స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు కీలమైన రోజు
x

స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు కీలమైన రోజు

అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.


ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ‘స్వర్ణ ఆంధ్ర’ లక్ష్య సాధనకు ఈ రోజు చాలా కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఈ పవిత్ర నెలలో ఉత్తరాంధ్ర పవిత్ర భూమికి రావడం నాకు గౌరవం’’ అని పేర్కొన్న ఆయన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పాదాలకు నమస్కరించి ప్రసంగం ప్రారంభించారు. ముందుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించారు.

కొత్తగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీని బలోపేతం చేసి రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తుందని ప్రధాని అన్నారు. ఆధునిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధస్సు (ఏఐ), బయోమెట్రిక్ ప్రాసెసింగ్ వ్యవస్థలు, సస్టైనబుల్ ఫీచర్లతో కూడిన ఈ విమానాశ్రయం పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కొత్త ఊపు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. టెర్మినల్ భవనం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తుందని, అల్లూరి సీతారామరాజు పేరుతో ఉన్న ఈ విమానాశ్రయం మన వారసత్వం పట్ల గర్వాన్ని, భవిష్యత్తు పట్ల ఆశావాదాన్ని సూచిస్తుందని ప్రధాని అన్నారు.

ఈ సందర్భంగా రూ.17,900 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించి, జాతికి అంకితం చేశామని ఆయన తెలిపారు. ఏవియేషన్, క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, రోడ్ కనెక్టివిటీ రంగాల్లోని ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి గణనీయంగా దోహదపడతాయని ప్రధాని పేర్కొన్నారు.

దేశం బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తోందని, మొత్తం తీర ప్రాంతాన్ని కోస్టల్ ఎకనామిక్ కారిడార్‌గా అభివృద్ధి చేసే దృష్టి ఉందని ఆయన చెప్పారు. విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న ఉన్న పోర్టులను ఆధునీకరిస్తున్నామని, మూలపేట, రామయపట్నంలో కొత్త పోర్టులు అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదుగుతోందని, ఫార్మా రంగంలోనూ హబ్‌గా మారే సామర్థ్యం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

Read More
Next Story