
బీహార్ లో ఢంకా భజాయించిన నితీశ్
మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలో (నవంబర్ 6, 11 తేదీల్లో) పోలింగ్ - రెండు దశల్లో నమోదయిన పోలింగ్ శాతం 67.13.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. బీహార్ నుంచి వచ్చిన ముందస్తు నివేదికల ప్రకారం .. NDA ఆధిక్యంలో ఉంది. కానీ ప్రతిపక్ష కూటమి కూడా వేగంగా ఆధిక్యంలోకి దూసుకుపోతోంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తం 243 స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరిగింది. ఓటింగ్ శాతం 67.13గా రికార్డుయ్యింది.
Live Updates
- 14 Nov 2025 9:47 AM IST
తారాపూర్‌లో సామ్రాట్ చౌదరీలేడ్స్, అలీనగర్‌లో మైథిలి ఠాకూర్ ఆధిక్యంలో ఉన్నారు. ఇమామ్‌గంజ్‌లో హిందుస్తాన్ అవామ్ మోర్చా నాయకురాలు దీపా కుమారి ప్రారంభం నుంచి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. రఘోపూర్‌లో తేజస్వి కూడా లీడ్‌లో కొనసాగుతున్నారు. ECI ప్రకారం.. బీహార్‌లో 28 స్థానాల్లో NDA ఆధిక్యంలో ఉంది. మహాఘటబంధన్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
- 14 Nov 2025 9:33 AM IST
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదటి 30 నిమిషాల తర్వాత మోకామాలో అనంత్ సింగ్ (JD(U) ఆధిక్యంలో ఉన్నారు. మహువాలో తేజ్ ప్రతాప్ (RJD) వెనుకబడ్డారు. ఇక రాఘోపూర్‌లో తేజశ్వి (RJD) ఆధిక్యంలో ఉన్నారు.
- 14 Nov 2025 9:11 AM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి రౌండ్ కౌంటింగ్ లో బీజేపీ ఆధిక్యం లో వుంది. కౌంటింగ్ 10 రౌండ్ లలో జరుగుతుంది. 243 అసెంబ్లీ నియోజక వర్గాలు వున్న బీహార్ లో 179 నియోజక వర్గాల లో పోస్టల్ బ్యాలట్ ప్రాధమిక కౌంటింగ్ లో ఎన్డీఏ 117 సీట్ లలో ఆధిక్యం లో వుంది. మహాగట్‌బంధన్ 60 సీట్ లలో ఆధిక్యం లో వుంది. జన్ సూరాజ్ పార్టీ 2 సీట్ ల లో ఆధిక్యం లో వుంది. బీహార్ కౌంటింగ్ 10 రౌండ్ లలో జరగుతుంది. ముఖ్యమైన అభ్యర్థులలో రాఘవపూర్ నుండి తేజస్వి ఆధిక్యం లో వున్నారు. బిజెపి కి సంబందించిన మైథిలి ఠాకూర్ అలీనగర్ నుండి ఆధిక్యం లో వున్నారు. మహుయా నుండి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆధిక్యం లో వున్నారు. జేడీయు కు చెందిన అనంత్ సింగ్ మోకామ్ నుండి ఆధిక్యం లో వున్నారు. సివాన్ నుండి బీజేపీ కి చెందిన మంగల్ పాండే ఆధిక్యం లో వున్నారు.

