కొత్త దర్శకుడిని పిలిచి ఛాన్స్ ఇస్తున్న జాతి రత్నం..!
x

కొత్త దర్శకుడిని పిలిచి ఛాన్స్ ఇస్తున్న జాతి రత్నం..!

నవీన్ పోలిశెట్టి సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. అయితే అతను ఓ పట్టాన ఏ కొత్త కథా ఒప్పుకోడు. ఒప్పుకున్నా ఆ స్క్రిప్టుని తన పర్యవేక్షణలో చెక్కాలనుకుంటాడు.

నవీన్ పోలిశెట్టి సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. అయితే అతను ఓ పట్టాన ఏ కొత్త కథా ఒప్పుకోడు. ఒప్పుకున్నా ఆ స్క్రిప్టుని తన పర్యవేక్షణలో చెక్కాలనుకుంటాడు. తన ఇన్ ఫుట్స్‌ను షూటింగ్‌కు ముందే డైరక్టర్‌కు ఇచ్చేస్తాడు. అలా చేయటం చాలా మంది డైరక్టర్స్‌కు నచ్చదు. అలాగే అతనికి పెద్ద డైరక్టర్స్‌తో చేయాలని అనిపించదు. అది నవీన్ పోలిశెట్టి సినిమాగానే ఉండాలి. ఇలా ఇన్ని కండీషన్స్‌తో నవీన్ పోలిశెట్టి సినిమాలు లేటు అవుతున్నాయి. అదే ఈ స్థాయి సక్సెస్ ఉన్న మరో హీరో అయితే ఏడాదికి మినిమం మూడు సినిమాలు అయినా లాగి ప్రక్కన పడేద్దుడు. కానీ నవీన్ స్కూలే వేరు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి హీరోగా నిలదొక్కుకోవడానికి మధ్య చాలా కథ జరిగింది. మొదట్లో నవీన్ బాంబేలో సినిమా అవకాశాల కోసం తిరిగేవాడు. కొన్ని ఆడిషన్స్‌ ఇచ్చారు కూడా. నటన బాగుంది అన్నారే కానీ ఎవరూ అవకాశం ఇవ్వలేదు. ఫ్రెండ్స్‌ సలహా మేరకు స్టాండప్‌ కామెడీ ఆడిషన్స్‌లో పాల్గొని గెలిచారు. దాంతో యూ ట్యూబ్‌ చానెల్‌లో వీడియోస్‌ పెట్టారు. ‘హానెస్ట్‌ వెడ్డింగ్‌’ బాగా వైరల్‌ అవడంతో పాటు పది మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. యూ ట్యూబ్‌ చానెల్స్‌కి ఇంత ఆదరణ ఉందని అప్పుడే నవీన్‌కు తెలిసింది. ‘ఇంగ్లీష్‌ ఇంటర్వ్యూ’ అని మరో వీడియో వాట్సాప్‌లో బాగా వైరల్‌ అయింది. యూట్యూబ్ వీడియోస్ చూసి బాగున్నాయి అన్నా ఎవరూ అతని మీద ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రాలేదు.

అయితే ఏజెంట్ సాయి శ్రీనివాస ప్రొడ్యూసర్ మాత్రం నమ్మారు. ఓ రోజు డైరెక్టర్‌ స్వరూప్‌ రాజ్‌ ఫోన్‌ చేసి, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’లో డిటెక్టివ్‌గా చేస్తారా? అనటంతో హీరోగా నవీన్ జర్నీ మొదలైంది. ఆ సినిమా నవీన్ బాగా పర్ ఫార్మ్ చేయగలను అని ప్రూవ్ చేసింది. ఆ సినిమాతో అందరి దృష్టీ నవీన్ పై పడింది. అశ్వనీదత్‌ కుమార్తె స్వప్న నిర్మించిన ‘జాతిరత్నాలు’ సినిమాలో నవీన్‌ నటించేందుకు అంగీకరించటం అతని కెరీర్ లో పెద్ద మలుపు. ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.

నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రలో అనుదీప్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’. ఉప్పెన తర్వాత ఆ స్థాయిలో బాక్స్‌ఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టిన సినిమాగా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై ఊహించని స్థాయిలో వసూళ్లను రాబట్టింది. వినోదమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ల్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ సత్తా చాటింది.

జాతి రత్నాలు టైమ్‌లో పాండమిక్ వచ్చింది. అప్పుడు సినిమాలు థియేటర్ లో చూడరు అన్నారు. కానీ ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి..నవీన్ సినిమా థియేటర్ లో బాగా పే చేస్తుందనే నమ్మకం ప్రొడ్యూసర్స్, బయ్యర్స్ లో వచ్చింది. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో కేవలం కామెడీ మాత్రమే కాదు ఎమోషన్ కూడా చేయగలను అని నిరూపించుకున్నారు నవీన్.. ‘జవాన్’ వంటి పెద్ద సినిమా పక్కన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వచ్చింది. సినిమా నిలబడదు అన్నారు. కానీ బాగా ఆడింది. సో అన్ని రకాలుగా నవీన్ లో కాన్ఫిడెన్స్ పెరిగింది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకున్న అత‌డు సినిమాల‌కు కాస్త విరామం ఇవ్వాల్సి వ‌చ్చింది.

వాస్తవానికి ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu) బ్లాక్ బస్టర్ అయిన తర్వాత నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరోగా ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. ‘మ్యాడ్’ (MAD) ఫేమ్ కళ్యాణ్ శంకర్ ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సి ఉంది. గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది. కానీ ఎందుకో సినిమా ముందుకు కదలరేదు. ‘కళ్యాణ్ శంకర్ స్క్రిప్ట్ పై నవీన్ పోలిశెట్టి సంతృప్తి చెందనందున.. ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది’ అని వినిపించాయి.

ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) రిలీజ్ అయ్యి ఏడాది దాటినా ఇంకా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు నవీన్ పోలిశెట్టి. అమెరికాలో జరిగిన ప్రమాదం నవీన్ కు స్పీడ్ బ్రేకర్ లా మారింది. అతని చేతికి గాయం అవ్వడంతో.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డిలే అవుతున్నట్టు వివరణ ఇచ్చాడు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో ‘ఆయ్’ (AAY) దర్శకుడు అంజి మణిపుత్రతో నవీన్ ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా గోదావరి నేపధ్యంలోనే ఉంటుందని వినికిడి. ‘ఆయ్’లో ఫన్ పండించిన తీరు నచ్చి నవీన్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారని వినికిడి.

ఇక నటుడుగా నవీన్ కు ఎవరూ వంక పెట్టలేరు. ‘‘నేను 7–8 తరగతి చదువుతున్నప్పటి నుంచే నటన, నాటకాలంటే ఇష్టం. పదో తరగతి వరకూ హైదరాబాద్‌లోనే చదివా. మా తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు భోపాల్‌ నిట్‌లో చేరి, ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. యూ ట్యూబ్‌ నుంచి నా ప్రయాణం బిగ్‌ స్క్రీన్‌కి మారింది’’ అన్నారు నవీన్‌ పొలిశెట్టి.

నవీన్ మాట్లాడుతూ.. నటుడిగా ప్రతి సీన్ ను సెట్ లో ఇంప్రవైజ్ చేసుకుంటా. సీన్ లో నాలుగు జోక్స్ ఉంటే..నేను చేసేప్పుడు ఏడుసార్లు ఆడియన్స్ నవ్వాలని అనుకుంటా. అలాంటి ఫ్రీడమ్ కావాలని కోరుకుంటా. లక్కీగా నా డైరెక్టర్స అందరూ నాకు అలాంటి ఫ్రీడమ్ ఇచ్చారు. సీన్ పేపర్ లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు. రేపు చేసే సీన్ గురించి రాత్రే దర్శకుడితో మాట్లాడి పూర్తి క్లారిటీ తీసుకుంటా అంటారు. టైమ్ దొరికితే కపిల్ షో లాంటి మంచి హ్యూమరస్ టీవీ ప్రోగ్రాం చేయడానికి రెడీ. అయితే సినిమాలతోనే టైమ్ సరిపోతోంది అని చెప్తారీ దర్శకుడు.

Read More
Next Story