‘‘ఇంటర్నెట్ పొందడం పిల్లల ప్రాథమిక హక్కు’’
x

‘‘ఇంటర్నెట్ పొందడం పిల్లల ప్రాథమిక హక్కు’’

ఆంక్షలతో వాటిని అడ్డుకోలేరన్న సుప్రీంకోర్టు


పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఇంటర్నెట్ పొందడం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా పిల్లల హక్కును నిరాకరించరాదని అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 19(1)(ఏ) అందరికి సమానంగా వర్తిస్తుందని పేర్కొంది.

బెంచ్ ఏమని చెప్పిందంటే...

వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలకు ఒకే రకమైన రాజ్యాంగ రక్షణలు పొందే హక్కు ఉందని జస్టిస్ జేబీ పార్దీవాల, జస్టిస్ కే. వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 21 ప్రకారం.. ఇంటర్నెట్ ను పొందే హక్కు ప్రతి వ్యక్తి ప్రాథమిక హక్కు అని చెప్పడానికి మాకు ఎలాంటి సంకోచం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. నిర్దిష్ట వయస్సు కంటే తక్కువ ఉందని వారి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రాన్ని పొందే హక్కు లేదని చెప్పడం అన్యాయం, మన పిల్లలకు ఈ హక్కు ఉందని వారు పేర్కొన్నారు.

పూర్తి స్థాయి ఆంక్షలు చెల్లవు..

ఆన్ లైన్ హానీ నుంచి పిల్లలను రక్షించడానికి వారిని ఇంటర్నెట్, సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలా, వద్దా అని ధర్మాసనం పరిశీలించింది. సమాచారం, ఆలోచనలను స్వీకరించే, పంచుకునే హక్కు కూడా వాక్ స్వాతంత్య్ర హక్కులో భాగమే అని పేర్కొంది.
న్యాయస్థానం ఇంటర్నెట్ ను ఆలోచనలు, సృజనాత్మక వ్యక్తీకరణ, సమాచారానికి ఒక మార్కెట్ గా అభివర్ణించింది. కొంతమంది పిల్లలకు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని వారికి ఇది అభ్యాసానికి, సమాచారానికి ఏకైక మూలం.
‘‘చాలామంది పిల్లలకు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఇది తరుచుగా అభ్యాసానికి, సమాచారానికి ఏకైక మూలం’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు తమలాంటి పరిస్థితి ఉన్నవారితో స్నేహం చేయడానికి ఇంటర్నెట్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతుంది.
హానికరమైన కంటెంట్ ను తొలగించడంలో ప్లాట్ ఫారమ్ లు విఫలమయ్యాయనే కారణంతో పిల్లలను ఆఫ్ లైన్ లో ఉంచడం, బాధితుడినే సమస్యగా పోరపాటుగా భావించడమే అవుతుందని కోర్టు పేర్కొంది.

సమగ్ర ఆంక్షలు కుదరవు...

‘‘పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై విధించే ఎలాంటి పూర్తి స్థాయి ఆంక్షలైనా అవి కచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయని ఎవరూ చెప్పలేరు’’ అని కోర్టు అభిప్రాయపడింది.
తల్లిదండ్రుల సమ్మతి, పర్యవేక్షణ, పిల్లలకు ప్రయివేట్ ఖాతాల నుంచి వచ్చే వాటిపై కఠినమైన నియంత్రణ విధించాలని ధర్మాసనం సూచించింది. దీనిపై పూర్తి నియంత్రణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి వదిలేసింది.
పెద్దల కంటెంట్ ఉన్న వెబ్ సైట్ లతో సహ స్వభావరీత్యా హానికరమైన సేవలను పిల్లలు పొందకుండా ప్రభుత్వం ఇప్పటికీ నియంత్రించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఆన్ లైన్ ప్లాట్ ఫాంలో ప్రమాదకర వాటిని గుర్తించి తొలగించడంలో సహాయపడటానికి ఒక జాతీయ డేటా బేస్ ను ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Read More
Next Story