కేరళలో రేపటి నుంచి జెండర్ టికెటింగ్ విధానం..
x

కేరళలో రేపటి నుంచి జెండర్ టికెటింగ్ విధానం..

కేఎస్ఆర్టీసీకి ఉత్తర్వులు జారీ..


Click the Play button to hear this message in audio format

కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అధికారంలోకి వచ్చిన తర్వాత, కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) శనివారం (మే 9) ఆర్టీసీ బస్సుల్లో లింగ ఆధారిత టికెటింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

తాము అధికారంలోకి వస్తే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోలాగా, కేరళలో కూడా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఇచ్చిన హామీని యూడీఎఫ్ నిలబెట్టుకుంది.

సర్క్యులర్ జారీ..

టిక్కెట్ ఇచ్చేటప్పడు ప్రయాణికుడు మహిళా, పురుషుడా లేక బాలుడా అనే విషయాన్ని నమోదు చేయాలని ఇప్పటికే కండక్టర్లకు సర్క్యులర్ జారీ అయ్యింది. ఫలితంగా బస్సుల్లో రోజుకు ప్రయాణించే మహిళల సంఖ్య సులభంగా తెలిసే అవకాశం ఉంది.

కండక్టర్ల ఆందోళన..

అయితే కండక్టర్లు ఈ విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ వేళల్లో ప్రయాణికుల వివరాలు నమోదుకు చాలా సమయం పడుతుందని వాదిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే జెండర్ టికెటింగ్ విధానాన్ని అమలు చేసిన తొలి కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా కేరళ రికార్డుల్లోకి ఎక్కనుంది.

Read More
Next Story