శ్రీవారి కైంకర్యంలో సాధారణ టైలర్.. అరుదైన అదృష్టం!
రూపాయి ఆశించకుండా 27 ఏళ్లుగా కాసోళ్ల సేవలో.. శ్రీవారి ఆలయానికి 'పరదాలు' కుడుతున్న భక్తుడి విశేష కథకు వీడియో రూపం
27 ఏళ్లుగా భక్తి సంప్రదాయం, ఏడాదికి నాలుగుసార్లు పరదాల సమర్పణ, నెలపాటు పవిత్ర పరదాల తయారీ. వృత్తినే ఇలవేల్పు సేవగా మార్చుకున్న తిరుపతి టైలర్ మణి
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిత్యం ఎన్నో కైంకర్యాలు, సంప్రదాయాలు జరుగుతుంటాయి. అందులో అత్యంత పవిత్రమైనది గర్భాలయం, ఇతర కీలక ద్వారాల వద్ద పరదాలు (తెరలు), కురాళాలు అమర్చడం. తిరుపతికి చెందిన టైలర్ 'మణి' (సుబ్రహ్మణ్యం) గత 27 ఏళ్లుగా ఎలాంటి ఎలాంటి ప్రతిఫలం ఆశించుకుండా, ఉచితంగా ఈ పరదాలను తయారు చేసి టీటీడీకి సమర్పిస్తున్నారు. ఆలయ అధికారులు కూడా ఈ భక్తుడి పవిత్ర సంకల్పాన్ని గుర్తించి, దీన్ని ఒక ఆనవాయితీగా మార్చడం విశేషం.
ఏడాదికి ఎన్ని పరదాలు? ఎన్ని రోజులు పడుతుంది?
తిరుమల శ్రీవారికి టైలర్ మణి ఏటా 4 సార్లు శ్రీవారి ఆలయానికి పరదాలు, కురాళాలు సమర్పిస్తారు. ముఖ్యంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి సందర్భాల్లో) సమయానికి ముందు ఇవి ఆలయానికి చేరుతాయి. ప్రతిసారీ మూడు రకాల ప్రత్యేక పరదాలు, రెండు కురాళాలను అందిస్తారు.
ఎన్ని రోజులు పడుతుంది?
ఈ పవిత్ర వస్త్రాలను తయారు చేయడానికి మణికి ఒక నెల రోజులు (30 రోజులు) పడుతుంది.
ఈ పరదాలు కుట్టే నెల రోజుల పాటు ఆయన ప్రత్యేక దీక్షా వస్త్రాలు ధరించి, ఎంతో నిష్ఠతో, స్వయంగా తన చేతులతోనే డిజైన్ చేసి కుడతారు.
కళానైపుణ్యం: ఆధ్యాత్మిక రూపుసాధారణ వస్త్రాలుగా కాకుండా, శ్రీవారి వైభవాన్ని చాటేలా ఈ పరదాలు రూపొందుతాయి.
గర్భాలయ జయవిజయ ద్వారాలు: జయవిజయుల వద్ద అమర్చే పరదాలపై గరుడ వాహనరూఢుడైన శ్రీనివాసుడు, కామధేనువు, శంఖుచక్రాలు, శ్రీవారి తిరునామాలు వర్ణశోభితంగా రూపుదిద్దుకుంటాయి.రాములవారి మేడ & కులశేఖర పడి: శ్రీరాములవారి మేడ వద్ద అమర్చే వస్త్రాలపై శ్రీలక్ష్మీదేవి, శ్రీ పద్మావతి అమ్మవార్ల ప్రతిమలు ప్రతిఫలిస్తాయి. పరదాల తయారీ పూర్తయిన తర్వాత మణి తిరుపతి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుని, స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరించి, అత్యంత భక్తిశ్రద్ధలతో టీటీడీ అధికారులకు వీటిని అందజేస్తారు. భక్తికి, నిష్కామ సేవకు ప్రతీకగా నిలిచిన మణి కథ ప్రతి శ్రీవారి భక్తుడికి ప్రేరణగా నిలుస్తుంది.
Next Story

