
టెర్రాకోట బొమ్మల కళ ఏ కాలం నాటిదంటే...
హర్యానాలో లభించిన నాణేలు కథమేటి? చిత్తూరు జిల్లాకు ఆ కళ ఎలా విస్తరించింది?
టెర్రాకోట బొమ్మలు అనగానే మనకు చిత్తూరు జిల్లా గుర్తుకు వస్తుంది. జిల్లాలోని పలమనేరు, మదనపల్లెకు సమీపంలోని కంటేవారిపల్లె వద్ద మట్టితో చేసిన అందమైన బొమ్మలు కనువిందు చేస్తాయి. ఈ బొమ్మలు ఏ కాలం నాటివి? వాటికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ చరిత్రకు సంబంధించిన పురాతన ఆనవాళ్ల నాణేలు హర్యానాలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India ASI ) ప్రతినిధులకు లభించిన పురాతన నాణేలు మట్టితో చేసే అత్యంత పురాతనమైన, అద్భుతమైన కళకు సాక్ష్యం దొరికింది.
( ఈ వీడియోలో ఆ వివరాలు చూడండి)
టెర్రాకోట బొమ్మలతో చిత్తూరు జిల్లా చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పిన ఈ కళ వేల సంవత్సరాల నాటిది సింధూలోయ నాగరికతను వివరిస్తుందని ASI డైరెక్టర్ మునిరత్నం రెడ్డి గుర్తు చేశారు. ఆ కాలం నుంచి క్రీస్తు పూర్వం 3,330 నుంచి 1300 నుంచే టెర్రాకోట బొమ్మలు, ముద్రలు ప్రాచుర్యంలో ఉన్నట్లు ఆధారం ఉన్నా.. హరప్ప, మొహంజోదారో తవ్వకాల్లో బయటపడిన మాతృదేవత విగ్రహాలే నిదర్శనం అని ఆయన వివరించారు.
"మౌర్యులు, గుప్తుల కాలంలో ఈ కళ మరింత అభివృద్ధి చెందింది. పశ్చిమ బెంగాల్ విష్ణుపూర్ ఆలయాలు టెర్రాకోట వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందాయి" అని మునిరత్నం రెడ్డి వివరించారు. ఆ కళ ప్రస్తుతం సజీవంగా చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కుండల తయారీ అలంకరణ వస్తువులు, దేవతా మూర్తుల తయారీలో టెర్రెకోట కళ సజీవంగా ఉందని ఆయన వివరించారు.

