
ఆయాతో అక్రమ సంబంధం వద్దన్నందుకు...
చికిత్స కోసం వచ్చిన పేషెంట్ కుమారునితో అక్రమ సంబంధం..
జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో సీనియర్ టెక్నీషియన్ ముప్పిడి సుధాకర్ ఆత్మహత్యకు కారకులైన ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇన్‌ఛార్జి డీఎస్పీ యు.రవిచంద్ర చెప్పిన కథనం ప్రకారం...
2023లో డయాలసిస్ చికిత్స కోసం వచ్చే ఒక రోగి కుమారుడైన కొమ్ము అజయ్బాబుకు, అక్కడ ఆయాగా పనిచేస్తున్న యరమాల కరుణకుమారికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి ప్రవర్తనను చూసిన సుధాకర్ అందరి ముందు మందలించారు. దీంతో అతనిపై వాళ్లిద్దరూ కక్ష పెంచుకున్నారు. అప్పట్లోనే తప్పుడు సాక్ష్యాలతో కేసు పెట్టారు. దీంతో టెక్నీషియన్ సుధాకర్ అవనిగడ్డకు బదిలీ అయ్యారు. ఆ తర్వాత కొంత కాలానికి తిరిగి వచ్చినా మళ్లీ కేసులు పెట్టడం ప్రారంభించారు. గత సెప్టెంబర్‌లో సుధాకర్ తిరిగి జంగారెడ్డిగూడెంకు తిరిగి వచ్చినప్పటి నుంచి అజయ్‌బాబు, కరుణకుమారి మరికొందరి (అలుగు ఆనందశేఖర్, ములకాల వీరరాఘవులు) సహకారంతో సుధాకర్‌ను టార్గెట్ చేశారు.
నిరంతరం పీజీఆర్ఎస్లో తప్పుడు ఫిర్యాదులు చేయడం, పాత కేసు విరమించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం, మానసికంగా వేధించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. నిందితుల వేధింపులు భరించలేక మనస్తాపానికి గురైన సుధాకర్, ఈ నెల 18న ఆసుపత్రి ఆవరణలోని వాటర్ ప్లాంట్ షెడ్డులో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
పైగా సుధాకర్ తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ సూసైట్ నోట్ లో తన చావుకు అజయ్‌బాబు, కరుణకుమారి, వీరరాఘవులు, ఆనందశేఖర్లే కారణమని స్పష్టంగా పేర్కొన్నారు.
దీని ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. సుధాకర్ భార్య మణిబాల సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు కొమ్ము అజయ్‌బాబు, యరమాల కరుణకుమారి ని అరెస్ట్ చేశారు. ములకాల వీరరాఘవులు, అలుగు ఆనందశేఖర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తులో సీఐ సుభాశ్, ఎస్సై వీరప్రసాద్ బృందం చురుగ్గా పాల్గొంటున్నారు.
Next Story

