తమిళగడ్డ.. విజయ్ అడ్డా!
x

తమిళగడ్డ.. విజయ్ అడ్డా!

బెంగాల్, కేరళలో హోరాహోరీ, అస్సాం కమలానిదే.. పుదుచ్చేరీలో రంగరాజన్ కాంగ్రెస్


దేశవ్యాప్తంగా అందరి కళ్లు ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో నేడు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభమైన ఈ ప్రక్రియలో పలువురు హేమాహేమీలు ముందంజలో ఉన్నారు.
తమిళనాడులో నటుడు విజయ్ పెట్టిన టీవీకే పార్టీ మంచి జోరు మీద ఉంది. అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నట్టుగా ఉంది.
తమిళనాడు: డీఎంకే అడ్డా.. కొళత్తూరులో స్టాలిన్ జోరు
తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా, అధికారం దక్కించుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 118. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం అధికార డీఎంకే (DMK) తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.
కొళత్తూరు: ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
చేపాక్కం-తిరువల్లికేణి: మంత్రి ఉదయనిధి స్టాలిన్ తన నియోజకవర్గంలో లీడ్ లో ఉన్నారు.
ఎడప్పాడి: మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత పళనిస్వామి ఆధిక్యంలో ఉన్నారు.
పెరంబూరు: రాజకీయ అరంగేట్రం చేసిన నటుడు విజయ్ (TVK) ఇక్కడ తన ప్రభావాన్ని చూపుతూ ముందంజలో ఉండటం గమనార్హం.
పుదుచ్చేరి: యానాంలో కౌంటింగ్ ప్రారంభం
పుదుచ్చేరిలోని 30 స్థానాలకు గానూ కౌంటింగ్ ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా యానాం నియోజకవర్గంపై తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది.
యానాంలో సర్వేపల్లి రాధాకృష్ణ డిగ్రీ కళాశాలలో లెక్కింపు జరుగుతోంది.
ఇక్కడ మల్లాడి కృష్ణారావు (NR కాంగ్రెస్ కూటమి) మరియు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ (కాంగ్రెస్) మధ్య ప్రధాన పోటీ ఉంది.
మొత్తం 35,445 ఓట్లు పోలవగా, భారీ భద్రత మధ్య ఈవీఎంల లెక్కింపు కొనసాగుతోంది.
పశ్చిమ బెంగాల్: 293 స్థానాల్లో పోరు
బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండగా, ఫల్టా నియోజకవర్గంలో రీ-పోలింగ్ కారణంగా ప్రస్తుతం 293 స్థానాలకే లెక్కింపు జరుగుతోంది.
తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ మధ్య ఇక్కడ నెక్-టు-నెక్ పోటీ కనిపిస్తోంది.
ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉండగా, మమతా బెనర్జీ తన నియోజకవర్గంలో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
కేరళ & అసోం: చరిత్ర తిరగరాస్తారా?
కేరళ: ఎల్‌డీఎఫ్ (LDF) వరుసగా మూడోసారి అధికారం సాధించాలని చూస్తుండగా, యూడీఎఫ్ (UDF) ఈసారి మార్పు వస్తుందని ఆశిస్తోంది. పోస్టల్ బ్యాలెట్లలో యూడీఎఫ్ ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.
అసోం: బీజేపీ ఇక్కడ హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా లేక కాంగ్రెస్ కూటమి షాక్ ఇస్తుందా అన్నది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.
ఎన్నికల సంఘం అధికారిక ఫలితాలు వెలువడే వరకు ఈ ఆధిక్యాలు రౌండ్ల వారీగా మారుతూ ఉండే అవకాశం ఉంది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఇప్పుడే జిలేబీలు సిద్ధం అవుతుండగా, అటు డీఎంకే శ్రేణులు కూడా సంబరాలకు సిద్ధమవుతున్నాయి.

Live Updates

  • 4 May 2026 9:16 AM IST

    అధికారంలోకి రావాలంటే ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవాలి

    నాలుగు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎంత మెజారిటీ అవసరమో చూద్దాం..

    పశ్చిమ బెంగాల్‌లో మొత్తం సీట్లు - 294, మ్యాజిక్ ఫిగర్ - 148 సీట్లు

    తమిళనాడులో మొత్తం సీట్లు - 234, మ్యాజిక్ ఫిగర్ - 118 సీట్లు

    కేరళలో మొత్తం సీట్లు - 140, మ్యాజిక్ ఫిగర్ - 71 సీట్లు

    అస్సాంలో మొత్తం సీట్లు - 126, మ్యాజిక్ ఫిగర్ - 64

    పుదుచ్చేరిలో మొత్తం సీట్లు - 30, మ్యాజిక్ ఫిగర్ - 16

Read More
Next Story