హైకోర్టు ఏజీపీల గౌరవ వేతనం 25 శాతం పెంపు
x
ఏపీ న్యాయశాఖ మంత్రి ఫరూక్

హైకోర్టు ఏజీపీల గౌరవ వేతనం 25 శాతం పెంపు

జిల్లా కోర్టులో పనిచేసే జీపీ, ఏజీపీల జీతం పెంపుకు నిర్ణయం.


రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో పనిచేస్తున్న అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ల (ఏజీపీల) గౌరవ వేతనాన్ని 25 శాతం పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం హైకోర్టు ఏజీపీలకు చెల్లించే గౌరవ వేతనం రూ.44,000 నుంచి రూ.55,000 కు పెంచుతున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. ఈ పెంపుదలతో రాష్ట్రంలోని సుమారు 86 మంది ఏజీపీలకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.1,13,52,000 అదనపు ఆర్థిక భారం పడనుంది.

జిల్లా కోర్టులకు కూడా పెంపు

హైకోర్టు ఏజీపీలతో పాటు జిల్లా కోర్టుల్లో పనిచేస్తున్న గవర్నమెంట్ ప్లీడర్లు (జీపీలు), అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ల (ఏజీపీలు) గౌరవ వేతనాలను కూడా పెంచేందుకు త్వరలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి ఫరూక్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సన్నాహాలు చేయాలని న్యాయ శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ నిర్ణయం న్యాయవ్యవస్థలో పనిచేస్తున్న లా ఆఫీసర్ల మనోస్థైర్యాన్ని మరింత పెంపొందించి, ప్రభుత్వ తరఫున వాదనలు సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Read More
Next Story