
అంతరిక్షం నుంచి చూస్తే మన భూమి ఉదయిస్తున్న తీరు ఇలా..
"మన ఇల్లు ఎంత అద్భుతమో!" ఆకాశం నుంచి వచ్చిన అద్భుత చిత్రమాలిక
మనకు సూర్యోదయం, చంద్రోదయం తెలుసు. ఇప్పుడు భూమోదయం చూడండి.. ఆర్టెమిస్-2 ఉపగ్రహం పంపింది..
ఆకాశం నుంచి చూస్తే “మన ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో”.. ఆర్టెమిస్-2 వ్యోమగాముల భావోద్వేగం.
అమెరికా అంతరిక్ష సంస్థ NASA చేపట్టిన ప్రతిష్టాత్మక మిషన్ Artemis IIలో పాల్గొన్న వ్యోమగాములు, అంతరిక్షం నుంచి భూమిని చూసిన అనుభవాన్ని పంచుకుంటూ చెప్పిన మాట అది.
భూమి అందాన్ని అంతరిక్షం నుంచి చూడటం జీవితంలో మరిచిపోలేని క్షణమన్నారు. వాళ్లు పంపిన ఫోటోలు ఇవి.
ఈ ఉపగ్రహంలో ప్రయాణించిన నలుగురు వ్యోమగాములు రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టియనా కోచ్, జెర్మీ హన్సేన్ చంద్రగ్రహం నుంచి భూమిని వీక్షిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
వీరు ప్రయాణించిన వాహనం Orion spacecraft నుంచి తీసిన పలు ఫోటోలను కూడా నాసా సెంటర్ కు పంపారు.
వ్యోమగాములు చెప్పినట్లు, చంద్రుని దగ్గర్లోని ఫ్లైబై సమయంలో తీసిన దృశ్యాలు చాలా ప్రత్యేకంగా నిలిచాయి.
భూమి ఒక చిన్న నీలి గోళంలా కనిపించడం, చంద్రుని ఉపరితలం క్రేటర్లతో స్పష్టంగా కనిపించడం విశేషం.
సుమారు 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు తీసిన ఈ చిత్రాలు అంతరిక్ష ప్రయాణంలో అరుదైన విజువల్స్‌గా గుర్తింపు పొందాయి.
వ్యోమగాములు తమ అనుభూతులను వివరిస్తూ, “భూమి సరిహద్దులు లేకుండా ఒకే ఇంటిలా కనిపిస్తుంది” అని పేర్కొన్నారు.
అంతరిక్షం నుంచి భూమిని చూడటం మనిషిలో ఒక కొత్త అవగాహనను కలిగిస్తుందని తెలిపారు.
ఇది “Overview Effect” అనే భావనను మరింత బలంగా అనుభవించే అవకాశం ఇస్తుందని చెప్పారు.
చంద్రుడి దగ్గర ప్రయాణిస్తున్న సమయంలో ఎదురైన నిశ్శబ్దం, నక్షత్రాల మధ్య ఒంటరితనం, భూమి దూరంగా కనిపించే దృశ్యాలు- ఇవన్నీ కలిసి ఒక అసాధారణ అనుభవాన్ని ఇచ్చాయన్నారు వ్యోమగాములు.
ముఖ్యంగా భూమి ఉదయించే దృశ్యం (Earthrise) చూసిన క్షణాలు అత్యంత భావోద్వేగంగా నిలిచాయని వారు పేర్కొన్నారు.
వ్యోమగాములు తమ అనుభూతులను పంచుకుంటూ, భూమిని అంతరిక్షం నుంచి చూడటం అత్యంత భావోద్వేగ అనుభవమని తెలిపారు. చంద్రుడి ఉపరితలం మాత్రం పూర్తిగా భిన్నమైన, జీవం లేని ఓ అద్భుత ప్రపంచంలా అనిపించిందని చెప్పారు.
ఇక deep spaceలో ప్రయాణిస్తున్న సమయంలో ఏర్పడే నిశ్శబ్దం, నక్షత్రాల మధ్య ఒంటరితనం వంటి అనుభూతులు మనిషి స్థితిని మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేస్తాయని వ్యోమగాములు అభిప్రాయపడ్డారు.
Next Story

