x

శేషాచలం ప్రకృతి ఒడిలో మహిళల ఆరాధన

తిరుమల నడకదారిలో రాళ్ల గూళ్ల కథ!


Click the Play button to hear this message in audio format

ప్రకృతి ఓ వర ప్రసాదం. ప్రకృతిని ప్రేమించే వారికి వన దేవలు కొలువైనట్లే భావిస్తారు. అనేది ఓ నమ్మకం. ఇందులో తిరుమలకు వెళ్లే దారుల్లోనే కాదు. కొండపై కాస్త లోపలికి వెళితే, దారి పక్కన చిన్న రాళ్లు పేర్పి ఉండడం కనిపిస్తుంది. అడవుల్లో చెట్టు కొమ్మలకు చిన్నపాటి గుడ్డతో కట్టిన ఊయలలు కూడా కనువిందు చేస్తుంటాయి. ఇలా పేర్చడం యాత్రికుల నమ్మకం కనిపిస్తుంది. రాళ్లను పేర్చే తీరు ఆలయాలను తలపిస్తాయి. ఎటు చేసిన కనిపించే ఈ దృశ్యం కొత్త ఆలోచనలకు పురిగొల్పుతుంది. ఇలా చేయడంలో మహిళల అచంచల నమ్మకం, ఆరాధన భావం కళ్ల ముందు కనిపిస్తుంది.

తిరుపతి నుంచి అలిపిరి మీదుగా కాలినడకన తిరుమలకు వెళ్లే మార్గం. శ్రీవారిమెట్టు నడక మార్గంలోనే కాదు. తిరుమల కొండపై అనేక స్థానిక ఆలయాలు, జాపాలి తీర్థం, ఆకాశగంగ, పాపవినాశనం ఇలా ఒకటి కాదు. శేషాచలం పర్వతసానువుల్లోని అనేక తీర్థాలకు వెళ్లే నడక మార్గానికి పక్కనే ఎత్తుగా పేర్చిన మూడు లేదా ఐదు చిన్నపాటి రాళ్లు ఎత్తుగా కనిపిస్తాయి.
"అడవిలో వనదేవతలు ఉంటారు. అక్కడ వీచే చల్లటి గాలి తాకగానే మేను పులకరిస్తుంది. మా మదిలో కోరికలు చెప్పుకుంటూ రాళ్లు పేర్చే సమయంలో వనదేవతలకు ఓ ఇండికేషన్ ఇవ్వడమే" అని కర్నూలుకు చెందిన సునీతారెడ్డి వ్యాఖ్యానించారు.
శేషాచలం అడవుల్లో నడుస్తూ, శ్రీవారి దర్శనానికి వెళ్లే యాత్రికులు ప్రధానంగా మహిళలు ఇలా ముడుపులు కడుతూ కనిపిస్తుంటారు. పిల్లల కోసం వివాహితులు జోలపాట పాడాలని చెట్టు కొమ్మలకు ఊయల కట్టడం కనిపిస్తుంది.
"అడవితల్లిని జగన్మాత స్వరూనంగానే భావిస్తాం. అది కూడా శ్రీవారు కొలువైన ఈ అడవుల ప్రకృతే కాదు. ప్రతి అణువూ భక్తిపూర్వకంగా ఉంటుంది" అని కోడుమూరుకు చెందిన విజయలక్ష్మి వ్యాఖ్యానించారు. కొండపై రాళ్లను పేరిస్తే తమకంటూ ఒక "సొంత ఇల్లు" సమకూరుతుందనేది వారి నమ్మకం. ఆ రాళ్ల గూళ్లను కడుతున్నంత సేపూ వారి మనస్సు అపరిమితమైన ఆనందంతో, భావోద్వేగంతో నిండిపోతుంది.
తమ కష్టాలను అడవితల్లికి చెప్పుకుంటూ, రాళ్లను పేర్చే ప్రతి క్షణంలోనూ ఒక తీపి కలను దృశ్యమానం చేసుకుంటారు. అమ్మ ఒడిలో సేదతీరుతున్న భావనతో మనసంతా ప్రశాంతత పొందుతారు. తరతరాల ఈ నమ్మకం భక్తికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తోంది.
(యాత్రికుల మనసులోని భావాలు పలికించే దృశ్యాలు వివరించే కథనం ఈ వీడియోలో చూడండి)


Read More
Next Story