
5 అసెంబ్లీల ఎన్నికలు ఫలితాలు, ఏ పార్టీకి ఏ రాష్ట్రమంటే..
అస్సాం, కేరళ, పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తి.. మిగతా 2 రాష్ట్రాలలో ముగింపు దశలో
దేశ మినీ సార్వత్రిక ఎన్నికల సంరంభం ముగిసింది. నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4 సోమవారం ఉదయం ప్రారంభమైంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాయంత్రం నాటికి దాదాపు ముగిసింది. మొత్తం 824 సీట్లలో ఫలితాలు స్పష్టమవుతున్నాయి. రాజకీయంగా ఇవి చాలా ప్రాధాన్యత కలిగిన ఎన్నికలనే చెప్పాలి. ఈశాన్య భారతం మొదలు దక్షిణం, తూర్పు భారత రాజకీయ ధోరణులను ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి.
ఫలితాలు ఇలా..
అస్సాం (మొత్తం సీట్లు 126)
.............
విజేత: NDA (BJP నేతృత్వంలో)
బీజేపీ కూటమి- 102
కాంగ్రెస్ కూటమి-21
ఏఐయూడీఎఫ్-2
ఇతరులు-1
హిమంత బిశ్వా సర్మా నేతృత్వంలో బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి రానుంది.
భారీ మెజారిటీతో NDA హ్యాట్రిక్ సాధించింది. జాతీయ భద్రత, అభివృద్ధి, CAA వంటి అంశాలు పని చేశాయి.
.......
కేరళ ( మొత్తం సీట్లు 140)
విజేత: కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్
యూడీఎఫ్-102
వామపక్ష ప్రజాతంత్ర కూటమి- 35
బీజేపీ- 3
కాంగ్రెస్ పార్టీ సుమారు 85 సీట్లు గెలుచుకుని మెజారిటీ మార్క్ దాటింది. CPM నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి 35 సీట్లకు పడిపోయింది. కేరళలో బీజేపీ 3 సీట్లు గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతోంది. బీజేపీ ఏర్పాటైన తర్వాత కేరళలో గెలవడం ఇదే మొదటి సారి.
.....
తమిళనాడు (మొత్తం సీట్లు 234)
విజేత: సినీనటుడు విజయ్ పార్టీ -TVK- (తమిళగ వెట్రి కజగం)
టీవీకే-107
డీఎంకే, దాని మిత్రపక్షాలు-75
అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలు-55
TVK అతి పెద్ద పార్టీగా అవతరించింది. DMK రెండవ స్థానంలో, AIADMK+NDA మూడవ స్థానంలో నిలిచాయి. విజయ్ తాను పోటీ చేసిన 2 స్థానాలలోనూ గెలిచారు. ఇంతటి ప్రభావం చూపుతుందని ఏ సర్వే కూడా చెప్పలేకపోయింది.
ఇది ద్రవిడియన్ రాజకీయాల్లో కొత్త శకం అని చెప్పవచ్చు.
ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఓడిపోయారు. ఆయనపై విజయ్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు.
......
పశ్చిమ బెంగాల్ (మొత్తం సీట్లు 294)
....
విజేత: బీజేపీ
BJP 200కి పైగా సీట్లు గెలవనుంది.
తృణమూల్ కాంగ్రెస్- 79
కాంగ్రెస్- 1
సీపీఎం-2
ఇతరులు-2
బీజేపీ మెజారిటీ సాధించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని TMCని ఓడించింది.
TMC 79 సీట్లకు పరిమితం అయింది. ఇది పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెద్ద మలుపు.
..........
పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం, మొత్తం సీట్లు30 సీట్లు)
.........
విజేత: NDA (AINRC + BJP)
ఆలిండియా ఎన్.రంగస్వామి కాంగ్రెస్ (AINRC, BJP)-18
కాంగ్రెస్-6
టీవీకే (విజయ్ పార్టీ)-3
ఇతరులు-3
ఇది దేశవ్యాప్తంగా బీజేపీ బలం కొనసాగుతున్నట్లు, అదే సమయంలో రాష్ట్రాల్లో స్థానిక ఫ్యాక్టర్లు, యాంటీ-ఇన్‌కంబెన్సీ, కొత్త నాయకులు ఎంత ప్రభావం చూపుతున్నారో చూపించింది.
ఈ ఫలితాలు 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందస్తు సూచనగా పరిగణించవచ్చు. లెక్కింపు పూర్తి కాగానే అధికారిక ఫలితాలు వెలువడతాయి.
Next Story

