ఎగ్జిట్ పోల్స్ లైవ్..
x

ఎగ్జిట్ పోల్స్ లైవ్..

పశ్చిమ బెంగాల్‌, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు..


Click the Play button to hear this message in audio format

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికలు నేటితో ముగిశాయి. రెండో దశలో బెంగాల్‌లో రికార్డు స్థాయిలో 90 శాతం ఓటింగ్ నమోదైంది. కేరళ, అస్సాంలలో అధికార ప్రభుత్వాలు తమ పట్టును నిలుపుకోనున్నాయా? తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో హోరాహోరీగా సాగిన ప్రచారాలు ఓటర్లను ప్రభావితం చేశాయా, పుదుచ్చేరి కీలక పోరులో ఎవరికి ఆధిక్యం ఉంది అన్నది త్వరలో తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఈ అంచనాలు ప్రస్తుత ప్రభుత్వాల పరిస్థితిపై మొదటి సంకేతాలు ఇస్తాయి. కేరళ, అస్సాంలో అధికార పార్టీలు తమ స్థానాన్ని నిలబెట్టుకున్నాయా అనే విషయం తెలిసే అవకాశం ఉంది. అలాగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన గట్టిపోటీ ప్రచారం ఓటర్లపై ఎలా ప్రభావం చూపిందో కూడా అర్థమవుతుంది. పుదుచ్చేరి పోరులో ఎవరు ముందంజలో ఉన్నారో కూడా ఈ అంచనాలు సూచించవచ్చు. అయితే అసలు ఫలితాలు మే 4న ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రమే స్పష్టమవుతాయి. అప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలు కొనసాగనున్నాయి.

Live Updates

  • 29 April 2026 7:04 PM IST

    పుదుచ్చేరిలో All India NR Congress..

    పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కీలక అంచనాలను వెలువరించాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. 30 స్థానాలున్న అసెంబ్లీలో All India NR Congress‌కు 16 నుంచి 19 స్థానాలు లభించే అవకాశం ఉంది. దీంతో ఆ పార్టీ స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    ఇదే సమయంలో కాంగ్రెస్‌కు 10 నుంచి 12 స్థానాలు దక్కవచ్చని అంచనా. నటుడు విజయ్ స్థాపించిన TVK (Tamilaga Vettri Kazhagam) పుదుచ్చేరిలో తొలి సారి పోటీ చేస్తుండగా, ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆ పార్టీకి ఒక్క స్థానమూ దక్కకపోవచ్చని సూచించింది. ఇతరులు 1 నుంచి 2 స్థానాలు గెలిచే అవకాశముందని తెలిపింది.

    ఈ అంచనాలు నిజమైతే, ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలోని NR కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారాన్ని కొనసాగించే అవకాశం ఉంది. అధికారిక ఫలితాలు మే 4న వెల్లడించబడనున్నాయి.

  • 29 April 2026 7:01 PM IST

    కేరళలో UDFకు 75 నుంచి 85 స్థానాలు..

    కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం.. 140 స్థానాలున్న అసెంబ్లీలో యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (UDF)కు 75 నుంచి 85 స్థానాలు లభించే అవకాశం ఉందని అంచనా. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ కూటమి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఇదే సమయంలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (LDF)కు 55 నుంచి 65 స్థానాలు మాత్రమే దక్కవచ్చని ఎగ్జిట్ పోల్ సూచిస్తోంది. ఈ అంచనాలు నిజమైతే, ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది గట్టి దెబ్బ. ఇతర పార్టీలు గరిష్టంగా 3 స్థానాలు గెలుచుకునే అవకాశముందని పేర్కొంది.

    ఈ ఫలితాలు అమల్లోకి వస్తే, UDF మళ్లీ అధికారంలోకి రావడం ద్వారా LDF వరుసగా రెండోసారి అధికారంలో కొనసాగాలన్న ఆశలకు తెరపడే అవకాశం ఉంది. కాగా, అసలు ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.

  • 29 April 2026 6:59 PM IST



Read More
Next Story