హోటల్ క్యాషియర్ నిజాయితీ.. పెళ్లి ఇంట విరిసిన ఆనందం
x
హోటల్ మేనేజర్ శశిని సత్కరిస్తున్న తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయడు

హోటల్ క్యాషియర్ నిజాయితీ.. పెళ్లి ఇంట విరిసిన ఆనందం

కర్ణాటకలో యాత్రికులకు రూ.45 లక్షల ఆభరణాలు పోలీసులతో తిరిగి అప్పగించిన మహిళ.


తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన యాత్రికులు రూ. 45 లక్షల విలువైన బంగారు ఆభరనాల బ్యాగు జార విడుచుకున్నారు. గమనించిన హోటల్ లో పనిచేసే ఓ మహిళ బాధితులకు అందించడం ద్వారా నిజాయితీ చాటుకున్నారు. దీంతో బెంగళూరుకు చెందిన శ్రీవారి కళ్లలో ఆనందం నింపారు. హోటల్ పనిచేసే మహిళ నిజాయికి తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు సత్కరించి, బహుమతి అందించిన సంఘటన గురువారం జరిగింది.

ఏమి జరిగిందంటే..

బెంగళూరుకు చెందిన యాత్రికులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం మాధ్యాహ్నం వారంతా తిరిగి బెంగళూరుకు బయలుదేరారు. అలిపిరి బైపాస్ రోడ్డులోని తిరుపతి ఎస్వీ జంతుప్రదర్శనశాలకు సమీపంలో ఉన్న గరుడాద్రి హోటల్‌లో భోజనం చేశారు. ఏమరపాటుగా ఉన్న వారు. సుమారు రూ.45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను అక్కడే మరిచిపోయారు. బెంగళూరుకు చేరుకున్న తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితుడు శ్రీ భరత్ కుమార్ డయల్-112కు సమాచారం అందించారు.

పోలీసుల రంగప్రవేశం

రంగంలోకి దిగిన పోలీసులు హోటల్ వద్ద విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గరుడాద్రి హోటల్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న శశి, కస్టమర్లు మరిచిపోయిన బ్యాగ్‌ను గమనించి అందులో విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలుసుకుని, ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా అత్యంత భద్రంగా దాచిపెట్టి సంరక్షించినట్లు గుర్తించారు.
"పోలీసుల సమక్షంలో బ్యాగ్‌ తెరిచి పరిశీలించగా అందులో ఉన్న సుమారు 300 గ్రాముల బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించారు" అనంతరం ఆ బ్యాగ్‌ను బాధితుడు భరత్ కుమార్, వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బాధితుడు భరత్ కుమార్ మాట్లాడుతూ..
"మా కుటుంబంలో జరిగిన వివాహానికి సంబంధించిన విలువైన బంగారు ఆభరణాలన్నీ ఆ బ్యాగ్‌లోనే ఉన్నాయి. బ్యాగ్ తిరిగి దొరకకపోతే కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. హోటల్ క్యాషియర్ శశి చూపిన నిజాయితీ, డయల్-112కు సమాచారం అందిన వెంటనే స్పందించగానే పోలీసులు స్పందించారు. వారికి భరత్ కుమార్ ధన్యవాదాలు చెప్పాు
"హోటల్ క్యాషిర్ శశి చూపిన బాధ్యత, నిబద్ధత, నిజాయితీ స్ఫూర్తిదాయకం" అని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు అభినందించారు. నిజాయితీ అనేది మనిషి సంపాదించగలిగే అత్యంత విలువైన ఆస్తి. లక్షల రూపాయల విలువైన ఆభరణాలు దొరికినా వాటిని యథావిధిగా యజమానికి అప్పగించడం గొప్ప మానవీయ విలువలకు నిదర్శనం అని శశిని అభినందించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శశిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆమె నిజాయితీని కొనియాడుతూ ప్రశంసించారు, ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ శ్రీనివాసులు (పరిపాలన), చంద్రగిరి డిఎస్పి ప్రసాద్ గారు సిఐ మద్దయ్యాచారి వారు పాల్గొన్నారు.
Read More
Next Story