టోకెన్లు ఉంటే 24 గంటల నిరీక్షణ... లేకుంటే అదే రోజు శ్రీవారి దర్శనం
వినడానికి వింతే..! టీటీడీ ప్రకటనే దీనికి నిదర్శనం. వీడియో స్టోరీ..
తిరుమల శ్రీవారి దర్శనానికి యాత్రికులు పోటెత్తుతున్నారు. గతానికి భిన్నంగా వారాంతంలోనే కాదు సాధరణ రోజుల్లో కూడా యాత్రికుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో టీటీడీ యాత్రికులకు నిరీక్షణ అవసరం లేకుండా టైం స్లాట్ టోకన్లు (ఎస్ డీఎస్ ) జారీచేస్తోంది.
శ్రీవారి దర్శనానికి టోకెన్లు దక్కని యాత్రికులు నిరీక్షించవద్దని టిటిడి సూచన చేసింది. సొంత వాహనాల్లో ఉన్నవారు కాలిబాటలో యాత్రికులు నేరుగా తిరుమలకు చేరుకోవాలని, వైకుంఠం టూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ షెడ్డులోకి ప్రవేశించవచ్చని సూచిస్తున్నారు.
"టోకెన్లు లేని యాత్రికులకు ఏ రోజుకు ఆ రోజే దర్శనం అవుతుంది. ఎస్ డీ ఎస్ టోకెన్లు ఉన్నవారు 48 గంటలు వేచి ఉండక తప్పదు " అనే మాటను చెప్పకనే చెబుతున్నారు. టీటీడీ బ్రాడ్ కాస్టింగ్ విభాగం చేస్తున్న ప్రసాదం అలా ఉంది.
టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే..
తిరుపతిలోని అలిపిరికి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ కు సమీపంలోని విష్ణు నివాసం, ఆర్టీసీ బస్సు స్టాండ్ సమీపంలోని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం వద్ద శ్రీవారి దర్శనానికి అనుమతించేందుకు రోజు ఉదయం టైం స్లాటేడ్ ఎస్ డి ఎస్ టోకెన్లు జారీ చేస్తారు.
యాత్రికుల ఆత్రుత ఎక్కువ కావడం వల్ల రాత్రి 11 గంటలకు నుంచి ఈ మూడు కేంద్రాల్లో షెడ్లల్లోకి ప్రవేశిస్తున్నారు. దీనివల్ల రాత్రంతా జాగారం చేయక తప్పడం లేదు.
"ఉదయం టికెట్ తీసుకున్నా ఆ రోజే వారికి దర్శనం అయ్యే పరిస్థితి లేదు" అని టీటీడీ బ్రాడ్ కాస్టింగ్ విభాగం (TTD Broadcasting Department ) నిరంతరాయంగా యాత్రికుల సదుపాయం కోసం ప్రసారం చేస్తోంది. ఉదాహరణకి
"సోమవారం ఉదయం టికెట్ తీసుకున్న యాత్రికులకు మంగళవారం సాయంత్రం లేదా ఆ రాత్రికి మాత్రమే దర్శనం అవుతుంది" అని టిటిడి యంత్రాంగం స్పష్టం చేస్తోంది. అంటే టికెట్లు కోసం నిరీక్షించే సమయం వృధా చేసుకోకుండా, టోకెన్లు దక్కని యాత్రికు నిరాశ పడకుండా తిరుమలకు చేరుకోవాలి. శ్రీవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న వైకుంఠం టూ కాంప్లెక్స్ ద్వారా సాధారణ యాత్రికుల ప్రవేశద్వారంలోకి వెళ్లాలి. అక్కడి నుంచి ఆలయ షెడ్లల్లోకి ప్రవేశించవచ్చు అనేది టీటీడీ అధికారుల సూచన.
దర్శనం అంత సులభమా..
తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న యాత్రికుల సంఖ్య భారీగా ఉండడంతో 48 గంటలు పడుతోంది. అంటే వైకుంఠం-2 కాంప్లెక్స్ లోకి ప్రవేశించాలంటే దాదాపు ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు విస్తరించి ఉన్న శిలాతోరణం మీదుగా అక్టోపస్ భవనం వద్ద ప్రారంభమయ్యే క్యూలోకి ప్రవేశిస్తే వైకుంఠం టూ కాంప్లెక్స్ లోకి చేరడానికి సుమారు 10 నుంచి 12 గంటల పైనే పట్టే అవకాశం ఉంటుంది.
రికార్డు స్థాయి దర్శనాలు ఏమయ్యాయి?
తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నియంత్రించడంతోపాటు శ్రీవారి దర్శనానికి కూడా ప్రత్యేక ఏర్పాటు చేశామని కూడా టిటిడి అధికారులు గతంలో ప్రకటించారు. ఇది వాస్తవం కూడా. అయితే, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన యాత్రికుల సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే
ఈనెల 30వ తేదీ (ఆదివారం) 81,637 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకున్నారు.
29వ తేదీ 71 803 మంది, 27వ తేదీ 66,437, 26వ తేదీ 77568 , 25వ తేదీ 73285 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకున్నట్టు టీటీడీ అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. వారాంతపు సెలవుల్లో కూడా 90 వేలకు మందిగా పైగానే శ్రీవారి దర్శనం చేయించి రికార్డు సృష్టించామని అనేకసార్లు టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు ప్రకటించారు.
" ప్రస్తుతం సగటున చూసుకుంటే రోజుకు 70 వేల మంది కూడా యాత్రికులను దర్శనం చేయించలేని పరిస్థితిలో 48 గంటల సమయం ఎందుకు పడుతోంది?" అనే చర్చకు ఆస్కారం కల్పించింది. దర్శనాల సంఖ్య తక్కువగా ఉంటే రద్దీ ఎక్కువగా ఉందనే కారణంతో ఎందుకు గంటల తరబడి యాత్రికులను నిరీక్షింప చేస్తున్నారని కూడా ఓ ప్రధాన ప్రశ్న.
Next Story

