినిదృష్టి మరల్చడానికి ఈ నయా చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులు కొందరు అమాయకుడిగా గుర్తించే వ్యక్తి మానసిక స్థితిని కూడా అంచనా వేస్తున్నారంటే, ఎంత తెలివిమీరిపోయారో అర్థం చేసుకోవచ్చు.

ఎలా ఎర వేస్తారు..?
ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళుతుంటారు. వారిని మరో ఇద్దరూ..? ఒకరో ఫాలో అవుతుంటారు? టార్గెట్ చేసిన వ్యక్తి నడిచి లేదా బైక్ పై వెళుతుంటారు. ఆ వ్యక్తికి ముందు బైక్ రైడ్ చేస్తూ, సర్రున జారి కింద పడతారు. ఇది గమనించిన అమాయకుడు సాయం చేయడానికి వెళతారు. కింద పడిన వ్యక్తిని పైకి లేవడానికి సాయం చేస్తుంటాడు. కింద పడిన వ్యక్తి వెంట ఉన్న మరో మనిషి సాయం చేస్తున్న షర్ట్ జేబులోని సెల్ ఫోన్ అలవోకగా కొట్టేస్తాడు. వారిని అనుసరించే మరో వ్యక్తి చేతిలోకి ఆ సెల్ ఫోన్ వెళ్లిపోతుంది. లేదంటు ప్యాంటు జేబులోని పర్సు అయినా గల్లంతు అవుతుంది.

సాయం చేసిన వ్యక్తికి స్పర్శ కూడా తగలకుంగా ఇదంతా కన్ను మూసి, తెరిచే లోపు అంతా చకచకా జరిగిపోతుంది. బాధితుడు పైకి లేస్తాడు. సాయం చేసిన వ్యక్తికి ధన్యవాదాలు చెబుతాడు. కొన్ని నిమిషాల్లో ఎవరిదారిన వారు వెళ్లిపోతారు. కాసేపటికి గానీ సాయం చేసిన వ్యక్తి జేబులో ఏమి గల్లంతైందనేది అర్థం కాదు. ఈ తరహాలో.. క్యాష్ డ్రాప్ స్కాం, డైవర్షన్ థెప్ట్ చోరీలు పెచ్చుమీరుతున్నాయి.
పోలీసులు ఎమంటున్నారనేది ఈ వీడియోలో చూడండి...


Read More
Next Story