
‘సుమోటో’ విధానాల్లోనే లోపాలున్నాయా?
సీజేపీ పిటిషన్ ను విచారించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు.. చట్టబద్దమైన ప్రోసిజర్ ఫాలో కావాలని పిటిషనర్ కు సూచన
ఢిల్లీలో జరిగిన నిరసనలపై న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారణకు తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్చి బాగ్చీ, వి మోహనలతో కూడిన ధర్మాసనం ముందు న్యాయవాదీ నరేంద్ర మిశ్రా వాదనలు వినిపించారు.
సంసద్ చలో మార్చ్ లో హింస..
మా సమయాన్ని వృథా చేయకండి.. మీ సమయాన్ని వృథా చేసుకోండి.. వీడియోలు చూసే సమయం మాకు లేదు అని న్యాయవాదీతో కఠినంగా చెప్పారు. నిరాయుధులైన విద్యార్థులతో పోలీసులు కఠినంగా వ్యవహరించారని అన్నారు.
సీజేపీ నేతృత్వంలో జరిగిన సంసద్ యాత్రలో పార్లమెంట్ వర్షకాల సమావేశం ప్రారంభం రోజునే జరిగింది. నీట్ పేపర్ లీక్ ఘటనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే లక్ష్యంతో వేలాది మంది నిరసనకారులు జంతర్ మంతర్ వైపు నుంచి పార్లమెంట్ వైపుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఎన్టీఏలో సంస్కరణలు తీసుకురావాలని, విద్యార్థుల ఆత్మహత్యలపై కూడా కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సోనమ్ వాంగ్ చుక్ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరాహార దీక్ష పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పార్లమెంట్ ను ముట్టడించాలని సీజేపీ పిలుపునిచ్చింది. పోలీసులు బారికేడ్లతో వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.
ఆ తరువాత జరిగిన పరిణామాలను పరిశీలించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఇక్కడ మితీమీరిన బలప్రయోగం జరిగిందని వారి ఆరోపణ. నిరసనకారులు మొదట రాళ్లదాడికి పాల్పడినట్లు, పోలీసులపైకి రాళ్లు రువ్వినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి.
ఓ లేడీ రిపోర్టర్ పై కూడా దాడి చేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. పార్లమెంట్ పై దాడి చేస్తాం.. ప్రధాన నరేంద్ర మోదీని చంపేస్తాం.. ఇండియాను మరో నేపాల్ చేస్తామనే వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీనిపై సెంట్రల్ ఢిల్లీలో కనీసం తొమ్మిది ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి.
సుమోటో అరుదైనది కాదు..
అధికార పిటిషన్ ను విచారణకు స్వీకరించలేదు. కోర్టు తనంతట తాను సుమోటు తీసుకోలేదని మిశ్రా అన్నారు. రాజ్యాంగంలో దీనికి సంబంధించిన స్పష్టమైన నిబంధనలు లేవని ఆయన అన్నారు. 2024 లో సుప్రీంకోర్టు కోల్ కతలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ఒక వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యపై సుమోటోగా కేసును విచారించింది.
ఒక కేసు నేరానికి మించిన వ్యవస్థాగత సమస్యలను లేవనెత్తుతోందని అన్నారు. అయితే ఈ కేసులో సీజేఐ భిన్నంగా ఆలోచించి, చట్టపరంగా సరైన మార్గాన్ని అనుసరించమని మిశ్రాకు సూచించారు. ఇది సీజేఐ తొందరపాటు తనమే. చట్టపరంగా సరైన మార్గాన్ని అనుసరించాలన్న ఆయన సలహా సక్రమంగా దాఖలు చేసిన పిటిషన్ ను సకాలంలో విచారించడానికి ఒక అవకాశం కల్పిస్తుంది.
కోర్టు పాత రికార్డుల ప్రకారం.. ఈ వాదన తప్పు. 1980 నుంచి కోర్టు ఉత్తరాలు, టెలిగ్రామ్ చివరికి పోస్ట్ కార్డులు కూడా రిట్ పిటిషన్లు గానే పరిగణించింది. సరైన మార్గాన్ని పొందలేని వారి కోసమే.. ప్రత్యేకంగా ఆ లేఖల ఆధారిత న్యాయ పరిధిని సృష్టించింది.
అక్టోబర్ 2021 లో లఖింపూర్ ఖేరీ హత్యలపై కూడా ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఇద్దరు న్యాయవాదులు రాసిన లేఖ ఆధారంగా సుమోటోగా స్వీకరించి విచారణ చేసింది. అప్పటి ధర్మాసనంలో జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, హిమా కోహ్లీ ఉన్నారు. కోర్టు అప్పట్లో ఒక పద్దతి పాటించమని పట్టుబట్టలేదు. అందువల్ల బుధవారం దేశం విన్నది ప్రక్రియ కాదు. అది కేవలం ఒక ధోరణి.
స్పందించిన హైకోర్టు..
సుప్రీంకోర్టు తిరస్కరించినప్పటికీ ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ పై స్పందించింది. కానీ ఇవే అడ్డంకులు ఇక్కడ కూడా ఎదురయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. కానీ ఈ వ్యవహరంలో కోర్టును లాగవద్దని పేర్కొన్నారు.
కానీ బుధవారం హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎన్ హరిహరన్, గోపాల్ శంకర్ నారాయణన్, వికాస్ సింగ్ వాదించారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిందని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సమాధానం ఇవ్వాలని, రికార్డులను భద్రపరచాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు తనకు సమయం లేదని చెప్పినప్పటికీ హైకోర్టు మాత్రం వాటిని తీసుకుంది. రాళ్లదాడి జరిగిందని పోలీసులు చెప్పినప్పుడూ దానికి సంబంధించిన వీడియోను కూడా హైకోర్టు వీక్షించింది. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 11న ఉంటుంది.
సుప్రీంకోర్టు మార్గాన్ని నిర్దేశించినప్పుడూ..
ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉంది. వివాదాస్పద వాస్తవాల కోసం సుప్రీంకోర్టు వేదిక కాదు. 2019 లో డిసెంబర్ లో పోలీసులు జామియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం దాడి జరిగినప్పుడూ కోర్టు ఇదే వాదన చేసింది.
‘‘మేము విచారణ కోర్టులం కాదు’’ అని అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషనర్లను తిరిగి హైకోర్టులకు పంపింది. అయితే ఈ చర్యలు తీసుకునే ముందు కోర్టు రెండు రోజులు ఇందిరా జైసింగ్, కోలిన్ గోన్సాల్వెస్ లు చేసిన వాదన విన్నది.
ఈ ప్రక్రియలో దాదాపు మూడేళ్లు అయిన తరువాత కూడా కనీసం ఒక్క పోలీస్ పై కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని గోన్సాల్వెస్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసులో స్పష్టమైన సమయాన్ని నిర్దేశించడానికి నిరాకరిస్తూ త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది.
రామ్ లీలా మైదానంలో..
రామ్ లీలా మైదానంలో 2011 లో ఉద్యమం చేస్తున్న నిరసనకారులపై పోలీసులు దాడికి దిగినప్పుడూ సుప్రీంకోర్టు పిటిషన్ కోసం వేచిచూడలేదు. వార్తాల ఆధారంగా సమోటోగా తీసుకుంది. ఫిబ్రవరి 2012 నాటి తీర్పులో నిరసనకారుల తొలగింపు అన్యాయమైనదని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 144 ను తొందరపాటుతో ప్రయోగించారని పేర్కొంది. నిరసనకారులు నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంది.
ఒకే నియమం లేదు..
న్యాయవాదులను ఇప్పుడు ఈ వైఖరే కలవరపెడుతోంది. ఒకే ప్రమాణాలు లేనప్పుడూ సుమోటో స్వీకరణ ఒకే విధంగా ఉండవని చాలారోజులుగా న్యాయకోవిదులు గమనిస్తున్నారు. ఎలాంటి పిటిషన్ దాఖలు చేయకుండా కోర్టు విచారించిన వాటి వివరాలను న్యాయవాదులు ఇప్పుడు వాట్సాప్ లో చాట్ చేసుకుంటున్నారు. ఇవి నిజంగా అన్నింటిని నష్టపరుస్తున్నాయి.
కోర్టుకు చెందిన బార్ అసోసియేషన్ ఈ సంఘటన భిన్నంగా చూసింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అమాయక విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ ను ఖండించి స్వతంత్ర్య విచారణకు డిమాండ్ చేసింది. అయితే బార్ అసోసియేషన్ లోని కొంతమంది దీనితో ఏకీభవించలేదు.
సుప్రీంకోర్టు ఒక పక్షం వైపు..
జూలై 21న సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్రజ్ఞా పారిజత్ సింగ్ ప్రకారం.. అల్లరి మూకలను ప్రొత్సహిస్తున్న లేదా వారికి సాయం చేస్తున్న ప్రభుత్వ ప్యానెల్ న్యాయవాదులను గుర్తించి వారిని వెంటనే తొలగించాలని పోస్ట్ చేశారు. ఇంతకుముందు వాంగ్ చుక్ కేంద్రానికి లేఖ రాస్తూ.. నిరసనకారులపై ఎలాంటి చర్య తీసుకోవద్దని రాసుకొచ్చారు. అయితే వారిపై కేసులు మాత్రం నమోదయ్యాయి.
ఇక్కడ న్యాయస్థానం తరఫున గమనించాల్సిన విషయం ఒకటుంది. అది చూసే వీడియోలు అరుదుగా లభించేవి. ప్రదర్శన జరిగిన రోజు మధ్య ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో మొబైల్ ఇంటర్నెట్ నిలిసివేసి, సాయంత్రానికి పునరుద్దరణ చేశారు.
బుధవారం జంతర్ మంతర్ చుట్ట కొత్తగా బంద్ లు చేసినట్లు తెలిసింది. రామ్ లీలా మైదాన్ లో ప్రయోగించిన 144 సెక్షన్ కు కొనసాగింపుగా, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద కూడా ఉపయోగించారు.
అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2020) కేసులో ప్రతి సస్పెన్షన్ ఉత్తర్వును ప్రచురించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. టెలికమ్యూనికేషన్ చట్టం 2023 ప్రకారం ఇది కచ్చితంగా జరగాలి. కానీ ఇక్కడ ఉన్న నిబంధనలు పాటించకుండా నెట్ ను నిలిపివేశారు.
ఢిల్లీ హైకోర్టు ఏమంటుందో..
ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు ఈ పనిచేస్తుందని నమ్మకం ఉంది. నోటీస్, అఫిడవిట్లు, భద్రపరిచిన ఫుటేజ్, సెప్టెంబర్ లో విచారణ. వ్యవస్థ పని చేస్తున్న తీరు బాధ కలిగిస్తుంది. డిజిటల్ హక్కుల పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి నిరసన ప్రదేశం నుంచి ఒక వీడియోను ఒక శీర్షికతో పంచుకున్నారు.
‘‘ప్రజల సమస్యలను వినడానికి కోర్టులకు సమయం లేదు. ప్రజలే తమ సొంత కోర్టులను ప్రారంభిస్తున్నారు.’’ ఒకప్పుడు మైదానంలో నిద్రిస్తున్న పౌరుల కోసం నిలబడిన కోర్టు, పార్లమెంట్ బయట తమను కొట్టారని చెప్పేవారికి సమయం ఇవ్వలేదు. ఇప్పుడు వీటికి ఆసంస్థ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న.
Next Story

