అనంతపురం: అరటి రైతులను దెబ్బతీసిన ప్రకృతి వైపరీత్యం
x

అనంతపురం: అరటి రైతులను దెబ్బతీసిన ప్రకృతి వైపరీత్యం

గాలీవానకు కూలన అరటిచెట్లు. పరిహారం కోసం బాధితుల వేడుకోలు


సూపర్ ఎల్ నినో ప్రభావంతో పంటలు కాపాడుకోవడం రైతులకు తీవ్ర కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షం, రాత్రి వీచిన గాలుల వల్ల అరటి తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు.

అనంతపురం జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సనప గ్రామంలో సాగు చేసిన అరటి తోటలు గాలుల ధాటికి నేలకొరిగాయి. పంట చేతికందే సమయంలో ప్రకృతి వైపరీత్యం సంభవించడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 70 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయని సమాచారం.
"ఎకరా అరటి తోట సాకుకు లక్ష ఖర్చు చేశాం. గాలుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించండి" బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఆత్మకూరు మండలం సనప గ్రామంలో రైతులు సాగు చేస్తున్న అరటి తోటలు గాలుల ధాటికి నేల కొరిగాయి. పంట చేతికందే సమయంలో ప్రకృతి వైపరీత్యం సంభవించడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న అరటి తోటలను రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.


ఆశలు గాలికి కొట్టుకుపోయాయి...

అందుబాటులో ఉన్న నీటి వసతితో అరటి తోటలు సాగుచేశారు. పంట కోత దశకు వచ్చే సరికి గాలులు తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ హఠాత్ పరిణామం మమ్మిలిని నష్టాలకు గురి చేశాయని రైతులు ఆదేవన వ్యక్తం చేశారు.
గ్రామంలో రైతులు భాస్కరరెడ్డి, ఉమ్మడి నాగిరెడ్డి కొండారెడ్డి ఉమ్మడి చంద్రారెడ్డి సాగు చేసిన ఒక్కొక్కరి పొలంలో ఐదెకరాలు పంట నష్టం జరిగింది. మల్లారెడ్డి నాలుగు ఎకరాలు, ఉమ్మడి రాజారెడ్డి నాలుగు ఎకరాలు, ఉమ్మడి ఆదినారాయణ రెడ్డి ఐదెకరాలు, సూర్యనారాయణ రెడ్డి పది ఎకనరాలు, శంకర్ రెడ్డి మరో పదెకరాలు, కురుమా రామాంజనేయులు ఐదు ఎకరాల్లో అరటి పంట సాగు చేశామని చెప్పారు.

"ఎకరా విస్తీర్ణంలో అరటి తోటలు సాగు చేయడానికి సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు" నష్టం పోయామని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.

వడగాలుల ధాటికి నేలమట్టం

తీవ్రంగా వీచిన గాలులకు అరటి చెట్లు ఒక్కసారిగా నేలకొరిగాయి. దీంతో తోటల్లో పంట మొత్తం దెబ్బతింది. ఇప్పటికే సాగు కోసం చేసిన పెట్టుబడులకు తోడు ఇప్పుడు దెబ్బతిన్న తోటలను తొలగించడం, మళ్లీ సాగు చేపట్టడం రైతులకు అదనపు భారంగా మారనుంది. పంట నష్టంతో అప్పులు ఎలా తీర్చాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.


Read More
Next Story