ఈ వీకెండ్ ఎలా ఎంజాయి చేద్దాం, క్రికెట్టా, ఓటీటీ సినిమాలా!
x

ఈ వీకెండ్ ఎలా ఎంజాయి చేద్దాం, క్రికెట్టా, ఓటీటీ సినిమాలా!

అటు చూస్తే ఐపీఎల్ క్రికెట్ మస్త్.. ఇటు చూస్తే ఓటీటీ సినిమాల జబరస్త్.. ఈ వీకెండ్ అంతా సందడే సందడి..


అటు చూస్తే ఐపీఎల్ క్రికెట్ మస్త్.. ఇటు చూస్తే ఓటీటీ సినిమాల జబరస్త్.. ఈ వీకెండ్ అంతా సందడే సందడి..
ఐపీఎల్-2026లో భాగంగా ఇవాళ, రేపు 3 మ్యాచ్ లు జరగనున్నాయి. మే 2 అంటే ఇవాళ రాత్రి 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య, రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, రాత్రి 7.30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి.

ఇక, ఈ వారంతంలో వినోదం పంచేందుకు ఓటీటీల్లోకి పలు కొత్త సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. స్పోర్ట్స్‌ యాక్షన్‌ గా సాగిన మెటోక్రాస్‌ రేసింగ్‌ ఇతివృత్తంగా తెరకెక్కిన తొలి భారతీయ సినిమా ‘బైకర్‌’ (Biker). శర్వానంద్‌ హీరోగా దర్శకుడు అభిలాష్‌రెడ్డి తెరకెక్కించారు. రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మోటోక్రాస్‌ రేసర్‌ విక్కీ పాత్రలో శర్వానంద్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక, గెటప్‌ శ్రీను తదితరులు కలిసి నటించిన సినిమా ‘రాకాస’ (Rakasa) ఫాంటసీ కామెడీ. ఈ మూవీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.
‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్‌గా రూపొందిన ‘ది కేరళ స్టోరీ 2’ (The Kerala Story 2). ఉల్కా గుప్త, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో కామాఖ్యా నారాయణ్‌ సింగ్‌ తెరకెక్కించారు. ఈ సినిమా ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.
జ్ఞాపకాలు గుర్తుచేసే ‘బ్యాచ్‌మేట్స్‌’ (Batchmates) సిరీస్‌ ‘జియో హాట్‌స్టార్‌’ (Jio Hotstar)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈటీవీ విన్‌ లో ట్రావెల్‌ బేస్డ్‌ సెలబ్రిటీ టాక్‌ షో-2, నెట్‌ఫ్లిక్స్‌ లో గ్లోరీ (వెబ్‌సిరీస్‌), మ్యాన్‌ ఆన్‌ ఫైర్‌ (వెబ్‌సిరీస్‌), స్వాప్డ్‌ (యానిమేటెడ్‌ సిరీస్‌), మై డియరెస్ట్‌ సెనోరిటా
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ది హౌస్‌ ఆఫ్‌ ది స్పిరిట్స్‌ (వెబ్‌సిరీస్‌), సోనీలివ్‌లో అందేఖీ: ది ఫైనల్‌ బ్యాటిల్‌ (వెబ్‌సిరీస్‌)... ఇలా అనేకం వివిధ స్ట్రీమ్ లలో దుమ్మురేపుతున్నాయి. ఇక ఎంపిక మీదే మరి.
Read More
Next Story