
లొంగిపోతామని చెప్పేందుకు ఇరాన్ లో ఎవరూ మిగలకపోవచ్చు- ట్రంప్
అమెరికాకు చుక్కలు చూపిస్తామన్న ఇరాన్
యుద్ధం 8వ రోజు ఏం జరిగిదంటే...
Live Updates
- 8 March 2026 8:11 PM IST
అమెరికాకు చుక్కలు చూపిండం ఖాయమన్న ఇరాన్
అమెరికా షరతులకు, బెదిరింపులకు తలొగ్గబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఎవరు మిగులుతారో ఎవరు పోతారో కాలమే నిర్ణయిస్తుందని ఇరాన్ పాలకులు అమెరికా ను హెచ్చరించారు. అమెరికా బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
మరోపక్క కొత్త సుప్రీం లీడర్ ను ఎన్నుకున్నారు.
ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరనే దానిపై ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ఇంకా పేరును ప్రకటించలేదు. అసెంబ్లీ సభ్యుడు మొహ్సెన్ హెదరీని ఉటంకిస్తూ స్థానిక మీడియా ఈ విషయం వెల్లడించింది. ‘‘సరైన అభ్యర్థి ఎవరనేది నిర్ణయమైంది. ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’లో ఆయనకు మెజారిటీ ఆమోదం లభించింది’’ అని మొహ్సెన్ చెప్పినట్లు తెలిపింది. మెజారిటీ సభ్యులను పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు మరో సభ్యుడు మొహమ్మద్ మెహదీ మిర్బాఘేరి తెలిపారు.
- 8 March 2026 4:23 PM IST
మరో 6 నెలలైనా యుద్ధ చేస్తాం- ఇరాన్
ఆరు నెలల యుద్ధం: ప్రస్తుత తీవ్రతతో మరో ఆరు నెలల పాటు యుద్ధం చేయగల సామర్థ్యం తమకు ఉందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది.
ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ను ఎంచుకునే ప్రక్రియను పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఆ పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
- 8 March 2026 4:20 PM IST
'లొంగిపోతామని చెప్పేందుకు ఎవరూ మిగలకపోవచ్చు' - డొనాల్డ్ ట్రంప్
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేస్తేనే ఈ యుద్ధం ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
యుద్ధ వార్తలు అప్ డేట్స్..
సైనిక పతనం తప్పదు: అధ్యక్ష విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్'లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్ నాయకత్వం, వారి సైనిక సామర్థ్యాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే తప్ప ఈ ఘర్షణలు ముగియవని అన్నారు.

చర్చలకు విముఖత: ఈ యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో ఎలాంటి చర్చలు జరిపేందుకు తనకు ఆసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. ఒక దశలో ఆయన.. బహుశా 'మేము లొంగిపోతున్నాం' అని చెప్పడానికి కూడా అక్కడ ఎవరూ మిగలరని నేను అనుకుంటున్నాను" అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఇజ్రాయెల్ మెరుపు దాడులు:
ట్రంప్ ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే, ఇజ్రాయెల్ ఇరాన్‌పై సరికొత్త వైమానిక దాడులను ప్రారంభించింది. ఇరాన్‌లోని కీలకమైన ఇంధన నిల్వ కేంద్రాలు (Fuel Storage Facilities), ఇతర వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.
ఆదివారం మధ్యప్రాచ్య ఆకాశంలో క్షిపణులు, డ్రోన్ల సంచారం కనిపించింది. ఇరాన్ లోపల రాజకీయ అనిశ్చితి పెరగడంతో పాటు, యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతోంది.

ప్రస్తుతానికి అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్ సైనిక వ్యవస్థను దెబ్బతీసే పనిలో ఉన్నాయి. ఇరాన్ తన పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, ట్రంప్ మాత్రం ఇరాన్ సంపూర్ణంగా ఓడిపోయే వరకు దాడులు కొనసాగుతాయని సూచించారు.
- 8 March 2026 9:25 AM IST
నార్వే లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి
ఇరాన్-అమెరికా యుద్ధం ఐరోపా దేశాలకూ పాకినట్టు కనిపిస్తోంది. నార్వే ఓస్లోలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద పేలుడు జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ పేలుడులో పెద్ద ఎత్తున శబ్దం, పొగ వ్యాపించినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు, ఎలాంటి ప్రాణనష్టం కూడాజరగలేదు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంతో ఈ పేలుడు సంభవించిందా? లేదా ఇది ఏ ఇతర కారణాల వల్ల సంభవించిందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తెర పైకి వచ్చాయి.
- 8 March 2026 9:02 AM IST
లొంగిపోతారా? లేదా? ట్రంప్ మరోసారి బెదిరింపు
డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక: ఇరాన్ "నిేషరతుగా లొంగిపోవాలని" అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డిమాండ్ చేశారు. టెహ్రాన్ నాయకులు తమ ఓటమిని ఒప్పుకునే వరకు లేదా వారి సైన్యం పూర్తిగా నిర్వీర్యం అయ్యే వరకు ఈ యుద్ధం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ ప్రతిస్పందన: యుద్ధం ప్రారంభించినందుకు అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ ఉన్నతాధికారి అలీ లారిజానీ హెచ్చరించారు. వాషింగ్టన్ తన లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతోందని ఆయన పేర్కొన్నారు.
గల్ఫ్ దేశాలపై దాడులు: దాడులు ఆపుతామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హామీ ఇచ్చినప్పటికీ.. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాలు తమపై ఇంకా ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయని ప్రకటించాయి

