తిరుపతి వారాహిసభలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ (ఫైల్)

2029 సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్: కాపు, బలిజ నేతల సంచలన డిమాండ్

వైసీపీ, టీడీపీ, కూటమికి బలిజ శంఖారావం సభ అల్టిమేటం.. రాయలసీమలో 15 సీట్లు కేటాయించాలనే డిమాండ్.


ఉభయ తెలుగురాష్ట్రాల బలిజ (కాపు) సంఘాల నేతలు 2029 ఎన్నికలకు సమరశంఖం పూరించారు. అధికారంలో భాగస్వామ్యం కాదు. పవర్ కావాలని ప్రధాన రాజకీయ పార్టీలకు సూటిగా హెచ్చరికలు జారీ చేశారు. రాయలసీమలో బలిజకలకు అధికసీట్లు కేటాయించాలని టీడీపీ కూటమి తోపాటు వైసీపీని కూడా డిమాండ్ చేశారు. అందులో ప్రధానంగా

"డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. వైసీపీ కూడా అదే నిర్ణయం వెలువరచాలి" అని వీర బ‌లిజ సాంస్కృతిక పున‌ర్జీవ‌న శంఖారావ స‌భ
డిమాండ్ చేసింది.
తిరుపతి సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇస్తూ, వీర బ‌లిజ సాంస్కృతిక పున‌ర్జీవ‌న శంఖారావ స‌భకు వందలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో దక్షణ భారత దేశం, శ్రీలంకను పాలించిన బలిజ చక్రవర్తుల వారసులను ఈ సభలో సన్మానించారు. అందులో ప్రధానంగా
శ్రీలంక కు చెందిన క్యాండీ రాజుల వారసులు, కళ్యాణదుర్గం బలిజ సంఘం అధ్యక్షులు బుట్న తిమ్మరాజు భార్య ఛాయాదేవి రాజసింఘే అలియాస్ లక్ష్మీ, బుట్న తిమ్మరాజు ను రాజా నవనీత, రాయదుర్గానికి చెందిన పురుషోత్తం రాజాను సన్మానించారు.

ఏడు తీర్మానాలు ఇవి...

తిరుపతిలో నిర్వహించిన బలజ శంఖారావంలో ఏడు తీర్మాణాల‌ను ఆమోదించారు. ఆ వివరాలను వీర బ‌లిజ సాంస్కృతిక పున‌ర్జీవ‌న శంఖారావం ప్రతినిధి దూపం అభిమన్యు మీడియాకు వివరించారు.
1. బలిజ‌, కాపులు శ‌తాబ్దాలుగా ధ‌ర్మానికి క‌ట్టుబ‌డి జీవ‌నం సాగించార‌ని ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ త‌రాలు స‌నాత‌న ధ‌ర్మప‌రిర‌క్ష‌కులుగా కొన‌సాగాల‌ని తీర్మాణించారు.
2 . రాయ‌ల‌సీమ‌లో బ‌లిజలు అధిక సంఖ్య‌లో ఉన్నందున 54 అసెంబ్లీ స్థానాల్లో క‌నీసం 15 అసెంబ్లీ సీట్లు బ‌లిజ‌ల‌కు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ప్ర‌క‌టించాలి.
3. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సొంత సామాజిక వ‌ర్గం దూరం పెట్టినా బ‌లిజ‌లు ఆయ‌న‌కు అండ‌గా నిల‌బ‌డ్డార‌. వైసీపీ 2029 ఎన్నిక‌ల్లో సిఎం అభ్య‌ర్థిగా బ‌లిజ నాయ‌కున్ని ప్ర‌క‌టించాలి.
4. కాపులు అండ‌గా నిలిచిన‌ప్పుడే అధికారంలోకి వ‌చ్చిన తెలుగుదేశం పార్టీ 2029 ఎన్నిక‌ల్లో త‌న సిఎం అభ్య‌ర్థిగా కాపును ప్ర‌క‌టించాల‌ని కోరింది.
5. న్డీఏ కూట‌మి సిఎం అభ్య‌ర్థిగా జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను బిజేపి ప్ర‌క‌టించాల‌ని శంఖారావం డిమాండ్ చేసింది.
6. 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో బలిజ‌, కాపుల‌కు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల‌న‌న్నింటిని నెర‌వేర్చాల‌ని శంఖారావం కోరింది.
"బ‌లిజ‌, కాపు, తెల‌గ‌, తూర్పు, మున్నారు కాపులు ఆర్థికంగా బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌ను క‌లుపుకుపోవాల‌ని తీర్మాణించాం" అని అఖిల భార‌త కాపు చ‌రిత్ర సంక‌ల‌న స‌మితి క‌న్విన‌ర్ దూపం అభిమ‌న్యు చెప్పారు. జ‌న‌సేన అధ్యక్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అండా త‌మ సామాజిక వ‌ర్గం నిల‌బ‌డ‌ట‌మే కాకుండా ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌ను క‌లుపుకు పోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.
(ఆ వివరాలేమిటో ఈ వీడియోలో చూడండి)

Read More
Next Story