3 చోట్లా పాత రికార్డుల్ని బద్దలుకొట్టిన పోలింగ్ శాతం
అస్సాం 85%, కేరళ 75%, పుదుచ్చేరి 87% ఓట్లు పోలయ్యాయి.
అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో రికార్డు స్థాయిల్లో పోలింగ్ శాతం నమోదైంది. మూడు చోట్లా పాత రికార్డుల్ని బద్దలు చేసేలా ఓటర్లు పోటెత్తారు. కడపడి వార్తలు అందే సమయానికి అస్సాం 85%, కేరళ 75%, పుదుచ్చేరి 87% ఓట్లు పోలయ్యాయి. మూడు కీలక ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అస్సాంలో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా కేరళ, పుదుచ్చేరిలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది.
కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో 126 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు.
దేశంలోని 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి పోలింగ్ కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. ఏప్రిల్ 9న కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, కేరళ, అస్సాంలలో భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం: ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం, ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్ చివరి విడత పోలింగ్ ముగిసే వరకు ఫలితాల అంచనాలను వెల్లడించడంపై కఠిన నిషేధం ఉంది.
తదుపరి దశలు: తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఫలితాల షెడ్యూల్:
కేరళ, అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు మే 4, 2026న విడుదల కానున్నాయి.
నేటి పోలింగ్ కొన్ని చిన్నపాటి సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
అస్సాం (126 స్థానాలు): అస్సాంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగింది.
పుదుచ్చేరి (30 స్థానాలు): ఎన్. రంగసామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్‌సీ (AINRC) - బీజేపీ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.
ఉప ఎన్నికల సందడి:
Live Updates
- 9 April 2026 7:32 PM IST
అస్సాం 85%, కేరళ 75%, పుదుచ్చేరి 87% పోలింగ్
అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో రికార్డు స్థాయిల్లో పోలింగ్ శాతం నమోదైంది. మూడు చోట్లా పాత రికార్డుల్ని బద్దలు చేసేలా ఓటర్లు పోటెత్తారు. కడపడి వార్తలు అందే సమయానికి అస్సాం 85%, కేరళ 75%, పుదుచ్చేరి 87% ఓట్లు పోలయ్యాయి. మూడు కీలక ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అస్సాంలో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా కేరళ, పుదుచ్చేరిలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది.
కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో 126 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు.
- 9 April 2026 3:24 PM IST
కేరళ, అస్సాంలో ఓటెత్తిన పోలింగ్
కేరళలో తొలి 6 గంటల్లోనే 50 శాతం ఓట్లు పోలయ్యాయి. అస్సాంలో మధ్యాహ్నం 1 గంటకు 60 శాతం, పుదుచ్చేరిలో 57 శాతం ఓట్లు పోలయ్యాయి. పెరిగిన ఓట్ల శాతం ఎవరికి మేలు చేస్తాయనే దానిపై అప్పుడే కేరళలో చర్చలు ప్రారంభం అయ్యాయి.
భారతదేశంలోని మూడు ముఖ్యమైన ప్రాంతాలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. కేరళతో పాటు అసోం, పుదుచ్చేరిలలో కూడా ఒకే విడతలో ఓటింగ్ జరుగుతోంది.
మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన ఓటింగ్ వివరాలు
కేరళ (Kerala)
కేరళలోని మొత్తం 140 నియోజకవర్గాలకు నేడు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది.
ఓటింగ్ శాతం: మధ్యాహ్నం 1:00 గంట వరకు సుమారు 49.70% ఓటింగ్ నమోదైంది.
ప్రధాన పార్టీలు: పాలక పక్షం LDF (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్), ప్రతిపక్షం UDF (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్) మరియు NDA (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
ముఖ్య అంశం: LDF వరుసగా మూడోసారి విజయం సాధించాలని చూస్తుండగా, UDF పదేళ్ల తర్వాత అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది.
అస్సాం(Assam)
అస్సాం మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది.
ఓటింగ్ శాతం: మధ్యాహ్నం 1:00 గంట వరకు అత్యధికంగా 59.63% ఓటింగ్ నమోదైంది. ఇక్కడ ఓటర్లు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
ప్రధాన పోటీ: ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని BJP కూటమి మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల మధ్య ప్రధాన పోటీ ఉంది.
పుదుచ్చేరి (Puducherry)
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది.
ఓటింగ్ శాతం: మధ్యాహ్నం 1:00 గంట వరకు 56.83% పోలింగ్ నమోదైంది.
ఇక్కడ అధికార AINRC-BJP కూటమికి, కాంగ్రెస్-DMK కూటమికి మధ్య గట్టి పోటీ ఉంది.
ముఖ్య సమాచారం:
పోలింగ్ సమయం: ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.
ఫలితాలు: ఈ మూడు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాలు కూడా కలిపి మే 4, 2026న వెలువడతాయి.
ఇతర ఎన్నికలు: కర్ణాటక, నాగాలాండ్ , త్రిపురలోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నేడే జరుగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఎన్నికలు రెండు విడతల్లో (ఏప్రిల్ 23, ఏప్రిల్ 29) జరగనున్నాయి.
- 9 April 2026 11:59 AM IST
11 గంటలకు పోలింగ్ శాతాలు ఇలా
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బాగా చురుగ్గా సాగుతోంది. ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.
ఉదయం 11 గంటలకు ప్రకటించిన సమాచారం ప్రకారం అస్సాంలో 38.92 శాతం, కేరళలో 33. 28 శాతం, పుదుచ్చేరిలో 37.06 శాతం ఓట్లు పోలయ్యాయి.
అస్సాంలో 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. ముఖ్యంగా ముస్లిం ఓటర్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నియోజకవర్గాల మార్పు ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.
కేరళ లో ఈసారి త్రిముఖ పోటీ కనిపిస్తోంది. అధికార పక్షమైన లెఫ్ట్ ఫ్రంట్ (LDF) వరుసగా మూడోసారి గెలిచి రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, ఈసారి గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తున్న బీజేపీ మధ్య గట్టి పోరు సాగుతోంది.
పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్. రంగసామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్‌సీ (AINRC), బీజేపీ, ఏఐఏడీఎంకే కూటమి, కాంగ్రెస్, డీఎంకే కూటముల మధ్య ప్రధాన పోరు ఉంది. అయితే, ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే.. నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) ఈ ఎన్నికల ద్వారా తన రాజకీయ అరంగేట్రం చేస్తోంది.
- 9 April 2026 11:18 AM IST
నటుడు విజయ్ పార్టీ బోణీ కొట్టేనా..
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బాగా చురుగ్గా సాగుతోంది. ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.
అస్సాంలో 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. ముఖ్యంగా ముస్లిం ఓటర్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నియోజకవర్గాల మార్పు ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.
కేరళ లో ఈసారి త్రిముఖ పోటీ కనిపిస్తోంది. అధికార పక్షమైన లెఫ్ట్ ఫ్రంట్ (LDF) వరుసగా మూడోసారి గెలిచి రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, ఈసారి గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తున్న బీజేపీ మధ్య గట్టి పోరు సాగుతోంది.
పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్. రంగసామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్‌సీ (AINRC), బీజేపీ, ఏఐఏడీఎంకే కూటమి, కాంగ్రెస్, డీఎంకే కూటముల మధ్య ప్రధాన పోరు ఉంది. అయితే, ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే.. నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) ఈ ఎన్నికల ద్వారా తన రాజకీయ అరంగేట్రం చేస్తోంది.
- 9 April 2026 10:19 AM IST
ఓటు వేసిన కేరళ ముఖ్యమంత్రి
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూర్ లోని అమల బేసిక్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో కొద్ది సేపటికిందట ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- 9 April 2026 10:14 AM IST
అసెంబ్లీ ఎన్నికలు 2026 : అందరి లక్ష్యం ఒక్కటే
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో అత్యంత కీలకమైన పోలింగ్‌కు నేడు ఓటింగ్ ప్రారంభమైంది. అస్సాంలో బీజేపీ మరో విజయంపై కన్నేసి ఉండగా, కేరళ లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా ఐదోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పుదుచ్చేరిలో ఎన్. రంగస్వామికి చెందిన ఏఐఎన్‌ఆర్‌సి నాలుగో విజయం కోసం సిద్ధమైంది.
ఎన్నికల ఈ దశలో అస్సాంలో 126 స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను మే 4న ప్రకటిస్తారు.
- 9 April 2026 10:03 AM IST
ఉత్సాహంగా పోలింగ్- అస్సాంలో 17.87%, కేరళలో 16.23% ఓటింగ్
దేశంలోని రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే ఓటర్లు బారులు తీరడంతో తొలి రెండు గంటల్లోనే ఓటింగ్ శాతం ఆశాజనకంగా నమోదైంది.
తొలి అప్‌డేట్ (ఉదయం 9 గంటల వరకు):
అస్సాం: 17.87%
పుదుచ్చేరి: 17.41%
కేరళ: 16.23%
మొత్తం 5.3 కోట్ల మంది ఓటర్లు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకుని అస్సాం (126 స్థానాలు), కేరళ (140 స్థానాలు), పుదుచ్చేరి (30 స్థానాలు) ప్రభుత్వాల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
- 9 April 2026 9:41 AM IST
ఉదయం 9 గంటలకే భారీగా ఓటింగ్!
కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొదటి రెండు గంటల్లోనే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం:
అస్సాం: 17.87%
పుదుచ్చేరి: 17.41%
కేరళ: 16.23%
ప్రధాని మోదీ పిలుపు
ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి పోలింగులో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత, మహిళలు రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ఆయన ఇంగ్లీష్‌తో పాటు మలయాళం, అస్సామీ, తమిళ భాషల్లో ట్వీట్ చేశారు.
కేరళలో ప్రముఖుల ఓటింగ్:
ఉదయాన్నే పలువురు ప్రముఖులు క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు.
ముఖ్యమంత్రి పినరయి విజయన్: కన్నూర్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కేరళ అభివృద్ధికి, అవినీతి రహిత పాలనకు ప్రజలు మళ్ళీ ఎల్‌డీఎఫ్ (LDF) కే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, ఈసారి యూడీఎఫ్ (UDF) విజయం తథ్యమని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి సురేష్ గోపి, రాజీవ్ చంద్రశేఖర్: ఉదయాన్నే ఓటు వేసి, కేరళలో రాజకీయ మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సినీ నటుడు మోహన్‌లాల్: తన ఓటు హక్కును వినియోగించుకుని, ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
అస్సాం, పుదుచ్చేరి:
అస్సాంలో బీజేపీ వరుసగా మూడో విజయంపై కన్నేయగా, పుదుచ్చేరిలో ఎన్. రంగసామి నేతృత్వంలోని కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని పోరాడుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం పోలింగ్ అంతా ప్రశాంతంగా సాగుతోంది.
సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.