
బీజేపీలో 'బండి' ఒంటరి పోరు: కుమారుడి అరెస్ట్ వేళ..
కుమారుడి వ్యవహారంలో బండి సంజయ్ తన నైతికతను చాటుకున్నప్పటికీ.. రాజకీయంగా ఈ ఉదంతం ఆయనకు పెద్ద పరీక్షే పెట్టింది.
పోక్సో (POCSO) కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరెస్ట్ కావడం, 14 రోజుల రిమాండ్‌కు తరలిపోవడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. శనివారం రోజంతా సాగిన తీవ్ర ఉత్కంఠ, నాటకీయ పరిణామాల మధ్య చివరకు బండి సంజయ్ తన కుమారుడిని చట్టానికి అప్పగించారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ శ్రేణులు, కీలక నేతలు వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. పార్టీ కోసం నిరంతరం పోరాడే బండి సంజయ్.. సొంత కుటుంబం ఇబ్బందుల్లో పడ్డ వేళ పార్టీలో ఒంటరి అయ్యారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వేగంగా మారిన పరిణామాలు
మే 8న పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. హైకోర్టులో ముందస్తు బెయిలు లేదా అరెస్టు నుంచి రక్షణ లభించకపోవడంతో శనివారం ఉదయం నుంచే పరిణామాలు వేగంగా మారాయి.
భగీరథ్ విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. హైదరాబాద్, కరీంనగర్‌లలోని 5 ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ బంజారాహిల్స్ నివాసంలోనూ పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపింది.
బాధితురాలి వాంగ్మూలం...
మరోవైపు, మేడ్చల్ కోర్టులో న్యాయమూర్తి సమక్షంలో బాధితురాలి, ఆమె తల్లి వాంగ్మూలాన్ని పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 183 ప్రకారం రికార్డు చేశారు. పోక్సో కేసుల్లో ఈ రికార్డింగ్ అత్యంత కీలకం కావడంతో బండి భగీరథ్‌కు ఉచ్చు బిగిసుకుంది. పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టం ముందు తన బిడ్డైనా, సామాన్యుడైనా ఒకటేనని స్పష్టం చేశారు.
"మా అబ్బాయి ఏ తప్పూ చేయలేదని చెబుతున్నాడు. లాయర్ల సలహా మేరకే కొంత జాప్యం జరిగింది. సోమవారం బెయిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఇంకా ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతోనే న్యాయవాదుల ద్వారా నా కుమారుడిని పోలీసులకు అప్పగించా." అని బండి సంజయ్ ప్రకటించారు.
రాత్రి 8 గంటల ప్రాంతంలో సంజయ్ ప్రకటన రాగా, రాత్రి 9 గంటలకు భగీరథ్ న్యాయవాదులతో కలిసి పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. రాత్రి 12 గంటల సమయంలో మేడ్చల్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. సోమవారం నాడు నిందితుడి తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
బీజేపీలో బండి ఒంటరి పోరు..
యావత్ ఉత్కంఠభరిత పరిణామాల్లో తెలంగాణ బీజేపీలోని అంతర్గత సమీకరణాలు మరోసారి బయటపడ్డాయి. బండి సంజయ్ పార్టీ కోసం వీధి పోరాటాలు చేసినప్పుడు వందలాదిగా తరలివచ్చే నేతలు, ఈ వ్యక్తిగత/కుటుంబ సంక్షోభం సమయంలో మాత్రం వెనకడుగు వేసినట్లు కనిపిస్తోంది.
భగీరథ్ విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. హైదరాబాద్, కరీంనగర్‌లలోని 5 ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ బంజారాహిల్స్ నివాసంలోనూ పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపింది.
బాధితురాలి వాంగ్మూలం....
మేడ్చల్ కోర్టులో న్యాయమూర్తి సమక్షంలో బాధితురాలి, ఆమె తల్లి వాంగ్మూలాన్ని పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 183 ప్రకారం రికార్డు చేశారు. పోక్సో కేసుల్లో ఈ రికార్డింగ్ అత్యంత కీలకం కావడంతో బండి భగీరథ్‌కు ఉచ్చు బిగుసుకుంది.
చట్టంపై గౌరవంతో అప్పగించా: బండి సంజయ్
పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టం ముందు తన బిడ్డైనా, సామాన్యుడైనా ఒకటేనని స్పష్టం చేశారు.
"మా అబ్బాయి ఏ తప్పూ చేయలేదని చెబుతున్నాడు. లాయర్ల సలహా మేరకే కొంత జాప్యం జరిగింది. సోమవారం బెయిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఇంకా ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతోనే న్యాయవాదుల ద్వారా నా కుమారుడిని పోలీసులకు అప్పగించా." బండి సంజయ్ అన్నారు.
రాత్రి 8 గంటల ప్రాంతంలో సంజయ్ ప్రకటన రాగా, రాత్రి 9 గంటలకు భగీరథ్ న్యాయవాదులతో కలిసి పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. రాత్రి 12 గంటల సమయంలో మేడ్చల్ మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. సోమవారం నాడు నిందితుడి తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
బీజేపీలో బండి ఒంటరి పోరు.. పరామర్శలకే పరిమితం!
ఈ యావత్ ఉత్కంఠభరిత పరిణామాల్లో తెలంగాణ బీజేపీలోని అంతర్గత సమీకరణాలు మరోసారి బయటపడ్డాయి. బండి సంజయ్ పార్టీ కోసం వీధి పోరాటాలు చేసినప్పుడు వందలాదిగా తరలివచ్చే నేతలు, ఈ వ్యక్తిగత/కుటుంబ సంక్షోభం సమయంలో మాత్రం వెనకడుగు వేసినట్లు కనిపిస్తోంది.
అండగా నిలవని అగ్రనాయకత్వం...
ఈ వ్యవహారంలో పార్టీకి సంబంధం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంతకుముందే ప్రకటించారు. దీనర్థం పార్టీ ఆయన వెంట నడవదనేది చెప్పకనే చెప్పినట్టయింది.
కేంద్ర మంత్రి హోదాలో ఉన్న నాయకుడి ఇంట్లోనే పోలీసులు సోదాలు చేస్తున్నా, లుకౌట్ నోటీసులు జారీ చేసినా రాష్ట్ర బీజేపీకి చెందిన అగ్ర నేతలు ఎవరూ పోలీస్ స్టేషన్‌కు గానీ, సంజయ్ నివాసానికి గానీ భారీ కేడర్‌తో తరలిరాకపోవడం గమనార్హం.
కొందరు కీలక నేతలు కేవలం ఫోన్ ద్వారా పరామర్శలకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో బండి సంజయ్ ఒంటరిగానే ఈ చట్టపరమైన పోరాటాన్ని ఎదుర్కొంటున్నారనే టాక్ నడుస్తోంది.
నైతిక రక్షణ కరువైందా?: పోక్సో కేసు కావడంతో సాంకేతికంగా చట్టం తన పని తాను చేసుకుపోతున్నా, రాజకీయంగా బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తున్నారనే కోణంలో పార్టీ గట్టిగా వాయిస్ వినిపించకపోవడం గమనార్హం.
యూట్యూబర్లపై పోలీసుల నిఘా
ఇదిలా ఉంటే, మైనర్ అయిన బాధితురాలి వివరాలను సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తూ వెల్లడించినందుకు గానూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు 14 మంది యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామర్లపై కేసులు నమోదు చేశారు. మరో 27 మందిపై విచారణ జరుపుతున్నారు.
కుమారుడి వ్యవహారంలో చట్టానికి సహకరించి బండి సంజయ్ తన నైతికతను చాటుకున్నప్పటికీ.. రాజకీయంగా మాత్రం ఈ ఉదంతం ఆయనకు పెద్ద పరీక్షే పెట్టింది. ముఖ్యంగా సొంత పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో నైతిక మద్దతు లభించకపోవడం, ఆయన ఒంటరిగానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం రానున్న బెయిల్ తీర్పుపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
Next Story

