
నల్లకోటు మాటున 'రాక్షసుడైన' లాయర్ అరెస్ట్!
ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బుతో పాటు లైంగిక దోపిడికి పాల్పడి, ఆ తర్వాత ఆమెను హత్య చేసిన లాయర్ ను పోలీసులు పట్టుకున్నారు..
పాత గుంటూరు యాదవ బజారుకు చెందిన ఓ మహిళ అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. కనిపించకుండా పోయిందనుకున్న ఆమె.. కాలువలో శవమై తేలింది. ఈ దారుణ హత్య వెనుక ఓ న్యాయవాది హస్తం ఉండటం, అది కూడా డబ్బులు, వివాహేతర సంబంధం నేపథ్యంలో జరగడం గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Guntur SP Vakul Zindal
అదృశ్యం నుంచి శవం దొరికే వరకు..
కొన్ని రోజుల క్రితం పాత గుంటూరుకు చెందిన ఒక మహిళ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో, స్థానిక కాలువలో ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు లోతుగా విచారించగా, అది అదృశ్యమైన మహిళదేనని తేలింది. శాస్త్రీయ ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణతో నిందితుడిని గుర్తించారు.
హత్యకు దారితీసిన కారణాలు..
నిందితుడు ఎనముల సురేశ్ గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. పోలీసుల విచారణలో వెల్లడైన పక్కా ఆధారాల ప్రకారం.. సురేశ్‌కు ఆ మహిళతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన సురేశ్, ఆమె నుంచి రూ. 25 లక్షలు వసూలు చేశాడు. కాలక్రమేణా ఉద్యోగం రాకపోవడం, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని ఆమె ఒత్తిడి చేయడంతో సురేశ్ ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారం ఘాతుకం..
హత్య కోసం సురేశ్ తన స్నేహితుడు శేఖర్‌తో కలిసి ప్లాన్ వేశాడు. శ్రీశైలం వెళ్దామని నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో నిర్మానుష్య ప్రదేశంలో కర్రలతో తలపై బలంగా కొట్టి ఆమెను హతమార్చారు. ఆమె మరణించిందని నిర్ధారించుకున్నాక, మృతదేహాన్ని సంగంజాగర్లమూడి కాలువలో పడేసి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయారు.
A.I. Creative Image
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని తెలిపారు. సురేశ్‌తో పాటు అతడికి సహకరించిన శేఖర్‌ను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
Next Story

