
యుద్ధ వార్తలు: ఇరాన్ పై ఇవాళ భీకర దాడులు: ట్రంప్
వాళ్ల గొయ్యి వాళ్లు తొవ్వుకుంటున్నారు: IRAN మమ్మల్ని ఎవ్వరూ లొంగదీసుకోలేరన్న ఇరాన్
ఈ వ్యాఖ్యలను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజేశ్కియన్ తోసిపుచ్చారు. అమెరికా "తన గొయ్యి తాను తొవ్వుకుంటోంది" అని ఎద్దేవా చేశారు.
ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ లొంగేంత వరకు మాట, ముచ్చట ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది. పొరుగు దేశాలపై దాడులు తప్పేనని ఒప్పుకున్న ఇరాన్. ఇకపై దాడులు చేయబోమని తేల్చి చెప్పిన ఇరాన్.
Live Updates
- 7 March 2026 6:48 PM IST
ఇరాన్ పై ఇవాళ భీకర దాడులు చేస్తామన్న ట్రంప్
ఇక ఇరాన్ ను క్షమించం, భీకర దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. "ఇరాన్ అధికారులకు చాలా టైం ఇచ్చా. ఇక మరిన్ని దాడులు తప్పవు. ఇవేళ ఇరాన్ పైన మరిన్ని భీకర దాడులు ఉంటాయి!" అని ఆయన తన "ట్రూత్ సోషల్" వెబ్‌సైట్‌లో వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజేశ్కియన్ తోసిపుచ్చారు. అమెరికా చెప్పినట్టు నడుచుకోలేం, ఇది ఇరాన్ అన్నారు. ఇరాన్ తన పొరుగు దేశాలపై చేసిన దాడులపై క్షమాపణ చెప్పిన నేపథ్యంలో వచ్చిన వ్యాఖ్యలివి.
వాళ్ల గొయ్యి వాళ్లు తొవ్వుకుంటున్నారన్న ఇరాన్
ప్రెసిడెంట్ పెజేశ్కియన్ "అన్ కండిషనల్ సరెండర్" అనే ట్రంప్ డిమాండ్‌ను " వారి గొయ్యి వాళ్లు (అమెరికా) తొవ్వుకుంటున్నారు" అని ఎద్దేవా చేశారు.
ఈ యుద్ధం రెండవ వారంలోకి అడుగుపెట్టింది. టార్గెట్ దాడుల కంటే ఇరుగుపొరుగు దేశాల సాంఘిక విరోధం కూడా మారిపోయింది. ఇందులో సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, లెబనాన్ కూడా జోక్యం చేసుకుంటున్నాయి.
- 7 March 2026 4:02 PM IST
ట్రంప్ తాటాకు చప్పుళ్లకు బెదరం- ఇరాన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను "బేషరతుగా లొంగిపోవాలని" (Unconditional Surrender) డిమాండ్ చేసిన నేపథ్యంలో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ దీటుగా స్పందించారు. ట్రంప్ తాటాకు చప్పుళ్లకు బెదరబోదన్న అర్థం వచ్చేలా ఇరాన్ ఎప్పటికీ లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మరోవైపు, ఇరాన్ తన డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్, గల్ఫ్ ప్రాంతంలోని లక్ష్యాలపై దాడులను కొనసాగిస్తూనే ఉంది.
అమెరికా- ఇజ్రాయెల్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం రెండో వారంలోకి ప్రవేశించినా యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు.
- 7 March 2026 2:07 PM IST
పొరుగు దేశాలపై దాడులకు ఇరాన్ క్షమాపణ
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజేశ్కియన్, ఇరాన్ ఇకపై తమ పొరుగుదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయదని వీడియో సందేశంలో వెల్లడించారు. ఈ సందేశం ఇరాన్ రాష్ట్ర టీవీలో ప్రసారం కాగా, ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ ప్రకటనతో కొన్ని గంటల తర్వాత, కతార్ రక్షణ మంత్రిత్వ శాఖ తమ రక్షణ దళాలు ఒక మిసైల్ దాడిని ఇంటర్సెప్టు చేసినట్లు తెలిపింది. ఈ ఘటన ఇరాన్ అధ్యక్షుడి ప్రకటన అనంతరం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్ అధ్యక్షుడు తన పొరుగుదేశాలపై దాడులు చేయబోమని ప్రకటించిన కాసేపటికే ఉల్లంఘన జరిగినట్టుగా కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి.
- 7 March 2026 9:39 AM IST
ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం!
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పాలక యంత్రాంగం ఎటువంటి షరతులు లేకుండా "బేషరతుగా లొంగిపోవడం" (Unconditional Surrender) తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం వైట్‌హౌస్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో ట్రంప్ తన ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఇరాన్ ప్రతిపాదించిన చర్చల అవకాశాన్ని ట్రంప్ పూర్తిగా తిరస్కరించారు. "ఇక మాట్లాడే సమయం ముగిసింది, ఇప్పుడు కేవలం చర్యలే ఉంటాయి" అని ఆయన పేర్కొన్నారు.
- 7 March 2026 8:49 AM IST
భేషరతుగా లొంగితేనే చర్చలు- ట్రంప్
ఇరాన్ యుద్ధం ప్రాంతీయంగా విస్తరిస్తోంది. తీవ్ర ప్రభావమూ చూపుతోంది. మధ్యప్రాచ్యంలోని దాదాపు ప్రతి దేశం క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు లేదా పేలుడు శకలాల వల్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. అనేక దేశాలలో ప్రాణనష్టం జరుగుతోంది. కీలక దౌత్య కార్యాలయాలు (Embassies), ఆర్థిక కేంద్రాలు, రవాణా మార్గాలు మూతపడ్డాయి.

యుద్ధం ప్రారంభమైన ఏడవ రోజైన శుక్రవారం నాడు, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బీరుట్, టెహ్రాన్‌లపై దాడులు చేశాయి. 'ఏపీ న్యూస్' వార్తా కథనం ప్రకారం అదే సమయంలో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ మరో విడత ప్రతీకార దాడులను ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలను తోసిపుచ్చారు. "బేషరతుగా లొంగిపోవాలని" పిలుపునివ్వడంతో యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేయడంతో ప్రారంభమైన ఈ యుద్ధం కారణంగా, విదేశీ ప్రభుత్వాలు తమ పౌరులను అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల్లో మధ్యప్రాచ్య దేశాల నుండి వెంటనే వచ్చేయాలని కోరుతున్నాయి. విమాన మార్గాలు (Airspaces) మూతపడ్డాయి, క్రూయిజ్ నౌకలు, ట్యాంకర్లు హార్మూజ్ జలసంధి గుండా వెళ్లలేకపోతున్నాయి. ప్రధాన విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తమ పౌరులను ఈ ప్రాంతం నుండి తరలించడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి.

