బిల్ గేట్స్ విమానం అంతసేపు గాల్లోనే ఎందుకుందీ?
x

బిల్ గేట్స్ విమానం అంతసేపు గాల్లోనే ఎందుకుందీ?

గన్నవరం విమానాశ్రయంలో ఉత్కంఠ


ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు సెగ తగిలింది. సోమవారం ఉదయం విజయవాడ, పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రన్‌వేపై విజిబిలిటీ (Visibility) కనిష్ట స్థాయికి పడిపోయింది.
దీంతో బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న విమానం గన్నవరం గగనతలానికి చేరుకున్నప్పటికీ, సురక్షితంగా ల్యాండ్ చేసే అవకాశం లేకపోవడంతో సుమారు 15 నిమిషాల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.
అసలేం జరిగింది?
ఉదయం వేళ ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు విమాన ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారు. పైలట్లు రన్‌వేను స్పష్టంగా చూడలేకపోవడంతో, సిగ్నల్ వచ్చే వరకు విమానాన్ని గాలిలోనే నిరీక్షించవలసి వచ్చింది. అనంతరం పొగమంచు కాస్త తగ్గడంతో, ఏటీసీ అధికారుల ఆదేశాల మేరకు విమానం సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ అయింది.
పర్యటన ఉద్దేశం: అమరావతిలో కీలక చర్చలు
బిల్ గేట్స్ ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కొన్ని కీలక సామాజిక ప్రాజెక్టుల నిమిత్తం జరుగుతోంది. ప్రధానంగా..
సంజీవని వైద్య సేవలు: రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే అంశంపై చర్చలు.
సాంకేతిక సహకారం: ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల్లో మైక్రోసాఫ్ట్ లేదా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంపై నిర్ణయం.
సీఎం చంద్రబాబుతో భేటీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బిల్ గేట్స్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వీరిద్దరి భేటీ అనంతరం ఏపీకి సంబంధించి మరిన్ని కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కూడా ఆయన్ను కలుస్తారు.
Read More
Next Story