‘ధురంధర్ 2’ OTT డేట్ ఫిక్స్: ఇండియాలో ఎప్పుడంటే?
x

‘ధురంధర్ 2’ OTT డేట్ ఫిక్స్: ఇండియాలో ఎప్పుడంటే?

రణవీర్ సింగ్ 'ధురంధర్ 2: ది రివెంజ్' సినిమా ఓటీటీ విడుదల తేదీపై సాగుతున్న ఉత్కంఠకు తెరపడుతూ అధికారిక అప్‌డేట్ వచ్చేసింది.


రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడుతూ అధికారిక అప్‌డేట్ వచ్చేసింది.
అంతర్జాతీయ వేదికపై మే 14న విడుదల
నెట్‌ఫ్లిక్స్ (Netflix) అధికారిక సమాచారం ప్రకారం, 'ధురంధర్ 2' మే 14, 2026 నుంచి అంతర్జాతీయంగా స్ట్రీమింగ్ కానుంది. కొన్ని దేశాల్లో టైమ్ జోన్ల మార్పు వల్ల మే 15న అందుబాటులోకి వస్తుంది. విశేషం ఏంటంటే, ఓటీటీ వెర్షన్‌లో సుమారు 3 గంటల 52 నిమిషాల నిడివితో అదనపు ఫుటేజ్, అన్-సెన్సార్డ్ డైలాగులు ఉంటాయని సమాచారం. 'రా అండ్ ఉండెఖా' (Raw & Undekha) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం విడుదల కానుంది.
భారత్‌లో స్ట్రీమింగ్ ఎక్కడ?
మొదటి భాగం నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చినప్పటికీ, సీక్వెల్ అయిన 'ధురంధర్ 2' భారత్‌లో మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ (JioHotstar) లో మే 14న విడుదల కానుంది. థియేటర్లలో విడుదలైన 8 వారాల గ్యాప్ తర్వాత మే నెల మధ్యలో ఈ సినిమా డిజిటల్ స్క్రీన్‌పైకి వస్తుందని కోర్టు విచారణ సందర్భంగా నిర్మాతలు ఇప్పటికే హింట్ ఇచ్చారు.
ఈ సినిమాలోని 'తిర్చి టోపివాలే' రీమిక్స్ సాంగ్ (రంగ్ దే లాల్) విషయంలో కాపీరైట్ వివాదం నెలకొన్నప్పటికీ, అది సినిమా వసూళ్లపై ప్రభావం చూపలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ప్రభంజనం సృష్టించింది:
భారతదేశ నెట్ వసూళ్లు: ₹1,140.67 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు: ₹1,791.55 కోట్లు
రణవీర్ సింగ్‌తో పాటు సారా అర్జున్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రం, థియేటర్లలో ఏడు వారాల తర్వాత కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇంటి వద్దే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ను చూడాలనుకునే ప్రేక్షకులకు వచ్చే వారం పండుగే అని చెప్పాలి.
Read More
Next Story