కార్లతో ఫైట్ చేసుకున్న ఆ ఇద్దరూ కటకటాల వెనుకే!
x
నిందితులు ఓం, రోహిత్

కార్లతో ఫైట్ చేసుకున్న ఆ 'ఇద్దరూ' కటకటాల వెనుకే!

ఇద్దరూ సంపన్నుల బిడ్డలే.. మాదక ద్రవ్యాల అలవాటూ ఉన్నట్టు తెలుస్తోంది. దూరపు చుట్టాలు కూడానట.. ఓ యువతి కోసం జైలు పాలయ్యారు.


ఓ యువతి కోసం నడిరోడ్డుపై కార్లతో ఢీకొట్టుకుని బీభత్సం సృష్టించిన ఆ ఇద్దరు యువకులు ఇప్పుడు కటకటాల వెనక్కి చేరారు. విజయవాడలోని ఆర్‌ఆర్ గార్డెన్ సమీపంలోని హైటెన్షన్ రోడ్డుపై జరిగిన ఈ రియల్ ఫైట్ లో బోల్లా ఓమ్ (ఏ1), లింగమనేని రోహిత్ (ఏ2) అనే ఇద్దరు యువకులు తమ జీపులు, కార్లతో ఒకరినొకరు ఢీకొట్టుకున్నారు. ఈ ఘటనలో ఓమ్ కారు చక్రం ఊడిపోయి రోడ్డు మీద బీభత్స దృశ్యం చోటు చేసుకుంది.

పటమట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఓమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ మొదట పరారీలో ఉన్నప్పటికీ, తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరినీ విచారించి కోర్టుకు ప్రొడ్యూస్ చేయగా, కోర్టు ఇద్దరినీ విజయవాడ సెంట్రల్ జైలుకు రిమాండ్ చేసింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ జైల్లోనే ఉన్నారు.
ఘటన ఎలా జరిగింది?
ఈ ఇద్దరు స్నేహితులే. దూరపు చుట్టాలు కూడా. ఓ యువతి కోసం గొడవ పడ్డారు. గురువారం వేకువ నుంచి వాట్సాప్‌లో మొదలైన వాగ్వాదం సాయంత్రం వరకు కొనసాగింది. ఓమ్ రోహిత్‌ను సవాల్ చేయడంతో రోహిత్ రాత్రి 8 గంటలకు స్నేహితుడితో కలిసి స్థలానికి చేరుకున్నాడు. మాటలతో రెచ్చిపోయిన వీళ్లు కార్లతో ఫైట్‌కు దిగారు.
డ్రగ్స్, స్టెరాయిడ్స్ అలవాటు ఉంది...
రోహిత్ జీపులో స్టెరాయిడ్స్ సిరంజులు, ఎలక్ట్రిక్ సిగరెట్ కిట్ దొరికాయి. సిక్స్ ప్యాక్ కోసం స్టెరాయిడ్స్ వాడతానని అంగీకరించాడు.
బోల్లా ఓమ్ డ్రగ్స్ టెస్ట్‌లో గంజాయి పాజిటివ్ వచ్చింది. ఇద్దరి ఇళ్లల్లో సోదాలు జరిపారు. మరిన్ని మత్తు పదార్థాలు దొరికినట్టు తెలుస్తున్నా పోలీసులు అధికారికంగా బయటపెట్టలేదు.
బోల్లా ఓమ్: బీబీఏ పూర్తి చేసి తండ్రి బోల్లా జితేంద్ర రియల్ ఎస్టేట్ వ్యాపారం చూస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన ర్యాలీలు, మాజీ మంత్రి జోగి రమేష్‌తో ఫోటోలు ఉన్నాయి.
లింగమనేని రోహిత్: తాడేపల్లిలో BBA చదువుతున్నాడు. తండ్రికి ట్రాన్స్‌పోర్టు సంస్థ ఉంది.


ఈ ఘటనలో యువతి కోసం ఈర్ష్య, స్టెరాయిడ్స్ వాడకం, మత్తు పదార్థాలు, డబ్బు-రాజకీయ సంబంధాలు కలిసి ప్రమాదకరమైన ఫలితాన్ని ఇచ్చాయి.
ఓమ్ పోలీసులతో ఎదురు ప్రశ్న వేశాడు.. “నా మీద దాడి చేస్తుంటే చేతులు ముడుచుకుని కూర్చోవాలా?” అని
ఇద్దరూ సంపన్నుల బిడ్డలే...
ఇద్దరూ ధనవంతుల కుమారులు. ఇద్దరూ బాడీ బిల్డింగ్ అభిమానులు. ఇద్దరూ ఆ యువతి కోసం రక్తం కక్కుకున్నారు. ఒకరు రాజకీయ ప్రముఖులతో ఫోటోలు పెట్టుకునే ధైర్యం, మరొకరు డ్రగ్స్, స్టెరాయిడ్స్‌తో శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు.
ఈ ఘటన విజయవాడ యువతరం మధ్య ఉన్న టాక్సిక్ మాస్క్యులినిటీ, మత్తు పదార్థాలు, డబ్బు-రాజకీయాల గొడవలను ఒక్కసారిగా బయటపెట్టింది.
ఒక్క యువతి పేరుతో మొదలైన ఈ గొడవ... రెండు కుటుంబాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది.
ఇద్దరినీ పటమట పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ఇద్దరినీ జైలుకు రిమాండ్ చేసింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ విజయవాడ సెంట్రల్ జైలులో ఉన్నారు.
కేసు వివరాలు:
పోలీసులు BNS సెక్షన్లు (285, 281, 292, 351(2) + 3(5), కొన్ని అదనపు సెక్షన్లు — డేంజరస్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్, అటెంప్ట్ టు మర్డర్ వంటివి) కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటన మళ్లీ నగరవాసులను ఆందోళనకు గురి చేసింది. 2020 మే నెలలో జరిగిన పటమట గ్యాంగ్ వార్ తర్వాత విజయవాడలో గ్యాంగ్ యుద్ధాలు లేకుండా ఉండగా, ఈ కారు రేజ్ ఘటన కొత్త చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇద్దరు యువకులూ అరెస్టు అయి కటకటాల వెనుకే ఉన్నారు.
Read More
Next Story