
టీటీడీ కాలేజీల్లో సీటు కావాలా.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
ఆన్ లైన్ లో ఎలా దరఖాస్తుకు హెల్ప్ లైన్ సాయం...
టిటిడి తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026 - 27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ మూడో తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. https://admission.tirumala.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. టీటీడీ నిర్వహిస్తున్న జూనియర్ కాలేజీల్లో ఆన్ లైన్ దరఖాస్తు ఇంగ్లీషులో మాత్రమే ఉంది. విద్యార్థుల కోసం యూజర్ మాన్యువల్, ఆయా కాలేజీలో ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా ?
తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీపద్మావతీ జూనియర్ కాలేజీ, ఎస్వీ జూనియర్ కాలేజీలో అడ్మిషన్ల కోసం ఆన్ లైన్ లో ఎలా దరఖాస్తు చేయాలనేది తెలుసుకుందాం.
టీటీడీ వెబ్ సైట్ తెరవగానే ( https://admission.tirumala.org) " Student Manual in English" or "Student Manual in Telugu" రెండు బాక్స్ లు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు కావాల్సిన బాక్స్ లపైన క్లిక్ చేయాలి. అందులో దరఖాస్తు చేసే విధానాన్ని క్షుణ్ణంగా చదివాలి. అనంతరం ఇంటర్మీడియట్ కోర్సుకు Junior Collegeను ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఇంగ్లీషు లేదా తెలుగు అనే బాక్స్ లు కనిపిస్తాయి. వాటిలో తమకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేయగానే టిటిడి ఆధ్వర్యంలోని రెండు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఉన్న వివిధ గ్రూపుల్లోని సీట్లు, వాటిలో ప్రవేశానికి కావాలసిన అర్హతలు, సీట్ల భర్తీ విధానం, మార్గదర్శకాలు తదితర వివరాలు కనిపిస్తాయి.
ఎస్ఎంఎస్ సందేశం..
విద్యార్థులు నమోదు చేసిన వివరాల ప్రకారం గడువు ముగిశాక వారి ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాలలో సీటును తాత్కాలికంగా ఆన్ లైన్ లో కేటాయించి, విద్యార్థులకు ఎస్ఎమ్ఎస్ పంపుతారు. సీటుకు అర్హత ఉన్న విద్యార్థి ధృవీకరణ పత్రాలను సిస్టమ్ లోకి అప్ లోడ్ చేయాలి. విద్యార్థి ధృవీకరణ పత్రాలలోని వివరాలు సరిగా లేకున్నా, ఆన్ లైన్ లో సరిపోల్చకున్నా సీటు రద్దు కావడం తోపాటు సిస్టమ్ నుంచి ఆటోమేటిక్ గా ఆ దరఖాస్తు రద్దు అవుతుంది. విద్యార్థులు గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. గడువు ముగిశాక సవరణలకు అవకాశం ఉండదు. అందువల్ల విద్యార్థులు స్టూడెంట్ యూజర్ మాన్యువల్‌ను, కళాశాల ప్రాస్పెక్టస్‌ను పూర్తిగా చదివి, పక్కన ఉంచుకుని ఆన్ లైన్ లో చాలా జాగ్రత్తగా దరఖాస్తు చేయాలని టిటిడి సూచించింది.
హెల్ప్ లైన్...
టీటీడీ నిర్వహిస్తున్న జూనియర్ కాలేజీల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు హెల్ప్ లైన్ కూడా అందుబాటులో ఉంచారు. విద్యార్థులు దరఖాస్తు నింపే సమయంలో సాంకేతికంగా ఎదరయ్య సందేహాలు తీర్చుకోవచ్చు. కోర్సుల్లోని వివిధ గ్రూప్ లు, వసతి గృహాలు, నిబంధనలు తదితర సందేహాలను హెల్ఫ్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చని టీటీడీ అధికారులు సూచించారు. admission.tirumala.org వెబ్ సైట్ ను ఓపెన్ చేయగానే స్క్రీన్ పై హెల్ఫ్ లైన్ నంబర్లు అనే బాక్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే సంబంధిత అధ్యాపకుల ఫోన్ నంబర్లు ఉంటాయి. వీటి ద్వారా ఆయా అంశాలలోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Next Story

