శ్రీవారి కంఠాన అలరించనున్న ఏడు పతకాలు
x

శ్రీవారి కంఠాన అలరించనున్న ఏడు పతకాలు

రూ. 94.80 లక్షల విలువైన ఆభరణాలు సమర్పించిన బెంగళూరు డాక్టర్


తిరుమలలో బెంగళూరుకు చెందిన ప్రముఖ డాక్టర్ ఎం. మహదేవమ్మ శుక్రవారం ఏడు బంగారు పతకాలను సమర్పించారు. ఈ కానుకల విలువ 94.80 లక్షలు ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేశారు.

తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి ఇద్దరు దాతలు రూ. 20 లక్సల రూపాయలు విరాళంగా అందించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే సామన్య యాత్రికులే కాకుండా, సంపన్నులు కూడా అపారమైన భక్తి చాటుకుంటూ సమర్పించే విరాళాలు, విలువైన బంగారు ఆభరణాలతో శ్రీవారి క్షేత్రం అత్యంత సంపన్నంగా మారింది.

తిరుమల శ్రీవారు అత్యంత సంపన్నుడిగా మారారు. దాదాపు 11 టన్నుల ఆభరణాల చెంతకు మరో ఏడు పతకాలు జత కలిశాయి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రాజుల కాలంలో సమర్పించిన కానుకలు ఉన్నాయి. వాటిని విశేష పర్వదినాల్లో అలంకరించడం ద్వారా శ్రీవారిని యాత్రికులకు దర్శనం కల్పిస్తున్నారు.

శ్రీవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్న తరువాత బెంగళూరుకు చెందిన డాక్టర్ ఎం. మహదేవమ్మ రంగనాయకులు మండపంలో కానుకలు సమర్పించారు. 753 గ్రాముల బరువు ఉన్న ఏడు పతకాలను టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి ద్వారా ఆలయానికి అందించారు. దాత డాక్టర్ ఎం. మహదేవమ్మకు టీటీడీ వేదపండితులు ఆలయంలోని రంగనాయకులు మండపంలో వేదాశీర్వచనం, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు.

ఆభరణాల నిలయం..

తిరుమల శ్రీవారికి అలంకరించే వజ్రాభరణాలకు కొదవ లేదు. ఇప్పటికే శ్రీవారి ఆలయ కోశాగారంలో దాదాపు 11 టన్నుల పైగా బంగారం, భారీ మొత్తంలో వెండి, వజ్రవైఢూర్యాలు ఉన్నాయి. స్వామివారికి అలంకరించే మకరతోరణం, శంఖు-చక్రాలు, కటి వరద హస్తాలు, ఏడు వజ్రకిరీటాలు ప్రధానమైనవి. వీటిలో వేల సంఖ్యలో మేలిరకం వజ్రాలు పొదిగి ఉన్నాయి.
శ్రీవారి నడుముకు అలంకరించే సూర్య కటారి (నందకం) ఖడ్గం రత్నాలు పొదిగిన బంగారుతో తయారు చేసిందే. స్వామివారి మెడలో అలంకరించే ఆభరణాలలో అతిపెద్దదైన నీలమణి (Blue Sapphire) ప్రపంచంలోనే అరుదైనదిగా గుర్తింపు పొందింది. శ్రీవారి మూలవిరాట్టుకు కాకుండా, జయవిజయులు ద్వారపాలకులుగా ఉన్న బంగారువాకిలి, ఆనంద నిలయాన్ని బంగారుతోనే తాపడం చేశారు.
అన్నదాన పథకానికి
టీటీడీ నిర్వహిస్తున్న 10 ట్రస్టుటు నిర్వహిస్తోంది. అందులో ప్రాణదానం, అన్నదానం ట్రస్టులకు దాతలు విరాళాలు అందించి, పేదల వైద్యం, అన్నదానానికి సహకారం అందిస్తున్నరు. తిరుమలలో ఇద్దరు దాతలు రూ. 20 లక్షలు విరాళంగా అందించారు. ఆ డీడీలను టీటీడీ పాలక మండలి సభ్యుడు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు.

శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ గీతిక సాయి రూ.10,01,116 విరాళంగా అందించారు. హైదరాబాద్ కు చెందిన మరో దాత ఏసీఎస్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధులు రూ.10,01,116 విరాళంగా అందించారు. ఆ డీడీలను బోర్డు సభ్యుడు సదాశివరావు టీటీడీకి ఈఓ రవిచంద్రకు అందజేశారు.

Read More
Next Story