x
పుంగనూరులో ధ్వంసమైన వాహనాలు

అన్నమయ్య జిల్లా: చెలరేగిన 'స్థానిక హింస'.. గాలిలోకి పోలీసుల కాల్పులు

పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డికి గాయాలు. రాయచోటిలో వాహనాలకు నిప్పు.


Click the Play button to hear this message in audio format

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అలర్లతో ప్రారంభమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా (అన్నమయ్య జిల్లా)లో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య శుక్రవారం ఉదయం పరస్పర దాడులు జరిగాయి. రాయచోటి పట్టణ ఎన్ఎస్. కాలనీలో వాహనాలకు నిప్పంటించారు. పుంగనూరులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, గన్ మన్, టీడీపీ నేతలు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఘర్షణలకు తెరలేసింది. పుంగనూరులో రాళ్లదాడికి పాల్పడడం వల్ల పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు పార్టీల మద్దతుదారుల దాడుల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఆయన అంగరక్షకుడు గాయపడ్డారు. టీడీపీ నేత మధుతో పాటు ఇంకొందరు కార్యకర్తలు కూడా గాయపడ్డారు. అనేక వాహనాలు ధ్వంస అయ్యాయి. గాయపడిన ఎంపీ మిథన్ రెడ్డిని అధికారులు ఓ గదిలో గంటపాటు ఉంచి, రక్షించారు.

గాయపడిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి

పుంగనూరు మున్సిపల్ స్థానం నుంచి చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించడానికి కాన్వాయ్ తో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి బయలుదేరారు. అదే సమయంలో టీడీపీ శ్రేణులు కూడా మున్సిపల్ కార్యాలయం, పట్టణంలో భారీగా చేరుకున్నట్లు సమాచారం.

పుంగనూరు నియోజకవర్గం నుంచి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కొడుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీ అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించేందుకు తిరుపతి నుంచి పుంగనూరుకు బయలుదేరి వెళ్లారు. పట్టణంలోని నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకోగానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లక్ష్యంగా దాడులకు దిగారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై రాళ్లదాడికి పాల్పడ్డారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి.

"తనను అంతమొందించడానికి ఈ దాడులకు పాల్పడ్డారు" అని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. రాళ్ల దాడిలో ఎంపీ మిథున్ తోపాటు ఆయన గన్ మన్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేత మధు కూడా గాయపడిన సంఘటనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకునే వచ్చే ప్రయత్నం చేశారు.

"ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి" అని ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితులను ఊహించే వైసీపీ అభ్యర్థులకు రక్షణ కోసం ఆన్ లైన్ లో నామినేషన్లు స్వీకరించే విధానం అమలు చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు.
Read More
Next Story