ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌లో ట్విస్ట్.. డైరెక్షన్ షేర్?
x

ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌లో ట్విస్ట్.. డైరెక్షన్ షేర్?

రిస్క్ లేదా స్ట్రాటజీ?


జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే ఒక్క ఫ్రేమ్ కూడా ఫ్యాన్స్ మిస్సవ్వరు. ఇప్పుడు అదే ఫ్యాన్స్‌లో ఒక కొత్త డౌట్ రన్ అవుతోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న డ్రాగన్ లో, అసలు డైరెక్షన్ ఒక్కరికి పరిమితమా… లేక మల్టీ హ్యాండ్స్ గేమ్ మొదలైందా?

సెట్స్‌లోకి మరో దర్శకుడు?

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రంలోని కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ల బాధ్యతను ‘ప్రస్థానం’ ఫేమ్ దేవకట్టాకు అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి కూడా ‘వారణాసి’ కోసం దేవకట్టా సేవలను వాడుకోగా, ఇప్పుడు నీల్ అదే బాటలో పయనిస్తున్నారని తెలుస్తోంది. అధికారికంగా కన్ఫర్మేషన్ లేకపోయినా, ఈ విషయం చర్చకు దారి తీసింది.

“డైలాగ్స్ కోసం రిస్క్?”

దేవా కట్ట అంటే డైలాగ్ పవర్. షార్ప్, హార్డ్ హిట్టింగ్ లైన్స్ రాయడంలో అతనికి మంచి పేరు ఉంది. అదే కారణంగా గతంలో S. S. Rajamouli కూడా తన ప్రాజెక్ట్ కోసం అతనిని తీసుకున్నాడు. ఇప్పుడు డ్రాగన్ కూడా తెలుగు ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తుండటంతో, డైలాగ్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని పవర్‌ఫుల్ లైన్స్ రెడీ అయ్యాయని టాక్.

“ఫ్యాన్స్ టెన్షన్ మొదలైంది”

ఇక్కడే అసలు ట్విస్ట్. దేవా కట్ట రచయితగా బలంగా ఉన్నా, దర్శకుడిగా బాక్సాఫీస్ ట్రాక్ మాత్రం స్టేబుల్ కాదు.

ఫ్యాన్స్ ఒకటే కోరుకుంటున్నారు:

ప్రతి ఫ్రేమ్‌లో నీల్ స్టైల్ కనిపించాలి

ఎలాంటి డైల్యూషన్ ఉండకూడదు

“ఇంకో డైరెక్టర్ హ్యాండిల్ చేస్తే… అసలు ఫీల్ మారిపోతుందా?” అన్న సందేహం పెరుగుతోంది.

“ఇండస్ట్రీ ప్యాటర్న్… కొత్తేమీ కాదు”

పెద్ద సినిమాల్లో మల్టీ-హ్యాండ్ క్రియేషన్ కొత్తది కాదు. :

యాక్షన్ డైరెక్టర్స్ వేరే

డైలాగ్ రైటర్స్ వేరే

సెకండ్ యూనిట్ డైరెక్టర్స్ వేరే

కానీ కీలకం: “ఫైనల్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది?”

నీల్ కంట్రోల్ పూర్తిగా ఉంటే, ఇది స్ట్రెంగ్త్.

కంట్రోల్ షేర్ అయితే, అది కన్ఫ్యూజన్.

రెండు షేడ్స్, రెండు పార్టులు!

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ముందెన్నడూ చూడని విధంగా రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నారట. సినిమా స్కేల్ చూస్తుంటే, దీనిని రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అయితే, మలయాళ నటుడు తోవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో, ఆ కీలక పాత్రలో ఎవరు నటిస్తారనేది సస్పెన్స్‌గా మారింది.

టార్గెట్ దసరా.. ఫ్యాన్స్ వెయిటింగ్!

‘వార్ 2’ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, తారక్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు ‘డ్రాగన్’ పైనే ఉన్నాయి. అందుకే మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, దసరా నాటికి పవర్ ఫుల్ టీజర్ రిలీజ్ చేసి అంచనాలను పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. 2027లో విడుదల కానున్న ఈ సినిమా చుట్టూ జరుగుతున్న ప్రతీ చర్చ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

మొత్తానికి ప్రశాంత్ నీల్ తీసుకున్న ఈ రిస్క్ ‘డ్రాగన్’ను ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. దేవకట్టా కలం బలం సినిమాకు ప్లస్ అవుతుందా, లేక దర్శకుల మధ్య సమన్వయం దెబ్బతింటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే! ఒకవేళ ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే మాత్రం, బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ ఊచకోత ఖాయం.

ఏదైమైనా

డ్రాగన్‌కు ఒక తల ఉంటే అగ్నిలా దూసుకెళ్తుంది… తలలు పెరిగితే దారి తప్పుతుంది, చివరికి పొగ మాత్రమే మిగులుతుంది.

Read More
Next Story