
చేతులకు సంకెళ్లు వేసుకుని ప్రధాని ఇంటి దగ్గర కాంగ్రెస్ నిరసన
రాజీనామా చేయాలని డిమాండ్
నీట్ పేపర్ లీక్ పై నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే తో కలిసి మంగళవారం ప్రధానమంత్రి లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసం వెలుపల నిరసన తెలిపారు.
ఈ ధర్నాలో పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్య నేతలు కూడా కూడా ఉన్నారు. ప్రతిపక్ష ఎంపీలు చేతులకు సంకెళ్లు వేసుకుని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం పార్లమెంట్ కు సీజేపీ నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా నిరసనకారులపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు అంతకుముందు ప్రధాని నివాసం వరకూ పాదయాత్ర చేశారు.
‘‘నిన్న యువతపై జరిగిన దారుణాలకు ప్రధాని మోదీ సమాధానాలు కోరేందుకు మేము ఆయన ఇంటి వరకూ పాదయాత్ర చేశాము. ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. పార్లమెంట్ లో దీనిపై చర్చ జరపడానికి కూడా సిద్దంగా లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.

