అందనంత ఎత్తుకు అచ్చెన్నాయుడు
x

అందనంత ఎత్తుకు అచ్చెన్నాయుడు

ఈ-ఫైళ్ల పరిష్కారంలో సరికొత్త హిస్టరీ.


పరిపాలన అంటే కేవలం ఫైళ్లపై సంతకాలు చేయడం కాదు.. ప్రజల సమస్యలకు రెక్కలు కట్టి, పరిష్కార దిశగా పరుగులు పెట్టించడం అని నిరూపిస్తున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఈ-ఆఫీస్ నిర్వహణలో అసాధారణ వేగాన్ని ప్రదర్శిస్తూ, ఫైళ్ల క్లియరెన్స్‌లో గత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నారు. అందనంత ఎత్తుకు అచ్చెన్న అనే రీతిలో, సగటున మూడు గంటల లోపే అత్యంత క్లిష్టమైన ఫైళ్లను పరిష్కరిస్తూ పాలనలో తనదైన స్పీడ్ మార్క్ చూపిస్తున్నారు. గంటల వ్యవధిలోనే నిర్ణయాలు తీసుకుంటూ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వేగంగా చేరవేస్తున్న ఆయన పనితీరు ఇప్పుడు యావత్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది.

5 గంటల నుంచి 2 గంటలకే.. అద్భుత ప్రగతి
గతంలో ఈ-ఫైళ్లను పరిశీలించి ఆమోదించడానికి మంత్రి సగటున 5 గంటల సమయం తీసుకునేవారు. అయితే, పనిభారం పెరిగినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా, తన పనితీరును మరింత మెరుగుపరుచుకున్నారు. ప్రస్తుతం భారీ సంఖ్యలో ఫైళ్లు వస్తున్నప్పటికీ, వాటన్నింటినీ సగటున కేవలం 2 గంటల 49 నిమిషాల వ్యవధిలోనే పరిష్కరిస్తూ (Dispose) పరిపాలనా సామర్థ్యానికి సరికొత్త నిర్వచనం చెబుతున్నారు. రోజుల తరబడి ఫైళ్లు పెండింగ్‌లో ఉండే పాత పద్ధతులకు స్వస్తి పలికి, నిర్ణయం.. వేగవంతం అనే నినాదంతో ఆయన ముందుకు సాగుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల జల్లు
మంత్రి అచ్చెన్నాయుడు ప్రదర్శిస్తున్న ఈ వేగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఫైళ్ల పరిష్కారంలో చూపుతున్న పారదర్శకత, అంకితభావాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు సేవ అందించడంలో జాప్యం జరగకూడదు అనే ప్రభుత్వ ఆశయాన్ని అచ్చెన్నాయుడు అక్షరాలా అమలు చేస్తున్నారని సీఎం కొనియాడారు. కేబినెట్‌లో సీనియర్ మంత్రిగా ఉంటూ, యువ మంత్రులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
అధికార యంత్రాంగంలో పెరిగిన చురుకుదనం
మంత్రి స్థాయిలో ఫైళ్లు ఇంత వేగంగా క్లియర్ అవుతుండటంతో, అధికారుల్లో కూడా జవాబుదారీతనం పెరిగింది. వ్యవసాయం మరియు అనుబంధ శాఖల్లో ఎక్కడా పనులు నిలిచిపోకుండా యంత్రాంగం పరుగులు పెడుతోంది. మంత్రి నిరంతరం ఫైళ్లను పర్యవేక్షిస్తుండటంతో మేము కూడా అంతే వేగంగా ఫైళ్లను మూవ్ చేస్తున్నాం అని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రజా ప్రయోజనాలే పరమావధి
రైతులకు అందాల్సిన సాయం, పథకాల అమలు, పరిపాలనాపరమైన అనుమతులు వంటి కీలక అంశాల్లో జాప్యం జరిగితే అది నేరుగా ప్రజలపై ప్రభావం చూపుతుంది. ఈ విషయాన్ని గమనించిన అచ్చెన్నాయుడు, సాంకేతికతను (e-Files) అందిపుచ్చుకుని పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారు. పారదర్శకత, వేగం, సమర్థత కలగలిసిన అచ్చెన్న పనితీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో హాట్ టాపిక్‌గా మారింది.
Read More
Next Story