
భారతీయ సింగిల్ మాల్ట్ విస్కీకి మరో గొప్ప విజయం
అమృత్ ఎక్స్‌పెడిషన్ ప్రపంచంలో మూడో స్థానం దక్కించుకుంది. ఈ స్థానం ఎలా దక్కింది?
కర్నాటకకు చెందిన అమృత్ డిస్టిలరీస్ నిర్మించిన ‘‘అమృత్ ఎక్స్‌పెడిషన్’’ ‘15 ఇయర్ ఓల్డ్ సింగిల్ మాల్ట్ విస్కీ’. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జిమ్ ముర్రే ‘విస్కీ బైబిల్ 2025-26’ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం సాధించింది. ఇది భారతదేశంలోని అత్యంత ఖరీదైన, అరుదైన విస్కీలలో ఒకటిగా నిలిచింది. ధర దాదాపు రూ.10 లక్షలు (సుమారు $12,500), ప్రపంచవ్యాప్తంగా కేవలం 75 బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉన్న ఈ లిమిటెడ్ ఎడిషన్ భారతీయ విస్కీ పరిశ్రమకు కొత్త అధ్యాయం రాసింది.
జిమ్ ముర్రే ర్యాంకింగ్స్ ప్రాముఖ్యత
జిమ్ ముర్రే అనేది ప్రపంచవ్యాప్త విస్కీ నిపుణుడు. ఆయన ఏటా విడుదల చేసే ‘విస్కీ బైబిల్’ లో 4,000కి పైగా విస్కీలను టేస్ట్ చేసి స్కోర్లు, ర్యాంకింగ్స్ ఇస్తారు. ఈ ర్యాంకింగ్స్ విస్కీ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైనవిగా పరిగణిస్తారు. ఇందులో అమృత్ ఎక్స్‌పెడిషన్ మూడో స్థానంలో నిలవడం భారతీయ సింగిల్ మాల్ట్లకు మరో మైలురాయి. (ఇది 2010లో అమృత్ ఫ్యూజన్ సాధించిన మూడో స్థానం తర్వాత రెండోసారి భారతీయ విస్కీ ఈ ఎలైట్ లెవల్‌కు చేరుకోవడం.)
దీని గొప్పతనం ఏమిటి?
భారతదేశంలో విస్కీ ఏజింగ్ సవాలుగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతలు, తేమ వల్ల బారెల్ నుంచి ఆల్కహాల్ ఎక్కువగా ఆవిరైపోతుంది (ఇంగ్లాండ్‌లో 2 శాతం, ఇక్కడ 8-10 శాతం వరకు). అయినప్పటికీ 15 సంవత్సరాల పాటు మెచ్యూర్ చేసి ఇంత డెప్త్, కాంప్లెక్సిటీ సాధించడం అమృత్ “Expedition” ఎంతో పెద్ద గొప్పతనం. ఇది భారతీయ వాతావరణంలోనూ ప్రపంచ స్థాయి విస్కీలను తయారు చేయవచ్చని నిరూపించింది.
ఎందుకు ఈ ర్యాంకు సాధించింది?
జిమ్ ముర్రే దీనిని ‘‘defiant’’ (సవాలును ఎదుర్కొన్నది) అని వర్ణించారు. ఇది ఇండియన్ క్లైమేట్లో ఇంత డెప్త్, కాంప్లెక్సిటీ సాధించడం అద్భుతం. టేస్టింగ్ నోట్స్‌లో షెర్రీ ట్రఫుల్, కేన్ మోలాసెస్, వానిల్లా పాడ్, సాండల్‌వుడ్, ఛాక్లెట్-కోటెడ్ షెర్రీ, డ్రైడ్ ఫ్రూట్స్, బిట్టర్ కోకో, ఫ్రూట్ మార్మలేడ్ వంటి లేయర్డ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. నోస్‌లో క్రీమీ వానిల్లా, రోస్టెడ్ కాఫీ, డార్క్ ఛాక్లెట్, ఆర్చర్డ్ ఫ్రూట్స్, పాలేట్లో వెల్వెటీ రిచ్‌నెస్, సాఫ్ట్ ఓక్ టోన్స్. ఇవన్నీ కలిసి అసాధారణ బ్యాలెన్స్, లాంగ్ ఫినిష్ ఇస్తాయి.
ఈ విజయం భారతీయ విస్కీ పరిశ్రమకు కొత్త ఆత్మవిశ్వాసం ఇచ్చింది. అమృత్ డిస్టిలరీస్ ఇప్పటికే గ్లోబల్ మ్యాప్‌లో భారత్‌ను గుర్తించించింది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో భారతీయ సింగిల్ మాల్ట్‌లు ప్రపంచ స్థాయిలో విజయాలు సాధిస్తాయని ఆశిద్దాం.

