Courtesy AI
x
వాకాడు సమీపంలోని తూపిలిపాలెం బీచ్.

తూపిలిపాలెం బీచ్ కి వీకెండ్ ట్రిప్ వేసేద్దామా!

తిరుపతి జిల్లాలోని ఈ సముద్రతీర ప్రాంతానికి ఎలా వెళ్లాలో వివరించే వీడియో స్టోరీ..


Click the Play button to hear this message in audio format

నగర జీవనానికి దూరంగా, సముద్రపు అలల సవ్వడుల మధ్య ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించాలని అనుకుంటున్నారా? తిరుపతి జిల్లా పరిధిలో తూపిలిపాలెం బీచ్ ఒక అద్భుతమైన డెస్టినేషన్. నీలిరంగు నీళ్ళు , బంగారం లాంటి ఇసుక తిన్నెలు ఇక్కడ ఉండే చెక్క వంతెన పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

రాయలసీమలోకి ఓ బీచ్, సముద్రం వచ్చి చేరిందంటే అది జిల్లాల విభజన వల్ల జరిగింది. గూడూరు నియోజకవర్గంలోని వాకాడు మండలం తూపిలిపాలెం గ్రామానికి అత్యంత సమీపంలోనే ఈ సముద్రపు ఒడ్డు ఆహ్లాదకరంగా ఉంటుంది. వాణిజ్యపరంగా ఎక్కువ ప్రచారం లేకపోవడంతో ఇక్కడ జనసంచారం తక్కువగా ఉన్నప్పటికీ, భద్రతాపరంగా కూడా ఇబ్బంది లేని వాతావరణంలో మత్స్యకారులు అండగా నిలుస్తారు.

తూపిలిపాలెంకు సమీపంలో ఫోటోషూట్లకు కూడా ఇది కేరాఫ్ అడ్రస్ గా మారింది ఇక్కడికి సముద్రంలోకి ప్రవేశించే చెక్క వంతెన ఫోటోలు రీల్ చేసుకోవడానికి అద్భుతమైన లొకేషన్.సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ప్రకృతి రమణీయత హృదయాన్ని రంజింప చేస్తుంది. ఉదయం సూర్యోదయాన్ని చూడడానికి ఇది అనువైన ప్రదేశం కూడా.

ఎలా వెళ్లాలంటే...

తిరుపతి నుంచి తూపిరిపాలెం బీచ్ వెళ్లాలంటే 80 కిలోమీటర్ల ప్రయాణించాలి. రోడ్డు మార్గంలో వ్యక్తిగత వాహనాలు, ద్విచక్ర వాహనాలలో కూడా ప్రయాణం చేయవచ్చు. తూపిలిపాలెం గ్రామం వద్దకు రెండు గంటల ప్రయాణంలో చేరుకోవచ్చు
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి నాయుడుపేట లేదంటే గూడూరు మీదుగా వాకాడకు బస్సులో వెళ్లవచ్చు. అక్కడి నుంచి లోకల్ ఆటోలో లేదా ప్రైవేట్ టాక్సీలు బైక్ ల మీద దోపిడి పాలెం బీచ్ వద్దకు సులభంగా చేరుకోవచ్చు.
తిరుపతి నుంచి నేరుగా తూపిలిపాలెం వరకు రైలు సదుపాయం లేదు. అయితే, తిరుపతి నుంచి గూడూరు లేదా నాయుడుపేట వరకు ఎక్స్ప్రెస్ లేదా ప్యాసింజర్ రైల్లో వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బీచ్ వద్దకు చేరుకోవచ్చు. తిరుపతి లేదా నాయుడుపేట, ఆ తర్వాత వాకాడు నుంచి కోట చిల్లకూరు రోడ్డు మీదుగా దోపిడిపాలెం బీచ్ వరకు సులువైన మార్గం.

అందమైన ప్రదేశాలు

ఇక్కడి తూపిలపాలెం సమీపంలో ఉన్న సముద్రం బీచ్ తో పాటు అందమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా పులికాట్ సరస్సు ఇక్కడ విస్తరించి ఉంటుంది. ఈ నీటిలో శీతాకాలంలో మాత్రమే వచ్చే ఫ్లెమింగో పక్షులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రదేశానికి సమీపంలో దుగరాజపట్నం బూడరేవు కూడా ఏర్పాటు కాబోతోంది. అంతేకాకుండా ఇక్కడికి సమీపంలోనే అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో స్పేస్ సెంటర్ కూడా దగ్గర్లోనే ఉంటుంది.
వాకాడు మండల కేంద్రం నుంచి టోపీల పాలెం గ్రామం వరకు ప్రయాణించడానికి చక్కటి రోడ్డు నిర్మాణం ఉంది. ఈ గ్రామానికి అత్యంత దగ్గరలోనే బీచ్ మనకు స్వాగతం పలుకుతుంది. ఈ ప్రదేశం ఇంకా అభివృద్ధికి నోచుకోని కారణంగా విశాలమైన ఇసుక తిన్నెలు నడక లేదా ఆహ్లాదంగా గడపడానికి అవసరమైన వాతావరణం ఇక్కడ ఉంది. మత్స్యకారుల నాటు పడవులు ఇక్కడ ఎక్కువగా నిలిపి ఉంచుతారు. ఇక్కడ నుంచి చేపల వేటకు వెళ్లడానికి కూడా ఈ తీర ప్రాంతాన్ని సమీప గ్రామాల మత్స్యకారులు ఉపయోగిస్తారు.
తూపిలపాళెం గ్రామానికి సమీపంలో ఉన్న ఈ బీచ్ లో ఇంకా కనీస సదుపాయాలు అందుబాటులో లేవు. ఆహారం తాగు నీరు వంటి సదుపాయాలు అక్కడ తక్కువగా ఉంటాయి. తూపిలిపాలెం గ్రామంలో ఉన్న దుకాణాలు, చిన్న హోటల్ నుంచి ఆహార పదార్థాలను తీసుకువెళ్లడానికి అందుబాటులో సేవలు అందించేవారు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఇసుకతిన్నెల్లె బ్యాటరీతో నాలుగు చక్రాల కారులో ప్రయాణించే సదుపాయాన్ని కొంతమంది నిరుద్యోగ యువకులు అందుబాటులో ఉంచారు.

వంతెన ప్రత్యేక ఆకర్షణ..

తూపిలిపాలెం బీచ్ కు సమీపంలోనే కనకమ్మ సత్రం అనే ప్రాంతం నుంచి ఇక్కడికి వెళ్లడం వెళ్ళవచ్చు. సముద్రంలో కొంత దూరం వరకు నిర్మించిన ఈ చెక్క వంతెన శిథిలావస్థకు చేరింది. అక్కడ ఫోటోలు తీసుకోవడానికి కానీ లేదా రియల్ చేసుకోవడానికి అద్భుతమైన లొకేషన్ అయినప్పటికీ, ప్రమాదాల గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఈ ప్రదేశంలో ఉన్న ఒక అద్భుతమైన సముద్రం పొదలు ఒక దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తుంది. విదేశాలలో ఉన్న అనుభూతిని కలిగించే స్థితిలో ఉన్న ఈ వాతావరణంలో ఫోటోషూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లకు కూడా ఇది నిలయంగా మారిందని వాకాడు సీఐ హెచ్ ఎస్ హుస్సేన్ బాషా కూడా చెప్పారు.

" జనం తక్కువగా ఉండడం. తక్కువ సంఖ్యలో వచ్చే వారికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం " అని సీఐ హుస్సేన్ భాషా తెలిపారు. జన సంచారం లేని ప్రాంతానికి వెళ్లే ముందు ప్రజలు ప్రధానంగా ప్రీ వెడ్డింగ్ షూట్లు నిర్వహించేవారు జాగ్రత్తలు పాటించాలి అని ఆయన సూచించారు.

తూపిలి పాలెం బీచ్ తీర ప్రాంతం కావడంతో పోలీస్ శాఖ పరంగానే కాకుండా మెరైన్ పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉంటారు. నిరంతరం ఈ ప్రాంతంలో గస్తే కూడా ఉంటుందనేది పోలీసులు చెబుతున్న మాట.
తిరుపతి జిల్లాలో అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు ఉంటే పర్యాటక డెస్టినేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. దోపిడి పాలెం బీచ్ ప్రాంతాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తో కలిసి ప్రణాళికలు అమలు చేస్తే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు సమీప గ్రామాల వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
" తూపిరిపాలెం బీచ్ వద్ద సదుప్రాయాలు కల్పిస్తే మేలు జరుగుతుంది. యువతకు ఉపాధి దొరుకుతుంది. చిరు వ్యాపారాలు కూడా మరింత అవకాశం ఉంటుంది" అని తూపిలిపాలెం గ్రామానికి చెందిన షేక్ నాసిర్ అభిప్రాయపడ్డారు.
తిరుపతి జిల్లా పరిధిలోకి చేరిన వాకాడు సమీపంలోని దోపిడి పాలెం మిగతా సముద్ర తీర ప్రాంతాల వద్ద పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అంశంపైన గ్రామస్తులకు కూడా అధికారులకు ప్రత్యేక వినతి చేశారు.
Read More
Next Story