అంతరిక్షంలో ఇస్రో మేజిక్:ఈఓఎస్-05 సూపర్ హిట్
సరిహద్దుల్లో కన్ను వేస్తే కట్.. నింగిలోకి భారత్ 'సూపర్ స్పై' శాటిలైట్ వీడియో కథనం
నింగి నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్ 17, ఈఓఎస్-05 (జీ శాట్-1ఏ శాటిలైట్ క్షేమంగా కక్ష్యలోకి చేరింది. దీని ఆయుష్షు కూడా పెరిగింది. నాలుగు రోజుల తరువాత గమ్యస్థానం చేరిన తరువాత శాటిలైట్ లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ ప్రకటించారు. దీంతో అంతరిక్షం నుంచి భారతదేశాన్ని నిరంతరం పర్యవేక్షించే మూడో కన్ను తెరుచుకుంది.
శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ నెల నాల్గవ తేదీ ( శుక్రవారం) వేకువజామున 2.55 నిమిషాలకు భారతదేశాన్ని రక్షించడానికి అవసరమైన శక్తివంతమైన GSLV-F17 / EOS-05 రాకెట్ నింగిలోకి పంపిచారు. ఇందులో అమర్చిన జీశాట్1 ఉపగ్రహం నిర్ణత కక్ష్యలోకి సోమవారం రాత్రి 8.57 గంటలకు చేరింది. ఇస్రో కేంద్రం నుంచి ఆ శాటిలైట్ ఎత్తును పెంచారు. నింగిలోని కక్ష్యలో భూమికి అత్యంత సమీపంగా ఉండే బిందువు పెరిజీ కి సుమారు 20 వేల కిలోమీటర్ల నుంచి 34, 603 కిలోమీటర్లకు పెరిగినట్లు ఇస్రో ప్రకటించింది.
"ఈ శాటిలైట్ లో అన్ని వ్యవస్థలు ఆశించిన స్థాయిలో మెరుగ్గా పని చేస్తున్నాయి" అని ఇస్రో వెల్లడించింది.
పెరిగిన ఆయుష్షు
ఈఓఎస్-05 శాటిలైట్ ఆయుష్షు కూడా పెరిగినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఏడు సంవత్సరాలు నింగిలో విహరించే విధంగా రూపకల్పన చేశారు. అయితే, ఇంధన వినియోగంతో పాటు కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విధానంలో సానుకూల అంశాలు కలిసి వచ్చాయని, దీంతో ఈ నిఘా శాటిలైట్ పదేళ్లపాటు సేవలు అందించే శక్తి సాధించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
1.భారత ఉపఖండంతో పాటు పరిసర ప్రాంతాల దృశ్యాలను కూడా ఏకధాటిగా చిత్రీకరిస్తుంది
2. తుఫాన్లు, వరదలు, భూపాతాలను ఎప్పటికప్పుడు Near Real-time లో గుర్తించి అప్రమత్తం చేస్తుంది.
3. మేఘాల కదలికలు, పంటల స్థితిగతులు, అటవీ విస్తీర్ణం మరియు భూగర్భ జలాల మార్పులను సేకరిస్తుంది.
రక్షణ: సరిహద్దుల్లో వేగంగా జరిగే మార్పులను క్షుణ్ణంగా పరిశీలించడంలో తోడ్పడుతుంది.
మేఘాలు వాతావరణ విశేషాలతోపాటు అంతరిక్షం నుంచి నిఘా ఉంచి వ్యవసాయం భూమి నీటి మార్పుల వంటి అంశాల పైన సునిష్టంగా పరిశీలించడం ఈ శాటిలైట్ ప్రత్యేకత. ఈ శాటిలైట్ తీసే చిత్రాలు అత్యంత వేగంగా ట్రాన్స్మిట్ చేయడానికి వీలైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో అమర్చారు
సుమారు 30 నిమిషాల రియల్ టైం లో చిత్రాలను అందించే సామర్థ్యం ఈ సాటిలైట్ సొంతం. మరీ ప్రాధాన్యం అత్యవసరం అనుకుంటే ప్రాధాన్యత గా గుర్తించే ప్రాంతాలకు సంబంధించి ఐదు నిమిషాల్లో రీ విజిట్ చేసి మళ్లీ చిత్రాలు పంపించే సామర్థ్యం ఈ శాటిలైట్ కు ఉంది.
Next Story

