ఇదేంట్రా నాయనా, ఇట్లా కొన్నారు వెంకన్న డాలర్లు!
x

ఇదేంట్రా నాయనా, ఇట్లా కొన్నారు వెంకన్న డాలర్లు!

బంగారం ధరలు పెరిగినా భక్తుల విశ్వాసం ముందు అవేవీ కొరగాకుండా పోయాయి ...


వెంకన్న.. కలియుగ దైవం.. ఆయన పేరిట డాలర్లు అంటే మాటలా.. అదీ అక్షయ తృతీయ నాడు.. జనం ఎగబడ్డారంటే నమ్మండి.. మాములుగా అక్షయ తృతీయ అంటేనే బంగారం, వెండి వస్తువులకు ఉండే క్రేజ్ అలాంటిది మరి. ధరలు ఆకాశాన్ని తాకుతున్నా సరే, ఆ సెంటిమెంట్ ముందు అవేవీ అడ్డుకాదని తిరుమల భక్తులు మరోసారి నిరూపించారు. ఈ ఏడాది విక్రయాలు గత రికార్డులను కూడా దాటేసినట్టు కనిపిస్తున్నాయి.
తిరుమలలో డాలర్ల విక్రయాల జోరు
ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు (అక్షయ తృతీయ గడియల్లో) భక్తులు పోటెత్తారు. ఆదివారం నాడు రూ. 70 లక్షలు, సోమవారం రూ. 40 లక్షలు వరకు బంగారు, వెండి డాలర్లు అమ్మారు. రెండు రోజుల్లో కలిపి రూ. 1.10 కోట్లు విలువైన డాలర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 20 లక్షలు ఎక్కువ. గతేడాది సుమారు రూ. 90 లక్షల విక్రయాలు జరిగితే, ఈసారి అది కోటి దాటిపోవడం విశేషం.

సాధారణంగా బంగారం ధరలు పెరిగినప్పుడు కొనుగోళ్లు తగ్గుతాయని అంచనా వేస్తారు. కానీ, ఈ ఏడాది ధరలు భారీగా పెరిగినా భక్తులు వెనకాడకుండా శ్రీవారి బంగారు, వెండి డాలర్లను కొనుగోలు చేయడం విశేషం. తిరుమల ఆలయం ఎదురుగా ఉన్న టీటీడీ విక్రయ కేంద్రం వద్ద భక్తులు క్యూ కట్టడం చూస్తుంటే ఆ ఆనవాయితీకి ఉన్న ప్రాముఖ్యత అర్థమవుతోంది.
Read More
Next Story