
ఏపీ టూరిజం అందాలకు దేశ వ్యాప్త ప్రచారం ఎలా వచ్చింది?
అరకు వ్యాలీ ఖ్యాతి ఎలా పెరుగుతోంది. ప్రకృతి ప్రేమికులు అరకు అందాలను ఎలా ఆస్వాదిస్తున్నారు?
ప్రస్తుత డిజిటల్ యుగంలో పర్యాటకులు తమ ట్రిప్‌లు ప్లాన్ చేసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా ఆధారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది.
ప్రకృతి ప్రేమికులను మైమరిపించే అరకు వ్యాలీ దేశంలోనే ‘మోస్ట్ ఇన్‌స్టాగ్రామబుల్ ల్యాండ్‌స్కేప్’ గా సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ సందర్భంగా అరకు ‘ఇండియన్ రూట్స్ – ఎడిటర్స్ ఛాయిస్’ జాతీయ పురస్కారాన్ని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా అందుకుంది.
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వినూత్న ఆలోచనలతో సోషల్ మీడియా ద్వారా ఏపీ టూరిజం అందాలు దేశవ్యాప్తంగా చేరుకున్నాయి. ఇదే ఫలితంగా ఈ అవార్డు వచ్చింది.
హోం మంత్రి మేకప్ పై వివాదాస్పద వ్యాఖ్యలు
మహిళల కట్టుబొట్టుపై మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోం మంత్రిని మేకప్ మంత్రిగా వర్ణించారు. గతంలో సీపీఐ నారాయణ కూడా ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా ఉన్న గీతారెడ్డి వేసుకున్న మేకప్ పై వివాదాస్పదంగా మాట్లాడి తర్వాత క్షమాపణలు చెప్పారు. మాజీ మంత్రి రోజా ను డైమండ్ రాణి అని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో అవమానించారు. బండారు సత్యనారాయణ కూడా రోజాను అవమానిస్తూ మాట్లాడారు.
ఏఐ సృష్టించిన క్యారికేచర్
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నాలుగు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం నరసయ్యపేటలో నిర్వహించిన సభలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘జిల్లాలో ఒక మేకప్ మంత్రి ఉన్నారు. ఆమెను ఒక గంటసేపు ఎండలో ఉంచితే కిలో మేకప్ రాలిపడుతుంది. ఆ మేకప్ రంగులతో ఇంటి గోడకు పుట్టీ వేసుకోవచ్చు’ అని హోం మంత్రిని ఉద్దేశించి అనటం వివాదాస్పదమైంది. ‘ఆమె ఏం ఉద్యోగాలు చేశారో, ఉద్యోగం కోసం ఎలాంటి కష్టాలు పడ్డారో తెలీదు. కానీ అలాంటి కష్టాలైతే మా మహిళలు పడేందుకు సిద్ధంగా లేరు’ అని పేర్కొన్నారు. దీనిపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి.
టెలిగ్రాం యాప్ పై ఆంక్షలు ఎందుకో తెలుసా?
జూన్ 21న దేశవ్యాప్తంగా జరగనున్న NEET-UG 2026 రీ-ఎగ్జామ్ ముందు, కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌ను జూన్ 22 వరకు తాత్కాలికంగా నియంత్రించింది. అంతేకాకుండా, ఇప్పటికే పోస్ట్ చేసిన మెసేజ్‌లను ఎడిట్ చేసే ఫీచర్‌ను జూన్ 30 వరకు డిసేబుల్ చేయాలని ఆదేశించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సు మేరకు ఈ చర్య తీసుకున్నారు. టెలిగ్రామ్‌లో చీటింగ్ రాకెట్లు, నకిలీ పేపర్ లీక్ చానెల్స్ పని చేస్తున్నాయని, విద్యార్థులను లక్షలు మోసం చేస్తున్నాయని NTA తెలిపింది. పరీక్ష తర్వాత ఎడిట్ చేసి నకిలీ ‘పేపర్ లీక్’ ఆధారాలు సృష్టించడం కూడా జరుగుతోంది. ఇలాంటి మోసాలు, తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

